iDreamPost

హైదరాబాద్ లో మరో భారీ అగ్నిప్రమాదం!

Massive Fire in Nacharam: హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ప్రమాదాల్లో భారీగా ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది.

Massive Fire in Nacharam: హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ప్రమాదాల్లో భారీగా ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది.

హైదరాబాద్ లో మరో భారీ అగ్నిప్రమాదం!

ఈ మధ్య కాలంలో హైదరాబాద్.. పరిసర ప్రాంతాల్లో తరుచూ అగ్ని ప్రమాదాలు ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. ఈ ప్రమాదాల్లో కోట్ల ఆస్తి నష్టం మాత్రమే కాదు.. ప్రాణాలు కూడా పోతున్నాయి. చాలా వరకు అగ్ని ప్రమాదాలకు కారణం మానవ తప్పిదాలు, షార్ట్ సర్క్యూట్ అయితే.. ప్రకృతి విపత్తు వల్ల కొన్ని జరుగుతున్నాయి. సాధారణంగా కెమికల్, బాణా సంచా ఫ్యాక్టీరీలు, ప్లాస్టీక్ గోదాములు, వస్త్ర సముదాయాల్లో ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీ ఉంచాలి. చిన్న ప్రమాదాలు సంభవిస్తే వెంటనే వాటిని ఉపయోగించి ఆర్పేయవొచ్చు.. కానీ కొంతమంది వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల చిన్న ప్రమాదాలు పెద్దగా మారి భారీ నష్టాన్ని తెస్తున్నాయి. హైదారాబాద్ లో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరుస అగ్ని ప్రమాదాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వేసవి కాలంలో అగ్ని ప్రమాదాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. తాజాగా హైదరాబాద్ లోని నాచారం పారిశ్రామిక వాడలో సోమవారం అర్థరాత్రి సమయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీకర్ బయోటెక్ అగ్ని కల్చర్ ఫెస్టిసైడ్స్ తయారు చేసే ఫ్యాక్టీరలో ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారే మంటలు చెలరేగడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు.. దట్టమైన పొగ రావడంతో చిన్న పిల్లలు, వృద్దులు శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది పడ్డారు.  స్థానికులు సమాచారం అందించడంతో ఆరు ఫైరింజన్లతో అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. చాలాసేపు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.

అగ్రి మాపక సిబ్బంది సకాలంలో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను త్వరతగతిన అదుపులోకి తేగలిగారని అంటున్నారు. కాకపోతే భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. రాత్రి పూట అగ్ని ప్రమాదం జరగడం వల్ల ఉద్యోగులు ఎవరూ లేకపోవడంతో అదృష్టం కొద్ది ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణ హాని కలగలేదని అధికారులు చెబుతున్నారు. చుట్టుపక్కల దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు చాలా ఇబ్బంది పడ్డట్లు తెలుస్తుంది.  కేసు నమోదు చేసుకున్న నాచారం పోలీసులు.. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా..? లేదా ఎవరైనా కావాలని నిప్పంటించారా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి