iDreamPost

భారీ అగ్ని ప్రమాదం.. కోట్లలో ఆస్తి నష్టం!

  • Published Mar 24, 2024 | 10:29 AMUpdated Mar 24, 2024 | 10:29 AM

Fire Accident: ఇటీవల దేశ వ్యాప్తంగా అగ్ని ప్రమాదాల సంఖ్య భారీగా పెరిగిపోయాయి. చాలా వరకు షార్క్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.

Fire Accident: ఇటీవల దేశ వ్యాప్తంగా అగ్ని ప్రమాదాల సంఖ్య భారీగా పెరిగిపోయాయి. చాలా వరకు షార్క్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.

  • Published Mar 24, 2024 | 10:29 AMUpdated Mar 24, 2024 | 10:29 AM
భారీ అగ్ని ప్రమాదం.. కోట్లలో ఆస్తి నష్టం!

ఈ మధ్య అగ్ని ప్రమాదాలు ప్రజల్లో తీవ్ర భయాందోళన సృష్టిస్తున్నాయి. చాలా వరకు షార్ట్ సర్క్యూట్, మానవ తప్పిదాల వల్ల అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. వేసవి కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతుంటాయని అంటున్నారు. కెమికల్, బాణా సంచ, ప్లాస్టీక్ ఫ్యాక్టీరీలు, వస్త్ర సముదాయాలు, టింబర్ డిపోలు ఇలా పలు చోట్ల అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా ఓ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కోట్లలో నష్టం వాటిల్లింది. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ నారాయణపేట జిల్లా మాగనూరు మండలం సమీపంలో బసవేశ్వర జిన్నింగ్, కాటన్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవొచ్చని భావిస్తున్నారు. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో మిల్లులో ఉన్న పత్తి బండల్స్, జిన్నింగ్ చేయడానికి తీసుకు వచ్చిన విత్తనాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి.

అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే మిల్లు యజమాని పోలీసులకు, ఫైర్ ఇంజన్ కి సమాచారం అందించారు. నారాయణపేట్, మక్తల్ నుంచి ఫైర్ ఇంజన్లు, వాటర్ ట్యాంకర్లను వచ్చి మంటలు ఇతర మిల్లులకు వ్యాపించకుండా జాగ్రత్త పడ్డారు. ఈ సందర్భంగా మిల్లు యమమాని మాట్లాడుతూ.. మిల్లుతో పాటు జిన్నింగ్ కోసం తెచ్చిన విత్తనాలు, పత్తి మొత్తం కాలిపోయింది. 8 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి