iDreamPost

TSRTC: ఉచిత ప్రయాణంలో ఎంత మంది మహిళలు జర్నీ చేశారో తెలుసా?

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం మహాలక్ష్మీ. ఈ స్కీమ్ ద్వారా మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత జర్నీ చేస్తున్నారు. తాజాగా ఈ ఫ్రీ బస్సు జర్నీకి సంబంధించిన లెక్క బయటకి వచ్చింది.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం మహాలక్ష్మీ. ఈ స్కీమ్ ద్వారా మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత జర్నీ చేస్తున్నారు. తాజాగా ఈ ఫ్రీ బస్సు జర్నీకి సంబంధించిన లెక్క బయటకి వచ్చింది.

TSRTC: ఉచిత ప్రయాణంలో ఎంత మంది మహిళలు జర్నీ చేశారో తెలుసా?

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు ఆరు గ్యారెటీలతో ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేశారు. అలానే అధికారంలోకి వచ్చిన తరువాత  గ్యారెటీలను అమలు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తోంది. అలానే ప్రతిష్టాత్మకంగా మహాలక్ష్మి అనే పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ స్కీమ్ ద్వారా మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఈ స్కీమ్ కి మహిళల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. మహిళలతో ఆర్టీసీ బస్సులు నిండిపోతున్నాయి. ఈ పథకం ప్రారంభించిన తరువాత ఎంత మంది మహిళలు జర్నీ చేశారో తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తిగా ఉన్నారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన సంగతి తెలిసిందే. బాలికలు, ఆడవారు, ట్రాన్సజెండర్లకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఉంది. రాష్ట్రంలోని  ఎక్కడి నుంచి ఎక్కడికైనా బస్సులో ఫ్రీగా జర్నీ చేయోచ్చు. ఇక కొత్త ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకానికి మహిళల నుంచి అనూహ్య స్పందన వస్తుంది.  డిసెంబర్ 9 నుంచి మహిళల ఫ్రీ జర్నీ కోసం ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. అలానే డిసెంబర్ 15వ తేదీ నుండి జీరో టికెట్ తీసుకుని ప్రయాణం చేయాలనే నిబంధన పెట్టారు ఆర్టీసీ అధికారులు.

ఈ ఫ్రీ బస్  స్కీమ్ తో 11 రోజుల్లో లక్షల మంది మహిళలు జర్నీ చేశారని తెలుస్తోంది. దీంతో ఆర్టీసీ బస్సులో అక్యూపేన్సి 69 శాతం నుంచి 88 శాతానికి పెరిగిందని అధికారులు లెక్కలు చెబుతున్నారు. గడచిన 11 రోజుల్లో లక్షల మంది మహిళలు ఫ్రీ జర్నీ చేశారు. అక్కడడక్కడ చిన్న సమస్యలు ఎదురవుతున్నప్పటికీ.. ఆర్టీసీ సిబ్బంది ప్రణాకులకు ఇలాంటి ఇబ్బంది కలగకుండా కష్టపడి పని చేస్తున్నారని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. ఇటీవల జీరో టికెట్ జారీ చేసే దగ్గర నుంచి ఇప్పటి వరకు రూ.110 కోట్ల టికెట్స్ ఇష్యూ చేసినట్లు తెలుస్తోంది.

ఈ సబ్సిడీ భర్తీ కోసం నెలకి 250 కోట్ల రూపాయల బడ్జెట్ ఈ పథకం కోసం ప్రభుత్వాన్ని అడిగే యోచనలో ఆర్టీసీ సంస్థ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఆర్టీసీ బస్సులో ప్రయాణించే మహిళలు తమ సంబంధించిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డ్ తప్పని చూపించాల్సి ఉంటుంది. జిరాక్స్ , ఫోన్లలో ఫోటోలు చూపించడం కుదరదని అధికారులు చెబుతున్నారు. గ్రామాలకు బస్సుల కనెక్టివిటీ పెంచుతామని, అప్పటి వరకు ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని కోరుతున్నారు అధికారులు. కొన్ని చోట్ల ఫ్రీ వద్దని వినతులు వచ్చాయని, అలాంటి వారు బస్ పాస్ తీసుకోవచ్చని అభిప్రాయాలు వినిపిస్తోన్నాయి.

ఇక పెరుగుతున్న రద్దీ దృష్ట్యా మరికొన్ని అదనపు బస్సులు రానున్నట్లు అధికారులు తెలిపారు.  ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 9 వేల బస్సులు మాత్రమే ఉపయోగంలో ఉన్నాయంట. అక్యుపెన్సీ రేషియో పెరగడంతో బస్సుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉందని అధికారులు తెలిపారు. వచ్చే ఐదు నెలలో 2వేల బస్సులు అందుబాటులోకి రానున్నాయని టాక్ వినిపిస్తోంది. మొత్తంగా ఫ్రీ జర్నీలో భారీగా మహిళలు జర్నీ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి