డ్యాన్స్ రియాలిటీ షో ‘ఆట’ మొదటి సీజన్ విన్నర్ టీనా సాధు(Tina sadhu) మరణం నిజానికి అందరికీ షాక్ నిచ్చింది. చాలా యాక్టీవ్. రోజూ డాన్స్ ప్రాక్టీస్. ఇంకా చిన్న వయస్సు. అందుకే టీనా మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆట మొదటి సీజన్‌కు ఆమే విన్నర్. ఆ షో నాలుగో సీజన్‌కు జడ్జిగానూ వ్యవహరించారు. ఇండస్ట్రీకి దూరమైయ్యారు. గోవాలో రఘు అనే వ్యక్తిని వివాహం చేసుకుని టీనా అక్కడే నివసిస్తోంది.
కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చిన టీనా, యాంకర్ శిల్పాచక్రవర్తిని కలిసిందని, డ్యాన్స్ షోల్లో రీఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మళ్లీ గోవా వెళ్లిపోయిన టీనా ఇంట్లో లిక్కర్ ఎక్కువ తీసుకుందని, అందుకే ఆమెకు గుండెపోటు వచ్చిందని ఆమె ఫ్యామిలీ చెబుతున్నట్లు వార్త వైరల్ అయ్యింది. ఇది నిజమా? మరేమైనా కారణముందా? తెలియాల్సి ఉంది. టీనా సోషల్ మీడియాలో చివరిసారిగా షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
74495