iDreamPost

మీ UPI ఐడీని ఉపయోగించడంలేదా? అయితే మీరు ఇది తెలుసుకోకుంటే నష్టపోతారు?

యూపీఐ ఐడీలు వాడే యూజర్లకు ముఖ్య గమనిక. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా యూపీఐ ఐడీలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్కువ యూపీఐ ఐడీలు ఉండి వాటిని ఉపయోగించకపోతే భారీగా నష్టపోయే అవకాశం ఉంది. పూర్తి వివరాలు మీకోసం..

యూపీఐ ఐడీలు వాడే యూజర్లకు ముఖ్య గమనిక. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా యూపీఐ ఐడీలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్కువ యూపీఐ ఐడీలు ఉండి వాటిని ఉపయోగించకపోతే భారీగా నష్టపోయే అవకాశం ఉంది. పూర్తి వివరాలు మీకోసం..

మీ UPI ఐడీని ఉపయోగించడంలేదా? అయితే మీరు ఇది తెలుసుకోకుంటే నష్టపోతారు?

ప్రస్తుతం అంతా డిజిటల్ పేమెంట్స్ పైననే ప్రజలు ఆధారపడుతున్నారు. స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ ఉంటే చాలు చిన్న చిన్న లావాదేవీల నుంచి పెద్ద మొత్తాల వరకు ఆన్ లైన్ పేమెంట్స్ చేసేస్తున్నారు. యూపీఐ ఐడీల సాయంతో డబ్బును సులభంగా పంపించుకుంటున్నారు. బ్యాంక్ అకౌంట్ ఒకటే ఉన్నప్పటికీ యూపీఐ ఐడీలు వేర్వేరుగా ఉంటున్నాయి. యూజర్స్ ఫోన్ నెంబర్స్, మెయిల్ ఐడీలతో ఒకటి కంటే ఎక్కువ యూపీఐ ఐడీలను క్రియేట్ చేసుకుని ఉపయోగిస్తున్నారు. అయితే యూపీఐ ఐడీలను వాడే వారికి నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా బిగ్ అలర్ట్ ఇచ్చింది. అలాంటి యూపీఐ ఐడీలపై కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

యూజర్స్ ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి డిజిటల్ పేమెంట్ యాప్స్ లో యూపీఐ ఐడీలను క్రియేట్ చేసుకుని వినియోగిస్తుంటారు. అయితే వాటిలో కొన్ని నిత్యం వాడుకుంటుండగా మరికొన్నింటిని మాత్రం అసలు వాడకుండా వదిలేస్తారు. అలాంటి యూపీఐ ఐడీలు, ఫోన్‌ నంబర్ల విషయంలో ఎన్ పీసీఐ చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం వాడని యూపీఐ ఐడీలు, నంబర్లను డీయాక్టివేట్‌ చేయాలని నిర్ణయించింది. లావాదేవీలకూ వినియోగించని యూపీఐ ఐడీలు, యూపీఐ నంబర్లు, ఫోన్‌ నంబర్లను డీయాక్టివ్‌ చేయాలంటూ ఎన్‌పీసీఐ గూగుల్‌ పే, పేటీఎం, ఫోన్‌ పే యాప్స్‌, బ్యాంకులకు సూచించింది.

యూపీఐ ఐడీలను డీయాక్టివేట్ చేయడానికి గడువు డిసెంబర్ 31 గా ప్రకటించింది. ఎన్పీసీఐ సర్క్యులర్ ప్రకారం, ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలంపాటు యాక్టివ్‌గా లేని కస్టమర్‌లు జనవరి నుండి తమ యూపీఐ ఐడీలపై ఎటువంటి లావాదేవీలను నిర్వహించలేరు. అంతేగాక బ్యాంక్ అకౌంట్ తో లింకైన ఫోన్ నెంబర్లను వాడనట్లైతే టెలికాం సంస్థలు వాటిని వేరొకరికి కేటాయిస్తాయి. ఇలాంటి సందర్భంలో ఆ నంబర్ తో ఉన్న యూపీఐ ఐడీలకు డబ్బు ట్రాన్స్ ఫర్ అయ్యే ఛాన్స్ ఉంది. థర్డ్‌ పార్టీ యాప్‌ ప్రొవైడర్‌, పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ సదరు యూపీఐ ఐడీలను డీయాక్టివేట్‌ చేయాలని ఎన్పీసీఐ సూచించింది. మరి మీ యూపీఐ ఐడీలను కోల్పోవద్దు అంటే వెంటనే లావాదేవీలను ప్రారంభించండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి