iDreamPost

కొత్త పద్దతిలో 10వ తరగతి పరీక్షలు

కొత్త పద్దతిలో 10వ తరగతి పరీక్షలు

కరోనా వైరస్ సమస్య నేపధ్యంలో జూలైలో 10వ తరగతి పరీక్షలను నూతన పద్దతిలో నిర్వహించాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. కొత్త పద్దతి ఏమిటంటే విద్యార్ధులు ఎక్కడుంటే అక్కడి నుండే పరీక్షలు రాయించే వెసులుబాటు కల్పించాలని డిసైడ్ అయ్యింది. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అమలులో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. వైరస్ సమస్య కారణంగా విద్యాసంస్ధలు మూసేయటంతో చాలా మంది విద్యార్ధులు తమ సొంతూర్లకు వెళ్ళిపోయారు.

సొంతూర్లలో ఉన్న విద్యార్ధులను పరీక్షల పేరుతో మళ్ళీ పరీక్షలు నిర్వహించే సెంటర్లకు పిలిపించాలంటే సాధ్యంకాదు. ఎందుకంటే రవాణా సౌకర్యాలు లేని కారణంగా విద్యార్ధులను పిలిపించటం జరిగే పనికాదు. దాదాపు 6 లక్షల మంది విద్యార్ధులు పదవ తరగతి పరీక్షలు రాయబోతున్నారు. వీళ్ళకోసం సుమారు 5 వేల కేంద్రాలను రెడీ చేయాలంటే జరిగేపని కాదు. అందుకనే సొంతూళ్ళల్లో ఉన్న విద్యార్ధులను ఎక్కడికక్కడే ఉంచి వాళ్ళతో పరీక్షలు రాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అంటే ప్రభుత్వం తాజా నిర్ణయం ప్రకారం ఏ ఊరిలో ఉన్న విద్యార్ధులు వాళ్ళిచ్చే అడ్రస్ ప్రకారం వాళ్ళ ఊర్లలోనే సమీపంలోనే ఉండే ఇంటర్నెట్ కేంద్రాల్లోనే లేకపోతే సౌకర్యం ఉంటే వాళ్ళ ఇళ్ళల్లోను అదీకాకపోతే వాళ్ళు చెప్పిన ప్రకారం ఇంటర్నెట్, కంప్యూటర్ సౌకర్యం ప్రకారమే పరీక్షలు రాయించాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. నిజానికి 100 శాతం ఆచరణసాధ్యం కాని వ్యవహారమన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇంతకన్నా అందుబాటులో ఉన్న మార్గం కూడా లేదు.

మొత్తం విద్యాసంవత్సరమే డిస్ట్రబ్ అయిపోయిన నేపధ్యంలో ఏదో విధంగా 10వ తరగతి పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం అనుకున్నది.

దేశంలోని అన్నీ రాష్ట్రాలు ఎవరికి అందుబాటులో ఉన్న మార్గాలను వెతుక్కుంటున్నాయి. ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం అయితే అసలు పరీక్షలే నిర్వహించకుండా ఆల్ పాస్ అని ప్రకటించేసింది. ఏపి ప్రభుత్వం మాత్రం పరీక్షలు నిర్వహించాలని అనుకున్నా ఏ విధంగా సాధ్యమో ఇంతకాలం ఆలోచించింది. మొత్తానికి విద్యార్ధుల ఛాయిస్ ప్రకారం వాళ్ళ ఇళ్ళ దగ్గరలోని కేంద్రాల నుండే పరీక్షలు రాసే వెసులుబాటు కల్పించాలని డిసైడ్ అయ్యింది. చూడాలి మరి ఆచరణలో ఎలా సాధ్యమవుతుందో ?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి