iDreamPost

హెల్మెట్ లేకున్నా ఇతనికి జరిమానా విధించరు.. ఎందుకంటే?

హెల్మెట్ లేకున్నా ఇతనికి జరిమానా విధించరు.. ఎందుకంటే?

ఇటీవల దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. డ్రైవర్ల నిరక్ష్యం, అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రోడ్డు భద్రతా చర్యలు కఠినతరం చేస్తున్నారు. ద్విచక్ర వాహనం నడిపేవారు తప్పని సరి హెల్మెట్ ధరించాలి. కారు డ్రైవ్ చేసేవారు సీటు బెల్టు తప్పని సరి. ఈ నిబంధనలు పాటించని వారికి ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తుంటారు. కానీ ఓ వ్యక్తికి హెల్మెట్ ధరించకపోయినా జరిమానా విధించకుండా మినహాయింపు ఇచ్చారు. దీనికి గల కారణం తెలిస్తే అందరూ షాక్ తింటారు. వివరాల్లోకి వెళితే..

దేశంలో ఎక్కడైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా.. ర్యాష్ డ్రైవింగ్ చేసినా, హెల్మెట్ ధరించకపోయినా పోలీసులు జరిమానా విధిస్తుంటారు. కానీ గుజరాత్ లో మాత్రం ఓ వ్యక్తి హెల్మెట్ పెట్టుకోకపోయినా ట్రాఫిక్ పోలీసులు ఏమాత్రం పట్టించుకోరు. కారణం ఏంటో తెలిస్తే అందరూ షాక్ తింటారు. అసలు విషయానికి వస్తే.. గుజరాత్ ఉదయ్ పూర్ కి చెందిన జాకిర్ మెమన్ హెల్మెట్ పెట్టుకోకుండా ద్విచక్రవాహనం నడుపుతున్నా పోలీసులు అతన్ని చూసీ చూడనట్టు ఉంటారు.

పండ్ల వ్యాపారం చేస్తున్న జాకిర్ మెమన్ 2019 లో హెల్మెట్ లేకుండా గుజరాత్ పోలీసులకు పట్టుబడ్డాడు. జరిమానా విధించే సమయంలో జాకిర్ చెప్పిన కారణం విని ఆశ్చర్యపోయారు. తన తలకు సరిపడ హెల్మెట్ ఎక్కడ దొరకడం లేదని పోలీసులకు చెప్పాడు. అది నమ్మని పోలీసులు జాకీర్ ని వెంట పెట్టుకొని పలు షాపులకు తిరిగారు. కానీ ఎక్కడ కూడా జాకీర్ తలకు సరిపడ హెల్మెట్ లభించలేదు. అప్పుడు జాకీర్ చెప్పింది నిజమే అని పోలీసులు నమ్మారు. నాటి నుంచి పోలీసులకు దొరికినా అతనికి చలాన్ విధించకుండా వదిలి వేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి