iDreamPost

డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల జాబితాలో ఎమ్మెల్యే పేరు

డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల జాబితాలో ఎమ్మెల్యే పేరు

24 ఏళ్ల తర్వాత డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల జాబితాలో ఏపీకి చెందిన ఓ ఎమ్మెల్యే పేరు వచ్చింది. ఇన్నాళ్లకు లిస్టులో తనపేరు రావడంపై ఆ ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేస్తూ.. సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. కానీ.. ఇదేదో 1998లోనే వచ్చి ఉంటే.. ఉపాధ్యాయ వృత్తిలోనే ఉండేవాడినని, రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదన్నారు. ఆయనే అనకాపల్లి జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. 1998 డీఎస్సీలో ఎంపికయ్యారు. రాజకీయాల్లోకి రాకముందు.. సుమారు పాతికేళ్ల క్రితం ధర్మశ్రీ డీఎస్సీ పరీక్ష రాసి అర్హత సాధించారు. ఆ తర్వాత డీఎస్సీ లిస్టుపై కోర్టులో కేసు వేయడంతో.. ఉద్యోగ నియామకాలు ఆగిపోయాయి. పాతికేళ్ల తర్వాత ఆయనకు టీచర్ గా ఉద్యోగ అవకాశం వచ్చింది. ఈ విషయంపై ఎమ్మెల్యే తనదైన శైలిలో స్పందించారు.

30 ఏళ్ల వయసులో మద్రాసు అన్నామలై యూనివర్సిటీలో బీఈడీ చదివిన ధర్మశ్రీ.. ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలనుకున్నారు. 1998లో డీఎస్సీ రాసి అర్హత సాధించారు. అది పెండింగ్ లో పడటంతో న్యాయవిద్య (బీఎల్) చదవడం మొదలుపెట్టారు. అదే సమయంలో రాజకీయ అరంగేట్రం చేసి కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 25 ఏళ్ల రాజకీయ జీవితంలో రెండు దఫాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆనాడే ఉపాధ్యాయుడిగా ఎన్నికై ఉంటే.. ఆ వృత్తికే ప్రాధాన్యమిచ్చేవాడినని అన్నారు ఎమ్మెల్యే ధర్మశ్రీ. సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న చొరవతో పాతికేళ్లుగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల కల నెరవేరిందన్నారు. సీఎం జగన్ కు డీఎస్సీ 1998బ్యాచ్ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి