iDreamPost

వీడియో: హారర్ మూవీలో మిల్కీ బ్యూటీ తమన్నా.. ముందే లీకైన సీన్స్!

Milky Beauty Tamanna New Horror Movie Teaser Leaked: తమన్నా భాటియా మరో కొత్త హారర్ చిత్రంలో నటిస్తోంది. అయితే ఆ మూవీకి సంబంధించిన సీన్స్ నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో అదే రచ్చ నడుస్తోంది.

Milky Beauty Tamanna New Horror Movie Teaser Leaked: తమన్నా భాటియా మరో కొత్త హారర్ చిత్రంలో నటిస్తోంది. అయితే ఆ మూవీకి సంబంధించిన సీన్స్ నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో అదే రచ్చ నడుస్తోంది.

వీడియో: హారర్ మూవీలో మిల్కీ బ్యూటీ తమన్నా.. ముందే లీకైన సీన్స్!

మిల్కీ బ్యూటీ తమన్నా.. అటు నార్త్ లో ఇటు సౌత్ లో అదే రేంజ్ లో స్టార్డమ్ కంటిన్యూ చేస్తున్న స్టార్ హీరోయిన్. సీనియర్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు దాదాపుగా టాప్ లిస్ట్ మొత్తంతో నటించి మెప్పించేసింది. ఈ మద్యకాలంలో క్యామియోలు, స్పెషల్ సాంగ్స్ తో కూడా తన సత్తా చూపుతోంది. అటు వెబ్ సిరీస్లు కూడా చేస్తూ ఆడియన్స్ ని అలరించేస్తోంది. బాలీవుడ్ లో అయితే తమన్నా క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది. తాజాగా తాను చేసిన బాలీవుడ్ సినిమాకి సంబంధించి ఒక టీజర్ లీకైంది. నెట్టింట ఇప్పుడు అంతా ఈ టీజర్ గురించే చర్చ జరుగుతోంది. మరి.. ఆ సినిమా ఏది? ఆ మూవీలో తమన్నా రోల్ ఏంటో చూద్దాం.

తమన్నా ఒక మూవీ ఒప్పుకుంది అంటే దాదాపుగా హిట్టు పక్కా అనే టాక్ ఉంది. తమన్నా ట్రాక్ రికార్డు చూసుకుంటే ఆ విషయం స్పష్టమవుతుంది. నేను హీరోయిన్ గానే చేస్తాను అని కాకుండా.. ఫ్యాన్స్ ని అలరించేలా ఉంటే చాలు అనుకుంటూ ముందుకు వెళ్తోంది. అందుకే జైలర్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి పాన్ ఇండియా లెవల్లో ఒక ఊపు ఊపేసింది. ఆ తర్వాత బాక్ సినిమాలో హీరోయిన్ గానే కాకుండా.. రాశీఖన్నాతో కలిసి అచ్చో అచ్చో అచ్చచ్చో అనే సాంగ్ చేసి మళ్లీ అదరగొట్టింది. ఇప్పుడు ఈ అమ్మడు మళ్లీ అలాంటి మ్యాజిక్ నే ఓ బాలీవుడ్ సినిమాలో చేస్తోంది. అందుకు సంబంధించి అధికారిక వార్త రాలేదు కానీ.. లీకులు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tamanna

ప్రస్తుతం నెట్టింట, బాలీవుడ్ లో ఒక సినిమా గురించి బాగా చర్చ జరుగుతోంది. ఆ మూవీ మరేదో కాదు.. స్త్రీ 2. ఎందుకంటే ఈ మూవీకి సంబంధించిన టీజర్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నిజానికి ఇంకా అధికారికంగా టీజర్ ని రిలీజ్ చేయలేదు. కానీ, లీకుల వీరుల పుణ్యమా అని అది కాస్తా వైరల్ అవుతోంది. ఆ సినిమాలో శ్రద్ధా కపూర్, తమన్నా భాటియా, వరుణ్ ధావన్, రాజ్ కుమార్ రావ్, పంకజ్ త్రిపాఠి వంటి స్టార్స్ ఉన్నారు. ఇది ఒక హారర్ కామెడీ డ్రామా ఫిల్మ్. ఈ మూవీకి సంబంధించిన టీజర్ లో వీళ్లంతా కనిపించారు. అయితే తమన్నా ఈ మూవీలో కూడా ఒక స్పెషల్ నంబర్ చేస్తోంది అంటూ వార్తలు వచ్చాయి.

తమన్నా విషయంలో వస్తున్న వార్తలను నిజం చేస్తూ.. తమన్నా డాన్స్ చేస్తున్న క్లిప్స్ అయితే ఈ లీక్డ్ టీజర్ లో కనిపించాయి. గ్రీన్ కలర్ డ్రెస్స్ లో అదిరిపోయే స్టెప్పులు వేసింది. అలాగే ఈ మూవీ ఒక హారర్ కామెడీ అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ టీజర్ ని కట్ చేశారు. అన్నీ లీడ్ క్యారెక్టర్స్ ఈ టీజర్ లో చూపించారు. ఇంక రిలీజ్ డేట్ విషయానికి వస్తే.. ఆగస్టు నెలలో వస్తుందని తెలుస్తోంది. ఐఎండీబీలాంటి సైట్ లో ఆగస్టు 30న రావచ్చు అంటున్నారు. సోషల్ మీడియాలో మాత్రం ఆగస్టు 15న విడుదల కాబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి. మరో సినిమాలో స్పెషల్ సాంగ్ తో తమన్నా వస్తుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి