iDreamPost

వీడియో: యంగ్ క్రికెటర్‌కు ధోని సాయం! బైక్‌పై హీరోలా వచ్చి..

  • Published Sep 15, 2023 | 2:37 PMUpdated Sep 15, 2023 | 2:37 PM
  • Published Sep 15, 2023 | 2:37 PMUpdated Sep 15, 2023 | 2:37 PM
వీడియో: యంగ్ క్రికెటర్‌కు ధోని సాయం! బైక్‌పై హీరోలా వచ్చి..

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని ఏది పట్టుకున్నా బంగారమవుతుంది.. ఏం చేసినా వైరల్‌ అవుతుంది.. అంతా అదృష్టం కొద్ది అంటుంటారు చాలా మంది. నిజానికి అతను ఏం చేసినా అంది గొప్ప అవ్వడం కాదు.. ధోని చేసేవే గొప్ప పనులు. రెండు ఒకేలా ఉన్నా.. వాటిలో చాలా తేడా ఉంది. ధోని ఎంత పెద్ద సెలబ్రెటీలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆటగాడిగా రిటైర్‌ అయినా కూడా ధోని ఫాలోయింగ్‌ కానీ, పాపులారిటీ కానీ ఇంచుకూడా తగ్గలేదు సరికదా.. ఇంకాస్త పెరిగింది.

చాలా మంది కాస్తంత సెలబ్రెటీ స్టేటస్‌ వచ్చేస్తే చాలు.. ఎక్కడలేని హడావిడి చేసేస్తుంటారు. చుట్టూ పది మంది బౌన్సర్లను పెట్టుకుని, చూసేందుకు జనాలు ఎగబడకపోయినా.. అందరూ తమనే చూస్తున్నట్లు మిడిసిపడుతుంటారు. కానీ, ధోని మాత్రం చాలా సింపుల్‌గా ఉంటాడు. పబ్లిక్‌ ప్లాట్‌ఫామ్‌పై ఉన్న సమయంలో ప్రొఫెషనల్‌గా ఉండే ధోని.. తన ప్రైవేట్‌ స్పెస్‌ను ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా చాలా సామాన్యంగా బతికేస్తుంటాడు. అలా చాలా సార్లు ధోని చేసే చిన్న చిన్న సింపుల్‌ పనులు కూడా ఆశ్చర్యకలిగిస్తుంటాయి.

తాజాగా తన సొంతూరు రాంచీలో ధోని చేసిన ఓ పని ప్రస్తుతం వైరల్‌గా మారింది. రాంచీలోని ఓ క్రికెట్‌ గ్రౌండ్‌కు బైక్‌పై ఒంటరిగా వెళ్తున్న ధోని.. ఆ క్రికెట్‌ స్టేడియానికి వెళ్లే దారిలో ప్రాక్టీస్‌ కోసం వెళ్తున్న ఓ యువ క్రికెటర్‌ను గమనించి.. తనే స్వయంగా బైక్‌పై లిఫ్ట్‌ ఇచ్చి గ్రౌండ్‌కు తీసుకెళ్లాడు. బైక్‌ హెల్మెట్‌ పెట్టుకుని ఎవరూ గుర్తుపట్టకుండా జాగ్రత్త పడిన ధోని.. స్టేడియంకు వెళ్లిన తర్వాత.. హెల్మెట్‌ తీసేయడంతో.. తనకు లిఫ్ట్‌ ఇచ్చింది ధోని అని ఆ యువ క్రికెటర్‌ సంతోషంతో ఉబ్బితబ్బిబయ్యాడు. ఓ యువ క్రికెటర్‌ ప్రాక్టీస్‌ కోసం వెళ్తున్నాడని గమనించి.. ధోని లిఫ్ట్‌ ఇవ్వడంపై క్రికెట్‌ ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దటీజ్‌ ధోని అంటూ సోషల్‌ మీడియాలో ఆ వీడియోను తెగ వైరల్‌ చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వరల్డ్ కప్ కొట్టే దిశగా శ్రీలంక! జోక్ కాదు .. కొన్ని లెక్కలు ఉన్నాయి!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి