iDreamPost

My Safetipin: ప్రతి మహిళ ఫోన్‌లో తప్పక ఉండాల్సిన యాప్‌.. ఇదుంటే ఎక్కడికెళ్లినా సేఫ్‌!

ప్రస్తుతం ఉద్యోగాల నిమిత్తం బయటకు వెళ్లిన మహిళలపై కొందరు ఆకతాయిలు దాడులు చేస్తున్నారు. ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్న అక్కడక్కడ మహిళపై వేధింపుల, దాడుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అయితే మహిళ సేఫ్టీ కోసం ఓ యాప్ అందుబాటులోకి వచ్చింది.

ప్రస్తుతం ఉద్యోగాల నిమిత్తం బయటకు వెళ్లిన మహిళలపై కొందరు ఆకతాయిలు దాడులు చేస్తున్నారు. ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్న అక్కడక్కడ మహిళపై వేధింపుల, దాడుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అయితే మహిళ సేఫ్టీ కోసం ఓ యాప్ అందుబాటులోకి వచ్చింది.

My Safetipin: ప్రతి మహిళ ఫోన్‌లో తప్పక ఉండాల్సిన యాప్‌.. ఇదుంటే ఎక్కడికెళ్లినా సేఫ్‌!

నేటికాలంలో ప్రతి మహిళలు  జాబులు చేయడం సాధారణం అయింది.  ప్రతి రంగంలోనూ వారు మగవారికి ధీటుగా రాణిస్తున్నారు. ఇక ఉద్యోగాలు చేసే మహిళ విషయంలో కొందరికి రాత్రి వేళ కూడా వర్క్ చేయాల్సి ఉంది. ఈక్రమంలోనే రాత్రులు ఒంటరిగా ప్రయాణం చేయడం తప్పనిసరిగా ఉంటుంది. ఇలా చేసే క్రమంలో వారికి కొన్ని సార్లు ప్రమాదం ఎదురవుతుంటాయి. ఆకతాయిలు, గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఇలాంటి సమయంలో వారి రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. అలానే తాజాగా మహిళ రక్షణ కోసం ఓ ప్రత్యేకమైన యాప్ అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్ ప్రతి మహిళ ఫోన్ లో ఉంటే ఎక్కడికి వెళ్లిన సేఫ్ గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. మరి.. ఆ యాప్ వివరాలు, దాని ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

ప్రస్తుతం ఉద్యోగాల నిమిత్తం బయటకు వెళ్లిన మహిళలపై కొందరు ఆకతాయిలు దాడులు చేస్తున్నారు. ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్న అక్కడక్కడ మహిళపై వేధింపుల, దాడుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అయితే వారిని వారే రక్షించుకునేందుకు మహిళకు ఓ యాప్ అందుబాటులోకి వచ్చింది. పని ప్రదేశాల్లో తోటి ఉద్యోగులు లైంగికంగా వేధింపులకు గురి చేసినా,  జర్నీల్లో ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా మహిళలకు తక్షణ రక్షణకు ‘సేఫ్టీపిన్‌’ అనే యాప్‌ ఉపయోగపడుతుంది. ఎక్కడి వెళ్లిన మహిళలు సురక్షితంగా ఉండాలంటే.. ప్రతి ఒక్కరి ఫోన్లో ఈ యాప్ ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

ఇక ఈ యాప్ ను వాడే విధానం గురించి చూసినట్లు అయితే.. దీన్ని గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఫోన్‌నంబర్‌తో లాగిన్‌ అయి, తర్వాత పేరు, ఇతర వివరాలు నమోదు చేస్తే ఫోన్ కి ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేస్తే వెరిఫికేషన్‌ ప్రాసెస్ పూర్తవుతుంది. అనంతరం మెయిల్‌ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు నమోదు చేయాలి. మనం జర్నీ చేసే ప్రాంతం వివరాలు నమోదు చేసేందుకు లొకేషన్‌ పర్మిషన్‌ ఇవ్వడంతో ఆయా వివరాలన్నీ పోలీసుల నిఘాలోకి చేరుతాయి.

ఎవరైన మహిళలు రాత్రుళ్లు ఒంటరిగా నడిచినప్పుడు భయమేస్తే ఈ అప్లికేషన్‌ అన్‌ లో పెట్టుకుంటే సరిపోతుంది. ఈ యాప్ ను ఆన్ చేయడం ద్వారా మనం ఎక్కడున్నది ట్రాక్‌ అవుతూ ఉంటుంది. అప్లికేషన్‌ లాగ్‌ఇన్‌ అయ్యేటప్పుడు సమయానికి వచ్చి, కాపాడకలిగే ఐదుగురు వ్యక్తుల ఫోన్‌ నెంబర్లను నమోదు చేయాల్సి ఉంటుంది. అంతేకాక ఈ ఈ యాప్‌ ద్వారా మహిళల ఏ పరిస్థితులో ఉంది, ఎలా తన గమ్యం చేరుతుందనే విషయాలను ఎప్పటికప్పుడు వారి సంబంధికులకు మెసేజ్‌ల రూపంలో వెళ్తాయి. 2013లో మహిళా హక్కుల కార్యకర్త కల్పనా విశ్వనాథ్‌, ఆశిష్‌ బసు సంయుక్తంగా ఈ యాప్‌ తయారుచేశారు.

ఇక ఈ యాప్ ద్వారా మరికొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి. మై సేఫ్టీపిన్‌ యాప్‌ ద్వారా మన చుట్టుపక్కల ప్రాంతాల సేఫ్టీస్కోర్‌ తెలుసుకోవచ్చు. తద్వారా మనం ఏ విధమైన ప్రాంతంలో ఉంటున్నామో ఓ అంచనా వేసుకునే ఛాన్స్ ఉంది. కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు సురక్షితమైన అకామిడేషన్ వివరాలను ఈ యాప్‌ సూచిస్తుంది. ఈ యాప్‌ ద్వారా మహిళు ప్రయాణించే మార్గంలో జనసాంద్రత,  భద్రత, ప్రజారవాణా, బస్‌స్టాప్‌, రైల్వే స్టేషన్‌, మెట్రో స్టేషన్‌ వంటి వివరాలను కూడా తెలియజేస్తుంది. మొత్తంగా ఈ మై సేఫ్టీపిన్‌ యాప్‌ మహిళకు శ్రీరామ రక్షగా ఉంటుందని ఐటీ నిపుణులు చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి