iDreamPost

AP: బ్లాక్‌ పేపర్‌ స్కామ్‌.. 30 లక్షలకు 3 కోట్లు.. కట్‌ చేస్తే

  • Published Feb 21, 2024 | 1:10 PMUpdated Feb 21, 2024 | 1:10 PM

దేశంలో నకిలీ కరెన్సీ దందా అనేది సంచలనం సృష్టిస్తుంది. ఈ ఫేక్ కరెన్సీ ముసుగులో అమాయకులకు వల వేసి మోసం చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు కొత్తగా కలర్ నకిలి కరెన్సీ అనేది రాష్ట్రం లో కలకలం రేపుతోంది. ఇంతకి అదేమిటంటే..

దేశంలో నకిలీ కరెన్సీ దందా అనేది సంచలనం సృష్టిస్తుంది. ఈ ఫేక్ కరెన్సీ ముసుగులో అమాయకులకు వల వేసి మోసం చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు కొత్తగా కలర్ నకిలి కరెన్సీ అనేది రాష్ట్రం లో కలకలం రేపుతోంది. ఇంతకి అదేమిటంటే..

  • Published Feb 21, 2024 | 1:10 PMUpdated Feb 21, 2024 | 1:10 PM
AP: బ్లాక్‌ పేపర్‌ స్కామ్‌.. 30 లక్షలకు 3 కోట్లు.. కట్‌ చేస్తే

దేశంలో ఓ వైపు సైబర నేరగాళ్లు హవా నడుస్తుంటే.. మరో వైపు నకిలీ కరెన్సీ దందా అనేది హల్‌చల్‌ చేస్తుంది. ప్రస్తుత కాలంలో ఈజీగా డబ్బు సంపాదించలనే ఆశతో చాలామంది రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. వాటిలో ఈ నకీలి కరెన్సీ చలామణి కూడా ఒకటి. ఇలా బ్లాక్ కరెన్సీ పేరుతో చాలామంది అమాయకుపు ప్రజల్నీ బురిడీ కొట్టిస్తున్నారు. ఇటీవలే చాలా ప్రాంతాల్లో నల్ల కాగితాలను కరెన్సీ నోట్లుగా మారుస్తామంటూ మోసం చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి. అయితే, తాజాగా ఇప్పుడు కొత్తగా కలర్ నకిలి కరెన్సీ అనేది కలకలం రేపుతోంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఈ మధ్యకాలంలో కోట్లు రూపాయలు సంపాదించాలనే ఆశతో రాష్ట్రంలో నకిలీ నోట్ల ముఠాలు చెలరేగిపోతున్నాయి. ఇలా లక్షలు సంపాదించివచ్చాని అమాయకుల పై ఫేక్ కరెన్సీ ముఠాలు వల విసురుతున్నాయి. ఈ క్రమంలోనే.. తాజాగా బ్లాక్ కలర్ లో ఉన్న ఈ ఫేక్ కరెన్సీ నోట్లు లిక్విడ్ లో ముంచి తీస్తే ఒరిజినల్ నోట్లుగా మారతాయని నమ్మించి మోసం చేస్తున్నా ఘటన విశాఖలో చోటుచేసుకుంది. విశాఖ సిటీ డీసీపీ మేకా సత్తిబాబు తెలిపిన వివరాల ప్రకారం..విశాఖ కాకాని నగర్ కు చెందిన భాస్కర రాజుకు.. అన్నవరం కి చెందిన గన్ని రాజు అనే వ్యక్తి తో పరిచయం ఏర్పడింది. అయితే ఈ క్రమంలోనే.. గనిరాజు బ్లాక్ కలర్ లో ఉన్న ఫేక్ కరెన్సీ నోట్లు లిక్విడ్ లో ముంచి తీస్తే ఒరిజినల్ నోట్లు గా మారుతాయని నమ్మించాడు భాస్కర్ రాజుకు నమ్మించాడు. దీంతో అతడి మాటాలు నమ్మిన భాస్కర్ రాజు.. గనిరాజు దగ్గరకు వెళ్లడంతో అతడు రెండు బ్లాక్ నోట్లు లిక్విడ్ లో ముంచి క్లిన్ చేసి వాటిని షాపులో మార్చాడు. ఇక ఆ నోట్లు చెల్లుబాటు కావడంతో గన్నిరాజు మాయలో భాస్కర రాజు పడ్డాడు.

దీంతో గనిరాజు తన వద్ద ఇలాంటి కరెన్సీ నోట్లు చాలానే ఉన్నాయని చెప్పడంతో.. ఇటువంటి కరెన్సీ తయరు చేయాలని భాస్కర్ రాజు సూచించాడు. ఈ క్రమంలోనే.. 3 కోట్ల విలువ చేసే బ్లాక్ నోట్లకు గాను.. 30 లక్షల అసలు నోట్లు ఇవ్వాలని గన్నిరాజు చెప్పడంతో ఇద్దరు డీల్ కుదర్చుకున్నారు. అయితే డీల్ ప్రకారం.. మొదట 30లక్షల అసలు కరెన్సీ ఇచ్చి, 3కోట్ల విలువైనవిగా చెప్పి బ్యాగుల్లో బ్లాక్ పేపర్ కరెన్సీ అప్పగించ్చాడు గన్నిరాజు. అయితే ఆ బ్లాక్ పేపర్ కరెన్సీ తీసుకున్న భాస్కరాజు.. వెస్ట్ గోదావరి కి చెందిన మద్దాల శ్రీనివాసరావుతో కలిసి కారులో విశాఖ బయలుదేరాడు.

అయితే, ఈ విషయం పై పోలీసులకు సమాచారం అందడంతో.. రంగంలోకి దిగిన డెకాయ్ ఆపరేషన్ చేపట్టారు. దీంతో స్పాట్ లో భాస్కర్ రాజు తో పాటు మద్దాల శ్రీనివాసరావును తీసుకొని అదుపులోకి తీసుకున్నారు. అలాగే వారిని విచారించగా.. వారి దగ్గర ఉన్న మూడు కోట్ల విలువని చెబుతున్న బ్లాక్ ఫేక్ కరెన్సీ, మూడు సెల్ ఫోన్లు, ఓ కార్, 50వేల నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పైగా నిందితులను సెక్షన్ ఎ 489 కింద కేసు నమోదు చేశారు డీసీపీ సత్తిబాబు. అయితే బ్లాక్ కరెన్సీ ఇచ్చినా.. వాటిని అసలుగా మార్చేందుకు కడిగే లిక్విడ్ ను మాత్రం గన్నిరాజు ఇవ్వలేదని నిందితులు విచారణలో తెలిపారు.

కాగా, ఈ మూడు బ్యాగుల్లో పట్టుబడిన బ్లాక్ పేపర్ కట్టలను పోలీసులు తనీఖి చేశారు. అయితే అవి చూడటానికి నల్లగా అనిపిస్తున్నా.. కాస్త దగ్గర నుంచి చూస్తే ఆ నల్లటి కోటింగు వెనుక 500 రూపాయల కరెన్సీ నోటులానే కనిపిస్తోందని తెలిపారు. అలాగే కరెన్సీ నోట్పై ముద్రించే చిహ్నాలు, అక్షరాలు, గుర్తులు అన్ని ఉన్నాయని చెప్పారు. అయితే ఈ బ్లాక్ పేపర్ కరెన్సీ తయారు చేయాలంటే.. కచ్చితంగా టెక్నాలజీ మిషనరీ అవసరం ఉంటుందని.. పైగా దీని వెనుక చాలా ముఠా పని చేస్తుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఇక ప్రధాన నిందితుడు గని రాజు మాత్రం పరారిలో ఉన్నాడు. అతని కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. అలాగే ఇటువంటి నోట్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిసిపి సూచిస్తున్నారు. మరి, బ్లాక్ కలర్ లో ఉన్నా ఫేక్ కరెన్సీ చాలామణి పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి