iDreamPost

Ava : ఆహా రూటులో అవా వస్తోందా

Ava : ఆహా రూటులో అవా వస్తోందా

మా ప్రెసిడెంట్ ఎన్నికల సందర్భంగా మంచు విష్ణు గట్టి పోటీ ఇచ్చి ఎట్టకేలకు గెలిచి పదవిని చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికైతే ఆర్టిస్టుల పరంగా హెల్త్ స్కీం తీసుకొచ్చారు కానీ ఇంకా చేయాల్సినవి చాలా పెండింగ్ లో ఉన్నాయి. వాటినలా ఉంచితే మంచు ఫ్యామిలీ త్వరలో డిజిటల్ రంగంలోకి అడుగు పెడుతున్నట్టు సమాచారం. ఓటిటి కంటెంట్ ని నిర్మించడమే లక్ష్యంగా దీని కార్యకలాపాలు ఉంటాయట. లక్ష్మి ప్రసన్న బ్యానర్ తో కాకుండా విష్ణు స్వంతంగా పెట్టుకున్న 24 ఫ్రేమ్స్ మీద ఈ వ్యవహారాలు ఉంటాయని తెలిసింది. ఇండిపెండెంట్ మూవీస్ తో పాటు వెబ్ సిరీస్ లు తదితరాలు వీటి ద్వారా వస్తాయన్న మాట. ఇదింకా అఫీషియల్ కాలేదు.

ఈ సంస్థకు అవా అనే పేరు ఫిక్స్ చేసినట్టుగా తెలిసింది. భవిష్యత్తులో వీటి కార్యకలాపాలు కనక ఊపందుకుని మంచి బిజినెస్ జరిగితే అప్పుడు ఆహా తరహాలో ఒక కంప్లీట్ ఓటిటిని లాంచ్ చేస్తారని వినికిడి. ప్రస్తుతం దీనికి సంబందించిన ఏర్పాట్లు ఫార్మాలిటీస్ అన్నీ సిద్ధం చేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. సినిమాల పరంగా మంచు విష్ణుకి ఏమంత కలిసి రావడం లేదు. ఆ మధ్య భారీ బడ్జెట్ తో తీసినట్టు చెప్పుకున్న మోసగాళ్లు మరీ దారుణంగా బాక్సాఫీస్ దగ్గర మోసం చేసింది. అటు మంచు మనోజ్ పరిస్థితి కూడా ఏమంత మెరుగ్గా లేదు. ఆర్భాటంగా మొదలుపెట్టిన అహం బ్రహ్మాస్మి ఏమయ్యిందో ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదు

ఈ లెక్కన ఇప్పుడు డిజిటల్ బిజినెస్ బెస్ట్ ఆప్షన్. ఓటిటిలో ఉన్న సౌలభ్యం ఏమిటంటే వీటిలో విషయం జనానికి నచ్చినా నచ్చకపోయినా నష్టం పాలు తక్కువగా ఉంటుంది. ఇంట్లోనే చూస్తున్నాం కదానే ఫీలింగ్ తో అధిక శాతం ప్రేక్షకులు ఏ కొత్త సినిమా వచ్చినా ఏ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ జరిగినా అందులో కంటెంట్ ని బట్టి ఒక్కసారైనా చూస్తారు. థియేటర్ దాకా వెళ్లే వ్యయప్రయాసలు ఉండవు కాబట్టి వీటికి ఆదరణ ఎక్కువ. ఆహా సక్సెస్ కావడానికి కారణం ఇదే. అవా కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అయినా ఆశ్చర్యం లేదు. రాబోయే రోజుల్లో మరిన్ని అగ్ర నిర్మాణ సంస్థలు హీరోలు నిర్మాతలు ఈ ఓటిటి రంగంలోకి రావడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు

Also Read : Tollywood Block Busters : దూసుకుపోతున్న టాలీవుడ్ బ్లాక్ బస్టర్స్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి