iDreamPost

ఆ ఒక్క పొరపాటే బాడీ బిల్డర్ ప్రాణాలు తీసిందా?

ఆ ఒక్క పొరపాటే బాడీ బిల్డర్ ప్రాణాలు తీసిందా?

దేశంలో ఈ మద్య వరుస గుండెపోటు మరణాలు ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ గుండెపోటుతో చనిపోతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. వయసుతో నిమిత్తం లేకుండా చిన్న పిల్లల నుంచి వృద్దుల వరకు గుండెపోటుతో మరణిస్తున్నారు. చాలా వరకు వ్యాయమం చేసే సమయంలో, ఎక్కువ సేపు వాకింగ్ చేస్తున్నా, డ్యాన్స్ చేస్తున్న సమయంలో హఠాత్తుగా కుప్పకూలిపోతున్నారు. ఆస్పత్రికి తరలించేలోపు మరణిస్తున్నారు. తమిళనాడులో ఇలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది. మిస్టర్ తమిళనాడు టైటిల్ విన్నర్, బాడీ బిల్డర్ యోగేశ్ హార్ట్ ఎటాక్ తో కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..

ఇటీవల యువత ఎక్కువగా హార్ట్ ఎటాక్ తో మరణించడం తీవ్ర కలకలం రేపుతుంది. అప్పటి వరకు మనతో సంతోషంగా ఉన్నవారు.. హఠాత్తుగా కుప్పకూలి మరణిస్తున్న విషయం తెలిసిందే. క్రికెట్ ఆడుతు, జిమ్ లో వ్యాయామం చేస్తు, సంతోషంగా డ్యాన్స్ చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలిపోతున్నారు.. వారిని హాస్పిటల్ తరలించేలోపు చనిపోతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా తమిళనాడు తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మిస్టర్ తమిళనాడు టైటిల్ విన్నర్, ప్రముఖ బాడీ బిల్డర్ యోగేశ్ హార్ట్ ఎటాక్ తో కన్నుమూశారు. చెన్నైలోని అంబత్తూరు లో మేనంపేడు ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు యోగేశ్. కొంత కాలంగా బాడీ బిల్డర్ గా పలు ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. ఒక్క 2021 లోనే తొమ్మిదికి పైగా చాంపియన్ షిప్ లో పాల్గొని బాడీ బిల్డింగ్ లో ‘మిస్టర్ తమిళనాడు’ అవార్డు సొంతం చేసుకొని తనదైన సత్తా చాటాడు. యోగేశ్ కి 2021 లో వైష్ణవి అనే యువతితో పెళ్లయ్యింది. వీరికి రెండేళ్ల పాప ఉంది.

పెళ్లైన తర్వాత బాడీ బిల్డింగ్ కి స్వస్తి చెప్పాడు యోగేశ్. ప్రస్తుతం జిమ్ ట్రైనర్ గా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే జిమ్ లో పనిముగించుకొని ఇంటికి వెళ్లిన యోగేశ్ బాత్ రూమ్ లో హఠాత్తుగా కుప్పకూలి పోయాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ యోగేశ్ ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అయితే యోగేశ్ గుండెపోటుతో చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు. పెళ్లైన తర్వాత బాడీ బిల్డింగ్ కి స్వస్తి చెప్పిన యోగేశ్ తక్కువగా వ్యాయామం చేయడం.. తక్కువ బరువులు ఎత్తడం లాంటివి చేసేవాడని.. కానీ ఒక్కసారే భారీ బరువులు ఎత్తడం గుండెపై తీవ్ర ప్రభావం పడటం వల్లనే ఇలా జరిగిందని వైద్యులు తెలిపారు. యోగేశ్ మరణంగా కుటుంబ సభ్యులు, సన్నిహితులు కన్నీరు మున్నీరవుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి