iDreamPost

కృష్ణా నదిలో భారీగా నాగ ప్రతిమలు ప్రత్యక్షం.. భయాందోళనలో స్థానికులు!

కృష్ణా నదిలో భారీగా నాగ ప్రతిమలు ప్రత్యక్షం.. భయాందోళనలో స్థానికులు!

మన దేశం దేవాలయాలకు పుట్టినిల్లు. ఇక్కడ పూజలు, వ్రతాలు, యజ్ఞాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అలానే చాలా మంది సమాజంలో  జరిగే, కనిపించే కొన్ని దృశ్యలను దేవుడి కార్యంగా భావిస్తుంటారు. కొన్ని సంఘటనలు దేవుడి ఆగ్రహానికి సంకేతంగా భావిస్తుంటారు. అలానే ఏదైన సందర్భంలో దేవుడి విగ్రహలు ఎక్కడైన మట్టిలో, నదిలో కనిపిస్తే.. స్థానిక ప్రజలు భయందోళనకు గురవుతారు. అచ్చం అలాంటి ఘటనే గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. కృష్ణా నదిలో భారీగా నాగ ప్రతిమలు ప్రత్యక్షమవడం అక్కడి ప్రజలను కలవరపెడుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం గ్రామ సమీపంలోని కృష్ణానది ఒడ్డున భారీగా  నాగ ప్రతిమలు ప్రత్యక్షమయ్యాయి. వాటిని ఆదివారం స్థానికులు గుర్తించారు. అయితే ఇవి ఎక్కడ నుంచి వచ్చాయి? ఎలా వచ్చాయి? అనే ప్రశ్నలు స్థానికులతో పాటు అందరిలోనూ మెదులుతున్నాయి. ఎవరైనా తీసుకువచ్చి పెట్టారా లేక నదిలో కొట్టుకువచ్చాయా? అనేది తెలీయడంలేదని సీతానగరం గ్రామస్థులు అంటున్నారు. నది ఒడ్డున కనిపించిన నాగ దేవతల విగ్రహాలు పురాతన కాలానికి చెందినవిగా కొందరు భావిస్తున్నారు.

ఎక్కడైనా ఆలయాలను కూల్చివేసి ఈ విగ్రహాలకు ఇక్కడ తెచ్చి పడేసారా అన్న సందేహాలు కూడా వస్తున్నాయి. లేదంటే ఎవరైనా విగ్రహాలు చెక్కే వారు దెబ్బతిన్నవాటిని ఇలా తెచ్చి పడేసారేమోనని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనప్పటికి భారీగా నాగ విగ్రహాలు కృష్ణానదీ తీరానికి చేరాయి. భారీగా నాగ దేవత విగ్రహాలు ఏమయినా దోషం ఉందేమోనని స్థానికులు భయపడుతున్నారు. అందుకే దోషం చుట్టుకోకుండా ఉండేందుకు విగ్రహాలను వదిలేసి ఉంటారని… ఆ దోషం ఎక్కడ తమకు చుట్టుకుంటుందోనని సీతనగరం వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి