iDreamPost

పవన్, లోకేశ్ కలిస్తే.. వచ్చే ఫలితం అదేనంట!

ఏపీలో పొలిటికల్ హీట్ మాములుగా ఉండటం లేదు. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో సాగుతుంది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు తరువాత ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇదే సమయంలో పవన్ కల్యాణ్, లోకేశ్ కలిస్తే.. ఇక వైసీపీకి  దబిడి దిబిడే అని టీడీపీ, జనసేన కార్యకర్తలు అంటున్నారు. అయితే వారిద్దరి కలయికపై కొందరు సెటైర్లు వేస్తున్నారు.

ఏపీలో పొలిటికల్ హీట్ మాములుగా ఉండటం లేదు. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో సాగుతుంది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు తరువాత ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇదే సమయంలో పవన్ కల్యాణ్, లోకేశ్ కలిస్తే.. ఇక వైసీపీకి  దబిడి దిబిడే అని టీడీపీ, జనసేన కార్యకర్తలు అంటున్నారు. అయితే వారిద్దరి కలయికపై కొందరు సెటైర్లు వేస్తున్నారు.

పవన్, లోకేశ్ కలిస్తే.. వచ్చే ఫలితం అదేనంట!

ఏపీలో పొలిటికల్ హీట్ మాములుగా ఉండటం లేదు. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో సాగుతుంది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు తరువాత ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇక చంద్రబాబు జైల్లో ఉండటంతో నారా లోకేశ్ పార్టీ కార్యక్రమాలను చూసుకుంటున్నారు. మరోవైపు పవన్ కల్యాణ్ సైతం టీడీపీతో కలిసి నడిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్, లోకేశ్ కలిస్తే.. ఇక వైసీపీకి  దబిడి దిబిడే అని టీడీపీ, జనసేన కార్యకర్తలు ఉంటున్నారు. అయితే వారిద్దరి కలయికను పై వైసీపీ నేతలు ఆసక్తికర కామెంట్స్  చేశారు.

ఏపీ స్కిల్ స్కామ్‌లో అరెస్టైన చంద్ర‌బాబునాయుడిని రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బాబుకు జైలు నుంచి విముక్తి ఎప్పుడో తెలియ‌ని ప‌రిస్థితి ఉందని పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తోన్న వార్త.  అలానే గతంలో బాబుతో ములాఖ‌త్‌కు వెళ్లిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, ఆ త‌ర్వాత జైలు బ‌య‌ట టీడీపీతో పొత్తు వుంటుంద‌ని ప్ర‌క‌టించారు. బాబును జైలు వెళ్లడాన్ని సాకుగా తీసుకుని ప‌వ‌న్ పొత్తు ప్ర‌క‌ట‌న చేశారని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రెండు పార్టీల మ‌ధ్య స‌మన్వ‌యం కోసం ఇరువైపులా ఐదుగురు స‌భ్యుల‌తో కూడిన క‌మిటీల‌ను ఏర్పాటు చేశారు. రెండు పార్టీల స‌మ‌న్వ‌య స‌మావేశం ఈ నెల 23న మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌కు రాజ‌మండ్రిలో తొలి భేటీ జ‌ర‌గ‌నుంది.

ఈ సమావేశంలో ప‌వ‌న్‌, లోకేశ్ పాల్గొన‌నున్నారు. జగన్ ప్ర‌భుత్వాన్ని గద్దె దించ‌డానికి ఎలాంటి కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌నే అంశాల‌పై వీరిద్దరి అధ్య‌క్షత‌న చ‌ర్చిస్తారని టాక్. అయితే వీళ్లిద్ద‌రి క‌ల‌యికతో వైసీపీని ఎంత వ‌ర‌కూ రాజ‌కీయంగా నిరోధించ‌గ‌ల‌ర‌నేది అందరిలో ఎదురవుతున్న సందేహం. అధికార వైఎస్సాసీపీ దృష్టిలో చంద్ర‌బాబు సొంత పుత్రుడు లోకేశ్‌, ద‌త్త పుత్రుడు ప‌వ‌న్ అని భావిస్తారు. ఇందులో పుత్రుడ‌నే బంధంలో కాస్తా తేడా ఉన్నప్పటికి మిగిలివన్నీ సేమ్ టు సేమ్‌ ఉన్నాయి. ఇద్ద‌రు స‌న్యాసులు రాసుకుంటే రాలేది బూడిదే త‌ప్ప‌, స‌మాజానికి ఒరిగేదేమీ లేదంటూ వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. మెరుపు తీగలా రాజకీయాల్లో అప్పుడప్పుడు వస్తుంటారని పవన్ పై విమర్శలు ఉన్నాయి.

అలానే టీడీపీ సంక్షోభ స‌మ‌యంలో లోకేశ్ వ్య‌వ‌హ‌రించిన తీరు.. వార‌సుడిగా పార్టీని ముందుకు న‌డ‌ప‌లేర‌నే నెగెటివిటీని సంపాదించుకున్నారు. ఇలా రాజ‌కీయంగా స్థిర‌త్వం లేని పవన్, క‌ష్ట స‌మ‌యంలో ధైర్యంగా నిల‌వ‌లేని లోకేశ్ నాయ‌క‌త్వంలో ఓరిగేదేమి లేదని పొలిటికల్ సర్కిల్ లో వార్తలు వినిపిస్తోన్నాయి. చంద్ర‌బాబు ఇప్ప‌ట్లో బ‌య‌టికి రాక‌పోతే, కూట‌మిని అధికారం వైపు న‌డిపించే బాధ్య‌త మాత్రం ప‌వ‌న్‌, లోకేశ్‌ల‌పై ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. బాధ్య‌త‌ల్ని విజ‌య‌వంతంగా నిర్వ‌ర్తిస్తారా? లేదా? అన్న‌దానికి సమాధానం కాల‌మే చెప్పాల్సి ఉంది. మరి.. పవన్, లోకేశ్ కలిస్తే వచ్చే ఫలితం బూడిదేనని వైసీపీ నేతలు అంటున్న వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి