iDreamPost

ఆ విషయంలో జడేజా పనికిరాడని తేల్చేసిన ధోని! అందుకే ఈ నిర్ణయం..?

  • Published Mar 21, 2024 | 5:06 PMUpdated Mar 21, 2024 | 5:06 PM

MS Dhoni, Ravindra Jadeja: రేపటి నుంచి ఐపీఎల్‌ 2024 సీజన్ ప్రారంభం అనగా ఎంఎస్‌ ధోని సీఎస్‌కే కెప్టెన్‌గా తప్పుకున్నాడు. అయితే.. తన టీమ్‌లో ఉన్న జడేజా విషయంలో ధోని ఒక నిర్దారణకు వచ్చినట్లు తెలుస్తోంది. జడేజా పనికిరాడనే ధోని ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదేంటో ఇప్పుడు చూద్దాం..

MS Dhoni, Ravindra Jadeja: రేపటి నుంచి ఐపీఎల్‌ 2024 సీజన్ ప్రారంభం అనగా ఎంఎస్‌ ధోని సీఎస్‌కే కెప్టెన్‌గా తప్పుకున్నాడు. అయితే.. తన టీమ్‌లో ఉన్న జడేజా విషయంలో ధోని ఒక నిర్దారణకు వచ్చినట్లు తెలుస్తోంది. జడేజా పనికిరాడనే ధోని ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 21, 2024 | 5:06 PMUpdated Mar 21, 2024 | 5:06 PM
ఆ విషయంలో జడేజా పనికిరాడని తేల్చేసిన ధోని! అందుకే ఈ నిర్ణయం..?

ఐపీఎల్‌ 2024 ఆరంభానికి ఒక్క రోజు ముందు మహేంద్ర సింగ్‌ ధోని సంచలన నిర్ణయం తీసుకున్నాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా ధోని తప్పుకుని, ఆ బాధ్యతలను రుతురాజ్‌ గైక్వాడ్‌కు ఇస్తున్నట్లు సీఎస్‌కే యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచిన సీఎస్‌కే.. ఐపీఎల్‌ 2024 ట్రోఫీ లాంచ్‌ సమయంలో ధోని స్థానంలో రుతురాజ్‌ను పంపించింది. దీంతో అంతా షాక్‌ అయ్యారు. ధోని ఎందుకు రాలేదని అంతా ఆరా తీశారు. కొద్ది సేపటికే చెన్నై మేనేజ్‌మెంట్‌.. తమ అధికారిక ట్విట్టర్‌ అకౌంట్‌లో కెప్టెన్సీ బాధ్యతలను ధోని, రుతురాజ్‌ గైక్వాడ్‌కు హ్యాండ్‌ఓవర్‌ చేసినట్లు ప్రకటించింది. ఈ ప్రకటనతో ధోని అభిమానులంతా షాక్‌ తిన్నారు.

అయితే.. తన స్థానంలో సీఎస్‌కేను నడిపించడానికి రుతురాజ్‌ గైక్వాడ్‌ సరైన వ్యక్తిగా ధోని భావించే తనకి కెప్టెన్సీ అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మరో స్టార్‌ ప్లేయర్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌లో నంబర్‌ 2గా ఉన్న రవీంద్ర జడేజా కెప్టెన్సీకి పనికిరాడని కూడా ధోని తేల్చేసినట్లు టాక్‌ వినిపిస్తోంది. అందుకే కారణం కూడా లేకపోలేదు. అదేంటంటే.. 2022 సీజన్‌కి ముందు ధోని చెన్నై కెప్టెన్‌గా తప్పుకుని ఆ బాధ్యతలను రవీంద్ర జడేజాకు అప్పగించాడు. ఐపీఎల్‌ 2021 సీజన్‌ ముగియగానే.. వచ్చే సీజన్‌కు నువ్వే కెప్టెన్‌ అనే విషయాన్ని జడేజాకు ధోని, సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌ చెప్పేశారు. కానీ, జడేజా మాత్రం వచ్చిన ఛాన్స్‌ను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఐపీఎల్‌ 2022 సీజన్‌లో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన జడేజా.. ఫెల్యూర్‌ కెప్టెన్‌గా మిగిలిపోయాడు. ఐపీఎల్‌ టాప్‌ క్లాస్‌ జట్టుగా ఉన్న సీఎస్‌కే జడేజా కెప్టెన్సీలో వరుసగా తొలి నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఆ సీజన్‌లో ఎనిమిది మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించిన జడేజా.. తర్వాత కెప్టెన్సీని ధోనికే అప్పగించేశాడు.

Why did not give captaincy to jadeja

జడేజా కెప్టెన్సీలో మొత్తం 8 మ్యాచ్‌ల్లో కేవలం 2 విజయాలు మాత్రమే సాధించింది సీఎస్‌కే. తర్వాత ధోని కెప్టెన్సీలో 6 మ్యాచ్‌లు ఆడి 2 విజయాలు సాధించింది. గతంలో ఎప్పుడు లేని విధంగా 14 మ్యాచ్‌ల్లో కేవలం 4 విజయాలతో సీఎస్‌కే పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. కానీ, వెంటనే 2023లో మళ్లీ సీఎస్‌కేను ధోని తన కెప్టెన్సీలో ఛాంపియన్‌గా నిలిపాడు. అయితే.. ఐపీఎల్‌ 2024 తన కెరీర్‌లో చివరి ఐపీఎల్‌ కావడంతో.. కెప్టెన్సీ బాధ్యతలను రుతురాజ్‌ గైక్వాడ్‌కు అప్పగించాడు. రుతురాజ్‌కి కెప్టెన్‌గా మంచి రికార్డ్‌ ఉంది. కామన్వెల్త్‌ గేమ్స్‌లో టీమిండియా రుతురాజ్‌ కెప్టెన్సీలోనే గోల్డ్‌మెడల్‌ నెగ్గింది. దేశవాళి క్రికెట్‌లోనూ రుతురాజ్‌కు కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది. అయితే.. జడేజాకు ఒక అవకాశం ఇచ్చి.. అతను కెప్టెన్సీకి పనికిరాడన నిర్ధారణకు వచ్చిన తర్వాతే ధోని రుతురాజ్‌ వైపు చూశాడు. మరి ధోని తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి