iDreamPost

బిల్లు రూ. 2 వేలు.. టిప్పు రూ. 8 లక్షలు.. రాత్రికి రాత్రే ఆమె ఫేట్ మారిపోయింది

ఈ రోజుల్లో్ జీతం కోసం పని చేసేవాళ్ల కన్నా, కమిషన్, పై డబ్బుల కోసం వర్క్ చేస్తున్నారు. అటువంటి ఉద్యోగాల్లో ఒకటి రెస్టారెంట్స్ లోని వెయిటర్ జాబ్స్. జీతంతో పాటు వచ్చే టిప్ .. వీరి ఆర్థిక అవసరాలు తీరుస్తుంది. అయితే..

ఈ రోజుల్లో్ జీతం కోసం పని చేసేవాళ్ల కన్నా, కమిషన్, పై డబ్బుల కోసం వర్క్ చేస్తున్నారు. అటువంటి ఉద్యోగాల్లో ఒకటి రెస్టారెంట్స్ లోని వెయిటర్ జాబ్స్. జీతంతో పాటు వచ్చే టిప్ .. వీరి ఆర్థిక అవసరాలు తీరుస్తుంది. అయితే..

బిల్లు రూ. 2 వేలు.. టిప్పు రూ. 8 లక్షలు.. రాత్రికి రాత్రే ఆమె ఫేట్ మారిపోయింది

సాధారణంగా ఓ రెస్టారెంట్‌కు వెళితే.. ఏం కావాలంటూ వచ్చి అడుగుతుంటారు వెయిటర్స్. మనం ఏం తినాలనుకున్నా.. టేస్ట్ చేసేందుకు ఏ ఫుడ్ బాగుంటుందో సజెస్ట్ చేయాలన్న ఉద్దేశంతో వారిని సంప్రదిస్తుంటారు ఫుడ్డీస్. భోజనం చేశాక.. బిల్లు చెల్లించాక.. వారు చేసిన సేవలకు గానూ .. టిప్పు రూపంలో కొంత డబ్బులు ఇస్తుంటారు. సాధారణంగా ఓ రెండు, మూడు వేలు బిల్లు చేస్తుంటే.. వంద, రెండు వందల రూపాయాలు ఇస్తుంటారు కస్టమర్లు. కానీ ఈ కస్టమర్ ప్రత్యేకం.. చిన్న బిల్లుకే.. లక్షల టిప్పు ఇచ్చి.. ఆ వెయిటర్‌ను సంభ్రమాశ్చర్యంలో పడేయడంతో  రాత్రికి రాత్రే ఆమె ఫేట్ మారిపోయేలా చేసింది. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే…?

రూ. 2 వేల బిల్లుకు రూ. 8 లక్షల టిప్పు ఇచ్చి దాతృత్వాన్ని ప్రదర్శించాడో కస్టమర్. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని మిచ్ గావ్‌లోని బెన్ టెన్ హార్బర్‪లో ఉన్న మాసన్ జార్ కేఫ్ అనే రెస్టారెంట్‌కు వెళ్లిన ఓ కస్టమర్.. అల్పాహారం ఆర్డర్ చేశాడు. అనంతరం సర్వర్ బిల్లు తీసుకురాగా, అందులో 32 డాలర్లకు పైగా బిల్ అయ్యింది. కాగా, అతను.. ఆ మహిళా వెయిటర్‌ కు 10 వేల డాలర్లు టిప్పుగా ఇచ్చారు. అంటే మన కరెన్సీ ప్రకారం అక్షరాలా రూ. 8.3 లక్షలన్నమాట. ఆ బిల్లు, ఆ కస్టమర్ ఇచ్చిన టిప్పును సోషల్ మీడియా వేదికగా సదరు రెస్టారెంట్ షేర్ చేసింది.

వెయిటర్స్ కు ఇంత టిప్పు చెల్లించిన ఆ కస్టమర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది కూడా. అయితే ఆ టిప్పును మొత్తం తొమ్మిది మందికి షేర్ చేసింది సంస్థ. ఒక్కొక్కరికి 1,100 డాలర్ల చొప్పున అందించింది. కాగా, ఆ వెయిటర్‌ను సంస్థ తొలగించిందంటూ వార్తలు వినిపించాయి. ఈ విషయాన్ని సదరు రెస్టారెంట్ కూడా ధృవీకరించింది. కానీ.. అది టిప్పు వల్ల కాదని తేల్చి చెప్పింది. అలాగే ఇంకేవో పొంతన లేని కారణాలు వెల్లడించింది. ఆమె ఏదో పన్నులు చెల్లించలేదని, కార్మిక చట్టాలు అంగీకరించట్లేదని ఏవో కారణాలు చెబుతుండగా.. రెస్టారెంట్ గురించి బాగా తెలిసిన వాళ్లు మాత్రం.. వారి నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు. ఆ మహిళా వెయిటర్ టిప్పు తీసుకున్నందు వల్లే.. తొలగించారంటూ మండిపడిందో కస్టమర్. ప్రతి కథకు మూడు పార్వ్వాలు ఉంటాయంటూ పేర్కొంది. మరి 2 వేల బిల్లుకి 8 లక్షల పైనే టిప్ ఇచ్చిన కస్టమర్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Mason Jar Cafe (@masonjarcafe_)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి