iDreamPost

ఆ వ్యాధితో బాధపడుతున్న హీరోయిన్‌ నందిత శ్వేత!

ఆ వ్యాధితో బాధపడుతున్న హీరోయిన్‌ నందిత శ్వేత!

హీరోయిన్‌ నందిత శ్వేత గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. 2016లో వచ్చిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా?’ సినిమాతో ఆమె తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ సినిమా సూపర్‌ హిట్‌ అవ్వటంతో తెలుగులో ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. ప్రస్తుతం తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. సినిమాలతో పాటు పలు తెలుగు టీవీ షోలతో కూడా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక, బయటకు ఎంతో యాక్టీవ్‌గా కనిపించే నందిత జీవితంలో ఓ విషాదం దాగి ఉంది.

ఆమె ‘ఫిబ్రోమైయాల్జియా’ అనే కండరాల సంబంధింత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి కారణంగా ఆమె తీవ్ర నొప్పికి గురవుతూ ఉన్నారంట. ఒక్కో సారి శరీరాన్ని పక్కకు కదల్చడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి​ ఉంటుందని ఆమె స్వయంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.  ఈ వ్యాధి కారణంగా ఆమె జ్ఞాపక శక్తి కూడా కొన్ని సార్లు ఇబ్బందుల్లో పడుతోందని తెలిపారు. ఆరోగ్య పరంగా ఎన్ని కష్టాలు ఉన్నా.. ఆమె మాత్రం వెనక్కు తగ్గటం లేదు.

ఆమె తన తాజా చిత్రం ‘హిడింబ’ కోసం బరువు తగ్గారు. బరువు తగ్గటం కోసం ఎంతో శ్రమకు ఓడ్చారు. మానసికంగా, శారీరకంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. సినిమాల విషయంలో మాత్రం చాలా నిక్కచ్చిగా ఉంటున్నారు. పాత్రకు తగ్గట్టు తనను తాను మలుచుకుంటున్నారు. కాగా, నందిత శ్వేత 2008లో వచ్చిన ‘నంద లవ్స్‌ నందిత’ అనే కన్నడ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ‘అట్టకత్తి’ సినిమా తర్వాత తమిళంలో బిజీ అయిపోయారు. అక్కడ 15కు పైగా సినిమాలు చేశారు. మరి, హీరోయిన్‌ నందిత శ్వేత అనారోగ్యంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి