iDreamPost

వరల్డ్ కప్ ఓటమి.. వీడియో షేర్ చేసిన షమీ మాజీ భార్య! ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..

  • Author Soma Sekhar Published - 09:18 AM, Tue - 21 November 23

దేశం మెుత్తం వరల్డ్ కప్ పోయిందన్న తీవ్ర దుఃఖంలో ఉంటే.. షమీ మాజీ భార్య హసిన్ జహాన్ మాత్రం పుండు మీద కారం చల్లేలా సోషల్ మీడియాలో ఓ రీల్ ను పోస్ట్ చేసింది. దీంతో ఆమెపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దేశం మెుత్తం వరల్డ్ కప్ పోయిందన్న తీవ్ర దుఃఖంలో ఉంటే.. షమీ మాజీ భార్య హసిన్ జహాన్ మాత్రం పుండు మీద కారం చల్లేలా సోషల్ మీడియాలో ఓ రీల్ ను పోస్ట్ చేసింది. దీంతో ఆమెపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • Author Soma Sekhar Published - 09:18 AM, Tue - 21 November 23
వరల్డ్ కప్ ఓటమి.. వీడియో షేర్ చేసిన షమీ మాజీ భార్య! ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..

టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ మాజీ భార్య హసిన్ జహాన్ మరోసారి వార్తల్లో నిలిచింది. వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు ఫ్యాన్స్. ఆ బాధతో పలువురు ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటనలు దేశంలో జరిగిన విషయం తెలిసిందే. దీంతో దేశం మెుత్తం వరల్డ్ కప్ పోయిందన్న తీవ్ర దుఃఖంలో ఉంటే.. షమీ మాజీ భార్య హసిన్ జహాన్ మాత్రం పుండు మీద కారం చల్లేలా సోషల్ మీడియాలో ఓ రీల్ ను పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ వైరల్ కావడంతో.. ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే?

ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా విజయం సాధించి.. ముచ్చటగా మూడోసారి వరల్డ్ కప్ ను ముద్దాడుతుందని అందరూ భావించారు. కానీ కంగారూ టీమ్ భారత ఆశలపై నీళ్లు చల్లుతూ.. టైటిల్ ను ఎగరేసుకుపోయింది. దీంతో ప్రతీ భారతీయుడి హృదయం బరువెక్కిపోయింది. ఈ ఓటమిని జీర్ణించుకోలేక కొందరు యువకులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ ఇలాంటి టైమ్ లో షమీ మాజీ భార్య పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టీమిండియా ఓడిపోయిన తర్వాత హసీన్ జహాన్ తన ఇన్ స్ట్రాగ్రామ్ లో ఓ రీల్ ను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో బ్యాక్ గ్రౌండ్ లో ఓ వాయిస్ వినిపిస్తూ.. ‘అంతిమ విజయం మంచి మనసున్న వాళ్లకే చేకూరుతుంది’ అనే డైలాగ్ ఉంది.

అయితే ఈ రీల్ ఉద్దేశం ఏంటో జహాన్ బయటపెట్టలేదు. మహ్మద్ షమీపై ఉన్న కోపాన్ని టీమిండియాకు ఆపాదిస్తూ.. జహాన్ ఈ రీల్ చేసిందంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. గత కొంతకాలంగా హసీన్ జహాన్ షమీపై ప్రత్యక్షంగా, పరోక్షంగా విమర్శలు చేస్తూనే వస్తోంది. ఇటీవలే షమీ మంచి క్రికెటర్ గానే కాకుండా మంచి మనిషిగా ఉంటే తమ జీవితాలు బాగుండేదంటూ కామెంట్స్ చేసింది. అయితే ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికీ.. షమీ మాత్రం ఈ టోర్నీలో అద్భుతంగా రాణించాడు. ఆడింది తక్కువ మ్యాచ్ లే అయినప్పటికీ 24 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. మరి షమీ మాజీ భార్య చేసిన పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Haseen Jahan (@hasinjahanofficial)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి