iDreamPost

నంబర్ వన్ ర్యాంక్ కంటే కూడా నాకు అదే ముఖ్యం: మహ్మద్ సిరాజ్

  • Author singhj Published - 09:25 AM, Fri - 10 November 23

టీమిండియా స్పీడ్ గన్ మహ్మద్ సిరాజ్ వన్డేల్లో నంబర్ వన్ బౌలర్​గా అవతరించాడు. బ్యాటర్ల ర్యాంకుల్లో శుబ్​మన్ గిల్ టాప్ ప్లేస్​కు దూసుకొచ్చాడు.

టీమిండియా స్పీడ్ గన్ మహ్మద్ సిరాజ్ వన్డేల్లో నంబర్ వన్ బౌలర్​గా అవతరించాడు. బ్యాటర్ల ర్యాంకుల్లో శుబ్​మన్ గిల్ టాప్ ప్లేస్​కు దూసుకొచ్చాడు.

  • Author singhj Published - 09:25 AM, Fri - 10 November 23
నంబర్ వన్ ర్యాంక్ కంటే కూడా నాకు అదే ముఖ్యం: మహ్మద్ సిరాజ్

మహ్మద్ సిరాజ్.. టీమిండియా ఫ్యాన్స్​కు పరిచయం అక్కర్లేని పేరు. భారత క్రికెట్​లోకి ఓ రాకెట్​లా దూసుకొచ్చాడీ యంగ్ పేసర్. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా కేవలం తన టాలెంట్​ను నమ్ముకొని ఈ స్థాయికి చేరుకున్నాడు సిరాజ్. ఒకప్పుడు హైదరాబాద్​లో లోకల్​ మ్యాచులు ఆడే ప్లేయర్ ఆ తర్వాత రంజీలకు సెలెక్ట్ అవ్వడం, అక్కడ బాగా పెర్ఫార్మ్ చేసి ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో ఆడే ఛాన్స్ దక్కించుకోడం తెలిసిందే. ఐపీఎల్​లో రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున అదరగొట్టి అప్పటి భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కళ్లల్లో పడ్డాడు. మంచి పేస్​తో బౌలింగ్ వేస్తుండటం, సీమింగ్ డెలివరీస్​తో బ్యాటర్లను బుట్టలో వేసుకోవడంతో సిరాజ్​ను మరింత ఎంకరేజ్ చేశాడు కోహ్లీ. ఆ తర్వాత అద్భుతంగా రాణించి ఏకంగా టీమిండియాలోనే చోటు దక్కించుకున్నాడీ హైదరాబాదీ పేసర్.

కెరీర్ మొదట్లో వికెట్లు తీస్తున్నా బాగా రన్స్ ఇచ్చేవాడు సిరాజ్. ఇప్పుడు కూడా ఒక్కోసారి భారీగా పరుగులు ఇస్తుంటాడు. అయితే రన్స్ ఇచ్చినా కంటిన్యూగా వికెట్లు తీస్తుంటాడు సిరాజ్. పిచ్​ నుంచి స్వింగ్ రాబడుతూనే సీమ్ డెలివరీస్​ను సంధిస్తూ బ్యాటర్లను కన్​ఫ్యూజ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఒక్కోసారి పరుగులు వెళ్లినా వికెట్లు కూడా పడతాయి. అందుకే సిరాజ్​ను పిలిచి మరీ బౌలింగ్ ఇస్తుంటారు కెప్టెన్స్. అతడి బౌలింగ్ మీద ఉన్న నమ్మకం, వికెట్లు తీయాలనే కసి ఉండటంతో ఎంకరేజ్ చేస్తుంటారు. తనకు వచ్చిన ప్రతి ఛాన్స్​ను అద్భుతంగా సద్వినియోగం చేసుకుంటున్న ఈ స్టార్ పేసర్ క్రమంగా అన్ని ఫార్మాట్లలోనూ టీమిండియాలో రెగ్యులర్ ప్లేయర్​గా మారాడు. ఆసియా కప్-2023 నుంచి సిరాజ్ మరింత డేంజరస్​ బౌలర్​గా మారాడు. ఆ టోర్నీ ఫైనల్స్​లో శ్రీలంకను పోయించాడీ స్పీడ్​స్టర్. అతడి దెబ్బకు లంక కేవలం 50 రన్స్​కు ఆలౌట్ అయింది. ఆ మ్యాచ్​లో సిరాజ్ ఒక్కడే 6 వికెట్లు తీశాడు.

ఆసియా కప్ ఫామ్​నే వరల్డ్ కప్-2023లోనూ కంటిన్యూ చేస్తున్నాడు మహ్మద్ సిరాజ్. భారత బౌలింగ్ టైమ్​లో మరో పేసర్ జస్​ప్రీత్ బుమ్రాను ఆచితూచి ఆడుతున్న ప్రత్యర్థి బ్యాటర్లు.. సిరాజ్​, షమీలకు దొరికిపోతున్నారు. ఆసియా కప్ నుంచి వరల్డ్ కప్ స్టార్టింగ్ మ్యాచుల వరకు షమి లాంటి సీనియర్ బౌలర్​ను కాదని.. సిరాజ్​కు ప్లేయింగ్ ఎలెవన్​లో​ చోటు ఇచ్చారంటే అతడిపై కెప్టెన్​ రోహిత్​కు ఉన్న నమ్మకం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. తన అద్భుతమైన ఫామ్​ను కంటిన్యూ చేస్తున్న సిరాజ్.. ఐసీసీ రీసెంట్​గా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్​లో నంబర్ వన్ ప్లేస్ దక్కించుకున్నాడు.

ర్యాంకుల గురించి సిరాజ్ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యాడు. ‘వన్డే క్రికెట్​లో గతంలో ఒకసారి నంబర్ వన్​ అయ్యా. ఆ తర్వాత ర్యాంకును నేను కోల్పోయా. మళ్లీ ఇప్పుడు ఫస్ట్ ప్లేసుకు వచ్చా. అందుకే ఈ ర్యాంకుల గురించి పెద్దగా ఏమీ అనిపించట్లేదు. టీమిండియా వరల్డ్ కప్ నెగ్గడమే ముఖ్యం. జట్టులోని ప్రతి సభ్యుడిదీ ఇదే టార్గెట్. నా గోల్ కూడా ఇదే. నా పెర్ఫార్మెన్స్ టీమ్​కు ఎంత వరకు ఉపయోగపడిందనేదే కీలకం. టోర్నమెంట్​లో ప్రతి ప్లేయరూ హండ్రెడ్ పర్సెంట్ కష్టపడుతున్నారు. ఇలాంటి టీమ్​లో స్థానం దక్కించుకోవడం గర్వంగా ఉంది. ఇక వరల్డ్ కప్​ నెక్స్ట్ ఫేజ్​లోనూ మా పెర్ఫార్మెన్స్ ఇలాగే ఉంటుందని నమ్ముతున్నా’ అని సిరాజ్ చెప్పుకొచ్చాడు. మరి.. ర్యాంకుల గురించి సిరాజ్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఇండియాతో సెమీస్.. కేన్ విలియమ్సన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి