జోధ్ పూర్ లో అమెరికా “జార్జ్ ఫ్లాయిడ్” తరహా ఘటన ఒకటి జరిగింది. 20 డాలర్ల దొంగనోటుని ఇచ్చాడన్న కారణంతో జార్జ్ ఫ్లాయిడ్ ను ఒక పోలీస్ మెడపై కాలితో అదిమిపట్టడంతో ఊపిరి ఆడక మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ ఘటన కారణంగా ఇప్పుడు అమెరికా అట్టుడుకుతోంది. అదే తరహాలో రాజస్థాన్ రాష్ట్రంలో ఒక ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక వ్యక్తి మాస్క్ ధరించలేదన్న కారణంతో పోలీసులు కాళ్లతో ఆ వ్యక్తి మెడను తొక్కి పెట్టి చితకబాదారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
వివరాల్లోకి వెళితే రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ఒక వ్యక్తి మాస్క్ ధరించలేదు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని దురుసుగా ప్రవర్తించారు.. అందరూ చూస్తుండగానే అతని మెడను కాలితో తొక్కిపట్టారు. మిగిలిన పోలీసులు కూడా చుట్టూ చేరి ఆ వ్యక్తిని కాళ్లతో తొక్కి పట్టి చితకబాదారు. దీంతో సదరు వ్యక్తి కూడా పోలీసులపై తిరగబడ్డాడు. దాంతో పోలీసులు మరింత చితకబాదారు.
పోలీసులు ఆ వ్యక్తి పట్ల వ్యవహరించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పలువురు ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఈ సంఘటనను అమెరికాలో జరిగిన జార్జ్ ఫ్లాయిడ్ ఘటనతో పోలుస్తూ వ్యాఖ్యానిస్తున్నారు. పోలీసుల దురుసు ప్రవర్తన పట్ల సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల పట్ల పోలీసులు ఇంత దురుసుగా ప్రవర్తించడం మంచిది కాదని సంబంధిత పోలీసుల మీద చర్యలు తీసుకోవాలని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.