తెలంగాణాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు అదుపుతప్పి బోల్తా పడటంతో సాగర్ రింగ్ రోడ్డు నెత్తురోడింది. ఈ ఘోర ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
వివరాల్లోకి వెళితే నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం ధైర్యపురి తండా వద్ద హైదరాబాద్‌నుంచి మల్లెపల్లి వెళ్తున్న కారు అదుపుతప్పి.వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కృష్ణా నీటి సరఫరా దిమ్మెను బలంగా ఢీకొట్టి బోల్తాపడింది. దీంతో వాహనంలో ప్రయాణిస్తున్న ఐదుగురు తీవ్రంగా గాయపడి దుర్మరణం పాలయ్యారు. అతివేగం మరియు నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగినట్లు నిర్దారించారు.
వాహనం నడుపుతున్న వ్యక్తి నిద్రమత్తులో ఉండి నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. కారులోని మృతదేహాలను బయటకు తీసి, పోస్ట్‌మార్టం కోసం తరలించారు.ప్రమాద ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. .హైదరాబాద్‌లోని మలక్‌పేటకు చెందిన నాగేంద్ర(28), వేముల భరత్ (24), గణేష్(26), వీరితోపాటు మరో ఇద్దరు స్నేహితులను మృతులుగా గుర్తించారు.