iDreamPost

హనుమాన్‌ ఖాతాలో మరో రికార్డు.. మామూలు విషయం కాదు!

హనుమాన్‌ వరుస రికార్డులను క్రియేట్‌ చేస్తోంది. కలెక్షన్ల విషయంలో మాత్రమే కాదు.. చాలా విషయాల్లో పెద్ద సినిమాలకు మించి ముందుంటోంది. ఈ మూవీ దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 150 కోట్ల రూపాయలు కలెక్ట్‌ చేసింది.

హనుమాన్‌ వరుస రికార్డులను క్రియేట్‌ చేస్తోంది. కలెక్షన్ల విషయంలో మాత్రమే కాదు.. చాలా విషయాల్లో పెద్ద సినిమాలకు మించి ముందుంటోంది. ఈ మూవీ దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 150 కోట్ల రూపాయలు కలెక్ట్‌ చేసింది.

హనుమాన్‌ ఖాతాలో మరో రికార్డు.. మామూలు విషయం కాదు!

టాలీవుడ్‌ యంగ్‌ అండ్‌ డైనమిక్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ- యంగ్‌ హీరో తేజ సజ్జ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘హనుమాన్‌’ మూవీ రికార్డుల మీద రికార్డులు క్రియేట్‌ చేస్తోంది. మొదటి రోజు ఈ సినిమా 20 కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్‌ చేసింది. అంతేకాదు! వారం రోజుల్లోనే 150 కోట్ల రూపాయలు కలెక్ట్‌ చేసింది. స్టార్‌ హీరోల మూవీలను మించి దూసుకుపోతోంది. థియేటర్లలో 90 శాతం ఆక్యుపెన్సీ ఉంటోంది. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగానే కాదు.. దేశ వ్యాప్తంగా మూవీ మంచి వసూళ్లను రాబడుతోంది.

9 రోజులు అవుతున్నా స్పందన మాత్రం తగ్గటం లేదు. ముఖ్యంగా హైదరాబాద్‌లో థియేటర్లు నిండుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హనుమాన్‌ ఖాతాలోకి ఓ కొత్త రికార్డు వచ్చి చేరింది. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లో మూవీ 9 రోజుల్లోనే కోటి రూపాయల కలెక్షన్లు రాబట్టింది.  ఏ స్టార్‌ హీరోకు సాధ్యం కాని రికార్డును సాధించింది. కాగా, ఈ సినిమాలో హీరో తేజ సజ్జ సరసన అమృత అయ్యర్‌ నటించారు. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, వినయ్‌ రాయ్‌, వెన్నెల కిశోర్‌, సముద్రఖని, గెటప్‌ శ్రీను కీలక పాత్రల్లో కనిపించారు.

ఈ మూవీ సంక్రాంతి సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనవరి 12వ తేదీన తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్‌ అయింది. ఈ మూవీ విడుదల సందర్భంగా మూవీ టీం ఓ ప్రామిస్‌ చేసింది. హనుమాన్‌ ప్రతీ టికెట్‌నుంచి ఓ 5 రూపాయల్ని అయోధ్య రామమందిరం కోసం ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. టికెట్ల మీద రూ.5 చొప్పున సుమారు 2 కోట్ల 66 లక్షల 41 వేల 055 రూపాయలు అయోధ్య రామ మందిరానికి విరాళంగా ఇచ్చింది.

ఈ మూవీకి 53,28,211 టికెట్లు అమ్ముడయ్యాయి. ఒక్కో టికెట్‌ మీద రూ.5 చొప్పున.. మొత్తం 2,66,41,055 కోట్ల రూపాయలు అయోధ్య రామ మందిర ట్రస్ట్‌కు విరాళంగా ఇచ్చారు నిర్మాతలు. హనుమాన్‌ నిర్మాతలు చేసిన పనికి సోషల్‌ మీడియాలో ప్రశసంలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, హనుమాన్‌ కేవలం 30 కోట్ల రూపాయలతో తెరకెక్కినట్లు తెలుస్తోంది. అయినప్పటికి గ్రాఫిక్స్‌ విషయంలో అద్భుతమైన అవుట్‌ను సొంతం చేసుకుంది. మరి, హనుమాన్‌ మూవీ సాధించిన ఈ తాజా రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి