iDreamPost

డజను మంది పిల్లలకు తల్లి.. 10 మంది పిల్లలున్న తండ్రి కోసం ఎదురు చూపు

డజను మంది పిల్లలకు తల్లి.. 10 మంది పిల్లలున్న తండ్రి కోసం ఎదురు చూపు

గతంలో ఆస్తిపాస్తులను చూసేవారు కాదూ పెద్దలు. పిల్లల్నే ఆస్తులుగా పరిగణించారు. ఎవరైనా కనిపిస్తే..మీకు ఎంత మంది పిల్లలు అని అడిగేవారు. కానీ ఆ తర్వాత మానవుడు సగటు జీవన ప్రమాణాలు పూర్తిగా మారిపోయాయి. ఆర్థిక అసమానతలు, దేశంలో పెరిగిన ధరలు వెరసి కుటుంబాన్ని పోషించాలంటే కష్టంగా మారింది. గంపెడు మంది పిల్లలకు కడుపునిండా తిండి పెట్టడానికి తండ్రి తన రెక్కలు ముక్కలు చేసుకున్నా సరిపోయేది కాదు. దీంతో ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని ముగ్గురు పిల్లలు చాలు అని ప్రచారం చేసింది. ఆ తర్వాత ముగ్గురు పిల్లలు వద్దు.. ఇద్దరే ముద్దు అన్న నినాదము వచ్చింది. చిన్న కుటుంబం, చింత లేని కుటుంబాలు వచ్చాయి. ఇప్పుడు ఒకరితో కూడా సరిపెట్టుకుంటున్నారు తల్లిదండ్రులు. అయితే కొన్ని దేశాల్లో పిల్లలను కనేందుకు కుటుంబ నియంత్రణ లేకపోవడంతో పిల్లల్ని కంటూనే ఉన్నారు. న్యూయార్క్ మహిళ ఈ కోవకే వస్తుంది.

వెరోనికా అనే మహిళకు ప్రస్తుతం 12 మంది పిల్లలున్నారు. ఇద్దరి భర్తల ద్వారా ఆమె ఇంత మంది పిల్లల్ని కనింది. ప్రస్తుతం ఇద్దరు భర్తలకు విడాకులిచ్చేసి.. డజను మంది పిల్లలతో జీవిస్తుంది. అంత మంది పిల్లలున్నా ఆమె సంతృప్తి చెందినట్లు కనిపించడం లేదు. ఇప్పుడు మూడో పెళ్లికి రెడీ అయ్యింది. అయితే ఆమెకు రాబోయే భర్త.. పిల్లల తండ్రి అయ్యి ఉండాలన్న కండిషన్ పెడుతుంది. వివరాల్లోకి వెళితే.. వెరోనికా.. 14 ఏళ్ల వయస్సులోనే తొలి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత వరుసగా పిల్లల్ని కంటూనే ఉంది. 2021లో ఆమె తన రెండో భర్తకు విడాకులు ఇచ్చింది. ప్రస్తుతం ఆమె వయస్సు 37 సంవత్సరాలు. పిల్లల కోసం మూడో పెళ్లి చేసుకోవాలనుకుంటోంది. అయితే తనకు కాబోయే భర్తకు.. 10 మంది పిల్లలు ఉండాలన్న షరతు పెడుతోంది. అటువంటి భర్త దొరికితే.. అప్పుడు పిల్లల సంఖ్య 22కు చేరుతుంది. ఈ మేరకు ఫేస్ బుక్ ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించింది. బ్రిటన్‌లో తమది అతిపెద్ద కుటుంబంగా ఉండాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది. అందుకే 10 మంది పిల్లలున్న వ్యక్తిని భర్తగా రావాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది. అటువంటి భర్త కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి