iDreamPost

OTT లోకి సంజయ్‌ లీలా భన్సాలీ భారీ బడ్జెట్ వెబ్ సిరీస్.. తెలుగులో కూడా..

  • Published Apr 30, 2024 | 11:51 AMUpdated Apr 30, 2024 | 11:51 AM

చాలా మంది ఈ వెబ్ సిరీస్ ఎప్పుడు వస్తుందా అని ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో మరికొద్ది గంటల్లో ఈ వెబ్ సిరీస్ అందరి ముందుకు రాబోతుంది. అదే సంజయ్ లీల భన్సాలీ డైరెక్ట్ చేసిన "హీరామండి".

చాలా మంది ఈ వెబ్ సిరీస్ ఎప్పుడు వస్తుందా అని ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో మరికొద్ది గంటల్లో ఈ వెబ్ సిరీస్ అందరి ముందుకు రాబోతుంది. అదే సంజయ్ లీల భన్సాలీ డైరెక్ట్ చేసిన "హీరామండి".

  • Published Apr 30, 2024 | 11:51 AMUpdated Apr 30, 2024 | 11:51 AM
OTT లోకి సంజయ్‌ లీలా భన్సాలీ భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..  తెలుగులో కూడా..

ఇండియాలోనే ఇప్పటివరకు ఓ వెబ్ సిరీస్ చిత్రీకరించడానికి.. అత్యంత భారీ బడ్జెట్ ను కేటాయించారు. ఈ వెబ్ సిరీస్ మరి కొద్దీ గంటల్లో ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లోకి అందుబాటులోకి రానుంది. అందరు ఆశించినట్లుగానే ఈ వెబ్ సిరీస్ ప్రతి ఒక్కరిని మెప్పిస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఈ ఏడాదిలోనే అన్నిటికంటే మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ గా ఈ వెబ్ సిరీస్ నిలిచింది. ఆ వెబ్ సిరీస్ మరేదో కాదు.. బాలీవుడ్ టాప్ డైరెక్టర్ సంజయ్ లీల భన్సాలీ డైరెక్ట్ చేసిన.. “హీరామండి”. ఈ వెబ్ సిరీస్ మే 1 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్.. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. అసలు ఎందుకు ఈ సిరీస్ గురించి ఇంత హైప్ క్రియేట్ అయింది. ఈ సిరీస్ లో ఏముంది అనే విషయానికొస్తే..

ఇప్పటివరకు ఓ వెబ్ సిరీస్ కు భారీ బడ్జెట్ ను కేటాయించిందే లేదు. అలాంటిది ఈ వెబ్ సిరీస్ కు ఏకంగా రూ.200 కోట్లు బడ్జెట్ ను కేటాయించారు. హీరామండి ది డైమండ్ బజార్ వెబ్ సిరీస్ కోసం చాలా నెలల నుంచి.. ఓటీటీ లవర్స్ ఎదురుచూస్తున్నారు.వెండి తెరపైన ఎన్నో అద్భుతమైన చిత్రాలను తీసిన సంజయ్ లీల భన్సాలీ. తొలిసారి.. బుల్లి తెరపై అరంగేంట్రం చేస్తున్నాడు. దీనితో ఈ వెబ్ సిరీస్ పైన అందరికి ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు వచ్చిన అన్ని వెబ్ సిరీస్ ల కంటే కూడా .. ఈ వెబ్ సిరీస్ కు అధిక బడ్జెట్ ను కేటాయించడం విశేషం. ఈ వెబ్ సిరీస్ లో బాలీవుడ్ ప్రముఖ నటీమణులు.. నటి మనీషా కొయిరాలాతోపాటు సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్ లాంటి వాళ్లు నటించారు. ఇక ఈ వెబ్ సిరీస్ హిందీతో పాటు.. తెలుగులోనూ అందుబాటులో ఉండడంతో.. తెలుగు ప్రేక్షకులు కూడా ఎంచక్కా ఈ వెబ్ సిరీస్ ను చూసేయొచ్చు.

హీరామండి సిరీస్ కథ విషయానికొస్తే.. భారతదేశం బ్రిటిష్ పరిపాలనలో ఉన్న కాలంలో .. అంటే 1940ల కాలం బ్యాక్డ్రాప్ తో ఈ సిరీస్ ను రూపొందించారు. హీరామండీ అనే రెడ్ లైట్ ప్రాంతంలో.. జీవనం సాగించే కొంతమంది డ్యాన్సర్స్ జీవితాల గురించి.. ఈ సిరీస్ లో చూపించారట. ఆ కాలంలో మహిళలు ఎదుర్కున్న ఎన్నో సమస్యలను.. ఈ సిరీస్ లో కళ్ళకు కట్టినట్లు చూపించడం జరిగిందని సమాచారం. ఓ విధంగా “హీరామండి: ది డైమండ్ బజార్”.. బ్రిటిష్ కాలం నాటి పాలనకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్య్ర ఉద్యమ సమయం నాటి కథ అని ప్రచారంలో ఉంది. అసలు ఈ కథలో ఏముందో తెలుసుకోవాలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే. మరి ఈ సిరీస్ ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో వేచి చూడాలి. మరి ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి