iDreamPost

ఉదయ్ కిరణ్ ఆత్మహత్య వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నాడు: MP నందిగాం సురేశ్

Nandigam Suresh: బాపట్ల ఎంపీ నందిగాం సురేష్.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన నందిగాం సురేష్.. పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Nandigam Suresh: బాపట్ల ఎంపీ నందిగాం సురేష్.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన నందిగాం సురేష్.. పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉదయ్ కిరణ్ ఆత్మహత్య వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నాడు: MP నందిగాం సురేశ్

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయవేడి రాజుకుంది. ఈ సెగ ఎక్కడిదాక విస్తరింస్తోందో, ఎవ్వరం చెప్పలేని పరిస్థితి ముఖ్యంగకా అధికార వైఎస్సార్ సీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధంతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. మాములుగానే ఏపీ రాజకీయాలు చాలా హాట్ హాట్ గా ఉంటాయి. ఇక ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో ఆ ఆ రాజకీయక వేడి తీవ్ర స్థాయికి చేరింది. నిన్న తాడేపల్లిలో జరిగిన సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  పవన్ రాజకీయాల్లో పనికొచ్చే మనిషి కాదంటూ దుయ్యబట్టారు. తాజాగా బాపట్ల ఎంపీ నందిగాం సురేష్.. పవన్ కల్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

బుధవారం పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లి గూడెంలో టీడీపీ, జనసేన పార్టీల జెండా సభ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ భారీ బహిరంగ సభ జనం లేక వెలవెల బోయింది. ఆశించిన స్థాయిలో జనాల నుంచి స్పందన లేకపోవడంతో ఇరు పార్టీల అధ్యక్షులు తీవ్ర అసహనానికి లోనయ్యారని టాక్. దీంతో సభ వేదికపై నుంచి తాము ఏమి చేస్తామో చెప్పేది మానేసి.. సీఎం జగన్ మోహన్ రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. నారా చంద్రబాబు ఓ స్థాయిలో సీఎం జగన్ పై ఆరోపణలు చేస్తే.. పవన్ కల్యాణ్ మాత్రం శృతి మించి ప్రవర్తించారు. ఒంటిమీద సోయి మరచి ఇష్టాను రీతిలో సీఎం జగన్ పై  వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రసంగంపై రాజకీయక విశ్లేషకులు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ అనే పేరు వింటేనే చంద్రబాబు, పవన్ కి భయంతో పుడుతోంది. అందుకే నిన్నటి సభలో 200సార్లు జగన్ పేరు ప్రస్తావించారు. పావలా బిళ్ల కింద పడితే గోలగలో చేసినట్లే పవన్  మాట్లాడారు.  ఎవరి సలహాలు వద్దనటం వలనే చివరికి చంద్రబాబు పంచన చేరాల్సి వచ్చింది. పవన్ తో ఏ నిర్మాత సినిమా తీయటానికి కూడా ముందుకు రావటం లేదు.  ఎమ్మెల్యే కాలేక, సినిమాల  ఆఫర్లు లేక పవన్ ఫ్రస్టే,న్ లో ఉన్నారు.  తన స్వార్థం కోసం కన్నతండ్రిపై కూడా పవన్ నీచంగా మాట్లాడారు.   ఊసకాళ్తో ఉండే పవన్ తాడేపల్లిలో జగన్ ఇంటిని బద్దలు కొడతాడంట. పవన్ కల్యాణ్ ఎప్పటికీ ఎమ్మెల్యే కాలేడు. అలానే ఉదయ్ కిరణ్ ఆత్మహత్య వెనుక పవన్ ఉన్నాడు. గత ఎన్నికల్లో పవన్ ను రెండు చోట్లా ఓడించి పాతాళంలోకి తొక్కారు. మళ్లీ జగన్ గురించి విమర్శలు చేస్తే పవన్ని రాజకీయంగా ఎలా తొక్కాలో మాకు తెలుసు, డిపాజిట్టు కూడా రాని సీట్లు పవన్ కి  చంద్రబాబు ఇచ్చారు. పవన్ కల్యాణ్.. జనసైనికులు, ఒకేలా కనిపిస్తున్నారు. అందుకే ప్రశ్నించ వద్దని అంటున్నారు” అని నందిగాం సురేష్..పవన్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి