iDreamPost

హిందూపురంలో బాలయ్యకు ఝలక్ తగలబోతోందా..?

హిందూపురంలో బాలయ్యకు ఝలక్ తగలబోతోందా..?

ఓటర్లంటే ఏమాత్రం గౌరవం లేదు… ప్రజలపై చులకన భావం… ఏమన్నా ఏం చేయకున్నా మనకే ఓటేస్తారులేనన్న ధీమాతో చెలరేగిన టీడీపీకి చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయి. దాదాపు నాలుగు దశాబ్దాలుగా అండగా నిలుస్తూ వచ్చిన ఓటర్లను తిట్టుకుంటూ, కొట్టుకుంటూ పోవడం వల్ల ఈ మున్సిపల్ ఎన్నికల్లో బాలయ్యకు కర్ర కాల్చి వాత పెట్టామని ఓటర్లు చెప్తున్నారు.

1960 నుంచి హిందూపురం మున్సిపాలిటీగా కొనసాగుతోంది. టీడీపీకి ముందు వరకు ఇక్కడ కాంగ్రెస్ దే హవా. ఆ తరువాత టీడీపీ ఏర్పడినప్పటి నుంచి నియోజకవర్గ ప్రజలు ఆ పార్టీకి అండగా నిలుస్తూ వస్తున్నారు. 2014, 2019లో ఇక్కడినుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన నందమూరి బాలయ్య తన అహంభావంతో కార్యకర్తలను పొగుట్టుకుంటూ వెళ్తున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 38లో 30 పంచాయతీలను అధికార వైసీపీ గెలుచుకుంది. మున్సిపాలిటీలోనూ పాగా వేసేందుకు తీవ్రంగా కృషి చేసింది.

Also Read : రాజ‌కీయ ప‌రిభ్ర‌మ‌ణం అంటే ఇదే – రెండు దశాబ్దాల తరువాత మళ్ళీ చైర్మన్ గా పోటి

ఒకవైపు ఓటమి దగ్గర పడుతుండటంతో బాలయ్యకు ఫ్రస్టేషన్ పీక్స్ కి వెళ్లింది. కార్యకర్తలపై అసహనం వెళ్లగక్కడం.. కొన్ని చోట్ల అభిమానులపై చేయి చేసుకోవడంతో ప్రజలంతా ఆగ్రహంతో వున్నారు. దీనికి తోడు బాలయ్య ఏం మాట్లాడతారో ఎవరికి అర్థం కాని పరిస్థితి. దాదాపు వారం రోజులు నియోజకవర్గంలో తిష్ట వేసి ఇంటింటికి తిరిగి ప్రచారం చేసుకున్నా ఫలితం లేకుండా పోయింది.

ఇక్కడ మొత్తం 38 వార్డులున్నాయి. అన్ని వార్డులకు ఎన్నికలు జరిగాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ లు అన్ని చోట్లా తమ అభ్యర్థులను బరిలో దింపాయి. టీడీపీ నుంచి సర్వం తానై బాలయ్య చూసుకోవడం ఆ పార్టీకి పెద్ద మైనస్ గా మారింది. ఎలాగైనా మున్సిపాలిటీ లో పాగా వేయాలని కృతనిశ్చయంతో ఉన్న వైసీపీ పక్కా వ్యూహంతో ముందుకెళ్లింది. ఇందులో భాగంగా ఎమ్మెల్సీగా మరోసారి మహమ్మద్ ఇక్బాల్ కు అవకాశం ఇచ్చి మైనార్టీల ఓట్లు పక్కకెళ్లకుండా చూసుకుంది. నియోజకవర్గ బాధ్యతలు మాజీ ఎమ్మెల్యే విష్వేశ్వరరెడ్డికి అప్పగించింది. ఇక్బాల్, విష్వేశ్వర్ కలిసి సమన్వయంతో పనిచేయడంతో 25 నుంచి 28 వార్డుల్లో వైసీపీ గెలిచే అవకాశం ఉంది.

చైర్మన్ పీఠం జనరల్ కి కేటాయించడంతో వైసీపీ నుంచి బలరామి రెడ్డి, మారుతీ రెడ్డి పోటీ పడుతున్నారు. వీరిద్దరిలో బలరామిరెడ్డి కి ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, టీడీపీ అభ్యర్థులు ఎన్నికలకు ముందే చేతులెత్తేశారు. ఆ పార్టీ నుంచి ఆశావహులే కరువయ్యారు. ఉన్న వారిలో యాదవ సామాజిక వర్గానికి చెందిన చంద్రమోహన్ మాత్రమే లైన్ లో వున్నారు. కాగా, 2007లో చివరి సారిగా మున్సిపాలిటీ ని కాంగ్రెస్ గెలుచుకుంది. ఇక మాజీ చైర్ పర్సన్ లక్ష్మి ఈ ఎన్నికల్లో బరిలోనే నిలవలేదు.

Also Read : అయ్యన్న శ్రమ ఫలిస్తుందా?మున్సిపాలిటీ దక్కుతుందా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి