iDreamPost

Vamsi Krishna Reddy: వంశీకృష్ణ ఎమోషనల్.. ఆ బాధతో తాగడం అలవాటైందంటూ..!

  • Published Jan 20, 2024 | 10:53 PMUpdated Jan 20, 2024 | 10:53 PM

పాపులర్ మోటివేషనల్ స్పీకర్ వంశీకృష్ణా రెడ్డి విడాకుల అంశంపై తొలిసారి రియాక్ట్ అయ్యారు. దీని గురించి మాట్లాడుతూ ఆయన ఎమోషనల్ అయ్యారు. ఆ బాధతో తాగడం అలవాటైందని అన్నారు.

పాపులర్ మోటివేషనల్ స్పీకర్ వంశీకృష్ణా రెడ్డి విడాకుల అంశంపై తొలిసారి రియాక్ట్ అయ్యారు. దీని గురించి మాట్లాడుతూ ఆయన ఎమోషనల్ అయ్యారు. ఆ బాధతో తాగడం అలవాటైందని అన్నారు.

  • Published Jan 20, 2024 | 10:53 PMUpdated Jan 20, 2024 | 10:53 PM
Vamsi Krishna Reddy: వంశీకృష్ణ ఎమోషనల్.. ఆ బాధతో తాగడం అలవాటైందంటూ..!

ఇంటర్నెట్ విప్లవంతో ప్రతి ఒక్కరి చేతుల్లోకి మొబైల్ వచ్చేసింది. దీంతో సోషల్ మీడియా వినియోగం ఎక్కువవడంతో చాలా మంది ఓవర్​నైట్ సెలబ్రిటీలుగా మారుతున్నారు. ఇన్​ఫ్లుయెన్సర్లుగా, మోటివేషనల్ స్పీకర్లుగా ఫేమ్ సంపాదిస్తున్నారు. అలా సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన వారిలో వంశీకృష్ణా రెడ్డి, నేత్రా రెడ్డి కూడా ఉన్నారు. వంశీకృష్ణ మోటివేషనల్ స్పీకర్​గా, యాప్టిట్యూడ్ ట్రైనర్​గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఉన్నత చదువులు చదివి సేంద్రీయ వ్యవసాయం వైపు వచ్చిన మహిళగా నేత్రా రెడ్డి అందరికీ సుపరిచితులే. సోషల్ మీడియాలో సెలబ్రిటీలైన ఈ ఇద్దరూ రెండేళ్ల కింద లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. పెద్దలను ఎదిరించి మరీ మ్యారేజ్ చేసుకున్నారు. అయితే తర్వాత డివోర్స్ తీసుకున్నారు. దీనిపై వంశీకృష్ణ స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు. విడాకుల బాధలో నుంచి బయటపడేందుకు తాగడం అలవాటు చేసుకున్నానని అన్నారు.

‘ఫ్రాంక్​గా చెప్పాలంటే నాకు మందు అంటే ఇష్టం ఉండదు. పనికి సంబంధించిన విషయాలు తప్పితే పార్టీలు చేసుకోవడం లాంటివి నాకు నచ్చదు. మా అన్న గిల్ట్ లేకుండా ఫ్రెండ్స్​తో కలసి పార్టీలు చేసుకుంటాడు. కానీ నాకు గిల్ట్ ఉంటుంది. పని చేయకుండా ఏం చేస్తున్నాం? ఆల్కహాల్ కూడా తాగొద్దు.. మంచిది కాదనే డౌట్ ఉంటుంది. చికెన్ కూడా తినాలా అని ఆలోచిస్తా. అయితే మ్యారేజ్ బ్రేకప్ పెయిన్​ మాత్రం ఉంటుంది. సూసైడ్, డిప్రెషన్ వంటివి నాకు నచ్చదు. ఆత్మహత్యల వల్ల మా ఫ్యామిలీ చాలా నష్టపోయింది. పార్టీలు చేసుకోవడానికి బ్రేకప్ ఒక కారణం. ఆ బాధ నుంచి బయటకు రావడానికి ఇదో సొల్యూషన్​లా అనిపించింది. అయితే ఇప్పుడు మానేస్తున్నా. ఆర్గానిక్ ఫార్మింగ్​లోకి వచ్చాక ఎప్పుడైనా రెండు, మూడు నెలలకు ఓసారి పార్టీలు చేసుకుంటాం’ అని వంశీకృష్ణ చెప్పుకొచ్చారు. నేత్రారెడ్డితో డివోర్స్​కు సంబంధించిన రీజన్స్ బయట చెప్పలేనని తెలిపారు. విడాకులకు సంబంధించిన కారణాలు బయట చెప్పొద్దని తాము ప్రామిస్ చేసుకున్నామని పేర్కొన్నారు.

విడాకులు అనేది ఒక్క నెలలో జరిగింది కాదని.. రెండు, మూడు నెలల ముందే తెలిసిందన్నారు వంశీకృష్ణ. ఇద్దరికీ ఇబ్బందిగా అనిపించిన రోజుల్లోనూ కలసి ఉండాలని చాలా ప్రయత్నించామని వ్యాఖ్యానించారు. కలసి ఉండేందుకు చాలా ప్రయత్నించామని, అనేక మార్లు చర్చించుకున్నామని.. అయితే ఏదీ కుదరకపోవడంతో ఆఖరికి డివోర్స్ తీసుకున్నామని వివరించారు. విడాకుల తర్వాత కొన్నాళ్లు కఠినంగా సాగిందని.. కానీ ఏది జరిగినా మంచిదని తాను నమ్ముతానని చెప్పుకొచ్చారు. లైఫ్ మీద తమ ఇద్దరివీ భిన్నాభిప్రాయాలని.. వేర్వేరు ప్రపంచాలు అని పేర్కొన్నారు వంశీకృష్ణ. ‘డివోర్స్ తర్వాత అమ్మాయిలతో ఫ్రెండ్స్​గా ఉండాలనిపించింది. ఏ ఎక్స్​పెక్టేషన్స్ లేకుండా మామూలు స్నేహితులతో ఉన్నట్లే ఉండాలనిపిస్తోంది. కానీ ఆ ప్రాసెస్​లో కూడా లవ్​లో పడతానేమోననే భయం ఉంది’ అని వంశీకృష్ణ చెప్పుకొచ్చారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి