iDreamPost

ఈ చిన్నోడు టాప్ హీరో.. ఆ స్టార్ ఫ్యామిలీ వారసుడు

ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నోడు.. ఆ బడా ఫ్యామిలీ వారసుడు. ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. ఈ రోజు ఫాదర్స్ డే సందర్భంగా తన నాన్నతో దిగిన ఫోటోను షేర్ చేసుకున్నాడు. ఇంతకు అతడు ఎవరంటే..?

ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నోడు.. ఆ బడా ఫ్యామిలీ వారసుడు. ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. ఈ రోజు ఫాదర్స్ డే సందర్భంగా తన నాన్నతో దిగిన ఫోటోను షేర్ చేసుకున్నాడు. ఇంతకు అతడు ఎవరంటే..?

ఈ చిన్నోడు టాప్ హీరో..  ఆ స్టార్ ఫ్యామిలీ వారసుడు

ఇటీవల ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పదం నెపోటిజం. హీరోలు లేదా పరిశ్రమలో కొంత కాలంగా హవా చూపిస్తున్న దర్శక, నిర్మాతల పిల్లలు యాక్టింగ్‌లోకి అడుగుపెట్టడంతో నెపో కిడ్స్ అంటూ అపవాదు మోస్తున్నారు.  అయితే ఈ ఫేమ్ .. వారసులు ఎంట్రీ ఇవ్వడం వరకు మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప.. కెరీర్ ముందుకు సాగాలంటే వారి టాలెంట్ ముఖ్యం. అభిమానుల్ని ఆకట్టుకోలేకపోతే.. ఎంతటి స్టార్ హీరో, బడా నిర్మాత, దర్శకుల కొడుకునైనా, కూతురినైనా ఇంటికి సాగనంపేస్తుంటారు ప్రేక్షకులు. అందుకు చాలా ఉదాహరణలే ఉన్నాయి. నటన రంగంలోకి అడుగుపెట్టిన ప్రతి స్టార్ కిడ్ సక్సెస్ కాలేడు. తమ కృషి, పట్టుదలే వారిని సక్సెస్ బాట పట్టిస్తుంది. ఇది ఈ ఫోటోలోని పిల్లాడి విషయంలో అదే జరిగింది.

ఇండస్ట్రీలో పేరు మోసిన ఫ్యామిలీ తనది. కానీ అది తనకు ఎంట్రీ వరకే ఉపయోగపడింది. ఆ తర్వాత కష్టం అంతా అతడిదే. గెలుపోటములను ఓకేలా తీసుకోవడం అతడికి అలవాటు. చాలా కూల్ పర్సన్. ఏదైనా సరే చిరునవ్వుతో సమాధానం ఇస్తాడు. విపరీతంగా రేసర్ కార్స్, బైక్స్ అంటే ఇష్టం. ఇన్ని చెప్పాక అతడు ఎవరో తెలిసిపోయింది కదా. అతడు అక్కినేని నట వారసుడు నాగ చైతన్య. ద లెజండరీ హీరో అక్కినేని నాగేశ్వరరావు, నాన్న నాగార్జున నుండి నటనను వారసత్వంగా తీసుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. మరో వైపు దగ్గుబాటి కుటుంబానికి కూడా ప్రియమైన వ్యక్తి కూడా. జోష్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన చై టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచిన.. ఈ హ్యాండ్సమ్ హీరో..క్యూట్ పర్సనాలిటీతో అమ్మాయిల మనసు దోచేశాడు.

ఫాదర్స్ డే సందర్భంగా నాన్నతో దిగిన ఫోటోను షేర్ చేశాడు నాగ చైతన్య. ద ఓజీ అంటూ లవ్ సింబల్ పెట్టి.. తన తండ్రికి ఫాదర్స్ డే విషెస్ తెలియజేశాడు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట్లో వైరల్ అవుతుంది. దీనికి ప్రముఖ నటి టబు.. రిప్లై ఇచ్చారు. ఆమె లవ్ సింబల్స్ పోస్టు చేసింది. నెటిజన్లు కూడా ఫాదర్స్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే.. నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ మూవీ చేస్తున్నాడు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్. యథార్థ ఘటనల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. రాజు అనే శ్రీకాకుళం మత్స్యకారుడి పాత్రను పోషిస్తున్నాడు చైతూ. జీఏ2 పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.చందు మొండేటి దర్శకుడు. హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలోనూ ఈ మూవీని రిలీజ్ చేస్తారు. డిసెంబర్ నెలలో ఈ సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి