iDreamPost

ప్రభాస్ సినిమా ఫంక్షన్‌కి 6 లక్షల మంది. అది చూసే హీరో అవ్వాలనుకున్నా: నవీన్ చంద్ర

ఓటీటీల్లో అలరిస్తున్న హీరో నవీన్ చంద్ర. భానుమతి రామకృష్ణ, పరంపర, రిపీట్ ఇప్పుడు ఇన్ స్పెక్టర్ రిషి. ఓటీటీ చిత్రాలు, వెబ్ సిరీస్‌లతో అలరిస్తున్న ఈ బళ్లారి కుర్రాడు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. తాను హీరో అవ్వడానికి కారణాలు వెల్లడించాడు.

ఓటీటీల్లో అలరిస్తున్న హీరో నవీన్ చంద్ర. భానుమతి రామకృష్ణ, పరంపర, రిపీట్ ఇప్పుడు ఇన్ స్పెక్టర్ రిషి. ఓటీటీ చిత్రాలు, వెబ్ సిరీస్‌లతో అలరిస్తున్న ఈ బళ్లారి కుర్రాడు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. తాను హీరో అవ్వడానికి కారణాలు వెల్లడించాడు.

ప్రభాస్ సినిమా ఫంక్షన్‌కి 6 లక్షల మంది. అది చూసే హీరో అవ్వాలనుకున్నా: నవీన్ చంద్ర

వర్సటైల్ యాక్టర్ నవీన్ చంద్ర.. సినిమాలతో కన్నా.. వెబ్ సిరీస్‌, సినిమాలతోనే హిట్ కొడుతున్నాడు. ఇప్పుడు అతడు ఓటీటీ స్టార్‌గా మారిపోయాడు. అందాల రాక్షసి మూవీతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ తెలుగు కుర్రాడు.. మూవీ మూవీకి కొత్త కథలను సెలక్ట్ చేసుకుంటున్నాడు. హీరోగా మాత్రమే ఆగిపోకుండా నెగిటివ్ అండ్ కీ రోల్స్ ప్లే చేస్తున్నాడు. నేను లోకల్, అర్థ శతాబ్దం, విరాట పర్వం, వీర సింహ రెడ్డి సినిమాలు అందుకు ఉదాహరణ. తెలుగే కాదూ తమిళంలో కూడా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా తమిళంలో చేసిన ఇన్ స్పెకర్ట్ రిషి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అన్ని భాషల్లో రిలీజై ట్రెమండస్ రెస్పాన్స్ తెచ్చుకున్న సంగతి విదితమే.

అయితే అతడికి సినిమాల్లో నటించాలన్న కోరిక వర్షంతో మొదలైందట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. పర్మిట్ రూం అనే యూట్యూబ్ ఛానల్లో పోడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న నవీన్.. ‘బాలకృష్ణ సినిమా బళ్లారిలో రిలీజైతే వంద పొట్టేళ్లు, పొట్టేళ్ల మాల, అన్నదానాలు ఉండేవి. చిరంజీవి సినిమా రిలీజైతే.. బాక్సు తీసుకురావడానికి ఊరేగింపు. షర్ట్ చింపుకోవడం ఇలాంటివి చేసేవాడిని. సినిమా పిచ్చి ఉండేది. నీకు మనస్సు నాకు తెలుసు షూటింగ్ చూద్దామని వెళితే.. నన్ను ఓ సెక్యూరిటీ తిట్టి పంపిచేశారు. చాలా బాధేసింది’ అని చెప్పారు. ‘బళ్లారిలో ఓ డ్యాన్స్ కొరియోగ్రాఫ్ చేశాను. అందరికీ నచ్చింది. కానీ ఫస్ట్ ప్రైజ్ రాలేదు. కానీ ఉదయ భాను మైక్ తీసుకుని.. అంత మంది జనాల్లో నాకు ఈ అబ్బాయి డ్యాన్స్ బాగా నచ్చింది. నాకు విన్నర్ తినే. దీంతో నాకు తెలియని ఆనందం వచ్చింది. కానీ నీలాంటి టాలెంట్ వ్యక్తులు ఇక్కడే ఉండిపోకూడదు.. హైదరాబాద్ రావాలని సూచించింది  ఆమెనే‘అని తెలిపాడు.

అలాగే ‘భీమవరంలో ప్రభాస్ వర్షం సినిమా 50 రోజుల ఫంక్షన్ చేస్తున్నారు. ఆ ఫంక్షన్‌కి లీడ్ డ్యాన్సర్ గా చేసేందుకు ఓ డ్యాన్సర్ కావాల్సి వచ్చింది. ఆ ఈవెంట్‌కు నేనే ప్రభాస్‌లా సేమ్ కాస్యూమ్‌తో ‘నేనొస్తానంటే .. నేనేద్దొంటానా’ పాటకి డ్యాన్స్ చేశాను. నాకు పెయిర్‌గా చిత్రం శ్రీను భార్య, యానీ మాస్టర్ కూడా ఉన్నారు. ఆ ఫంక్షన్‌కు 5-6 లక్షల మంది వచ్చారు. ప్రభాస్ నుండి నిర్మాతలు అందరూ కూర్చున్నారు. నేను ఫెర్మామెన్స్ చేస్తున్నా. ఇది ఆయనకు బిగ్ బ్రేక్ ఇచ్చిన మూవీ. ఈ క్రౌడ్ చూసి.. క్రేజ్ చూసి సినిమా అంటే ఇలా ఉంటుందా..? అప్పుడే  హీరో అయిపోవాలనుకున్నా. ఇంత జర్నీ చేశాక ఇంకా కొత్త కథలు కోసం వెతుకుతున్నా’ అని పేర్కొన్నారు.

ఇదే సమయంలో తాను ఎదుర్కొన్న కష్టాల గురించి వెల్లడించాడు. సినిమాల్లోకి వద్దామనుకున్నప్పుడు ‘హీరోగా వెళ్లాలా, విలన్‌గానా అసలు ఏం చేయాలి అనే క్లారిటీ ఉండేది కాదు. పైగా సినిమా గురించి పెద్దగా ఏం తెలీదు కూడా. కెమెరా అంటే తెలిసేది కాదు. అప్పుడే సంభవామి యుగే యుగే అనే సినిమాలో ఛాన్స్ వచ్చింది. సడెన్‌గా షూటింగ్, యాక్టర్ అనే సరికి కంగారు పడ్డాను. రోజుకి రూ. 50 ఇచ్చేవారు. నా దగ్గర సిటీ 100 బండి ఉండేది. లోకేషన్‌కి వచ్చి వెళ్లాలి అంతే.. సికింద్రాబాద్ నుండి వెళ్లి రావడానికి ఆ డబ్బులు సరిపోయేవి. ఒక్క చాయ్ తాగడానికి డబ్బులు ఉండేవి కాదు. యాక్టర్ అవడానికి వీరందరూ నాకు ఎక్కడో హెల్ప్ చేశారా..? పుష్ చేశారా అనేది ఏం చేశారో తెలియదు. ఇప్పుడు ఒకటి అర్థం అయ్యింది. హీరో అంటే ఫిజిక్ ఉండాలి. దాని కోసం చాలా ప్రయత్నాలు చేశాను. తర్వాత తెలిసింది ఏంటంటే..? అప్పుడే నాకు యాక్టర్ అనే జ్యోతి వెలిగింది’ అంటూ చెప్పుకొచ్చాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి