iDreamPost

పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఇది గమనించారా? రోహిత్‌-కోహ్లీ మధ్య వార్‌ జరిగేదే?

  • Published Oct 15, 2023 | 6:02 PMUpdated Oct 16, 2023 | 4:01 PM
  • Published Oct 15, 2023 | 6:02 PMUpdated Oct 16, 2023 | 4:01 PM
పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఇది గమనించారా? రోహిత్‌-కోహ్లీ మధ్య వార్‌ జరిగేదే?

వరల్డ్‌ కప్‌లో భాగంగా శనివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. తొలుత పాకిస్థాన్‌ను తక్కువ స్కోర్‌కే ఆలౌట్‌ చేసిన టీమిండియా.. ఆ తర్వాత వాళ్ల బౌలింగ్‌ను డామినేట్‌ చూస్తూ టార్గెట్‌ను ఊదిపారేసింది. టీమిండియా బౌలర్ల కష్టంతో సెట్‌ అయిన ప్లాట్‌ఫామ్‌పై రోహిత్‌ శర్మ రెచ్చిపోయి ఆడి.. పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించాడు. కేవలం 63 బంతుల్లోనే 6 ఫోర్లు, 6 సిక్సులతో 86 పరుగులు చేసి అదరగొట్టాడు. రోహిత్‌ ఆడిన వేగానికి చిన్న టార్గెట్‌ మరింత చిన్నబోయింది. కాగా.. ఈ మ్యాచ్‌లో అంతా టీమిండియా విజయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఈ మ్యాచ్‌లోనే టీమిండియా రెండు కళ్లలా ఉన్న కెప్టెన్ రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ మధ్య పెద్ద సమన్వయలోపం సంభవించింది.

ఈ సంఘటన టీమిండియా ఇన్నింగ్స్‌ 9వ ఓవర్‌లో చోటు చేసుకుంది. అప్పటికే టీమిండియా గిల్‌ రూపంలో భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. అదే సమయంలో మరో వికెట్‌ కోల్పోతే.. కాస్త టెన్షన్‌ మొదలయ్యేది. టార్గెట్ ఎంత చిన్నగా ఉన్నా కూడా పాకిస్థాన్‌ బౌలింగ్‌ను తక్కువ అంచనా వేయలేం కదా. ఇలాంటి టైమ్‌లో రోహిత్‌ శర్మ-విరాట్‌ కోహ్లీ మధ్య​ పెద్ద మిస్‌ అండర్‌స్టాండింగ్‌ చోటు చేసుకుంది. పాక్‌ బౌలర్‌ హరీస్‌ రౌఫ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 9వ ఓవర్‌ మూడో బంతిని రోహిత్‌ శర్మ మిడ్‌ఆన్‌ దిశగా ఆడాడు. వెంటనే రన్‌కు ప్రయత్నించాడు. అయితే.. బాల్‌ ఫీల్డర్‌ చేతుల్లో ఉన్నా కూడా రోహిత్‌ రన్‌ ఆపలేదు. బాల్‌ చూస్తుండూ పోయిన కోహ్లీ కూడా రోహిత్‌కి నో చెప్పే లోపే రోహిత్‌ చాలా దూరం వచ్చేశాడు. దీంతో చేసేదేం లేక.. కోహ్లీ కూడా రన్‌ అందుకున్నాడు.

అయితే.. పాకిస్థాన్‌ ఫీల్డర్‌ షాహీన్‌ అఫ్రిదీ త్రో సరిగా వేయకపోవడంతో విరాట్‌ కోహ్లీ రన్‌ అవుట్‌ ప్రమాదం నుంచి తప్పించుకన్నాడు. అప్పటికీ కోహ్లీ 14 పరుగులు చేసి ఉన్నాడు. ఆ టైమ్‌లో కోహ్లీ అవుటై ఉంటే.. టీమిండియాపై ప్రెషర్‌ పెరిగేది. అలాగే కోహ్లీ రనౌట్‌తో రోహిత్‌ కూడా కాస్త మెంటల్‌గా కాస్త డిస్ట్రబ్‌ అయ్యేవాడు. కానీ, అదృష్టవశాత్తు కోహ్లీ పెద్ద డైవ్‌ కొట్టి రనౌట్‌ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కాగా, ఇద్దరు టీమిండియా స్టార్‌, సీనియర్‌ ప్లేయర్ల మధ్య ఇలాంటి మిస్‌ అండర్‌స్టాండింగ్‌ ఏంటంటూ క్రికెట్‌ ఫ్యాన్స్‌ కూడా షాక్‌ అవుతున్నారు. రోహిత్‌ చేసిన తప్పు కారణంగా కోహ్లీ అవుటై ఉంటే.. రోహిత్‌-కోహ్లీ మధ్య పరిస్థితి ఎలా ఉండేదో ఊహించడం కష్టం. అప్పటికీ కోహ్లీ కాస్త కోపంగా ఉన్నా.. ఆ తర్వాత కూల్‌ అయ్యాడు. మరి టీమిండియా స్టార్‌ బ్యాటర్ల మధ్య ఇలాంటి ఇబ్బంది చోటు చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: World Cup: ఇండియాపై పాక్‌ ఓటమి తర్వాత.. షోయబ్‌ అక్తర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి