iDreamPost

Major Movie మేజర్ ప్రీమియర్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి?

Major Movie మేజర్ ప్రీమియర్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి?

ఈ శుక్రవారం విడుదల కాబోతున్న మేజర్ మీద హైప్ పెరుగుతోంది. ప్రీ రిలీజ్ ప్రీమియర్ల కోసం అడవి శేష్ దేశం మొత్తం ఒక రౌండ్ వేస్తున్నాడు. మహేష్ బాబు కూడా నిర్మాతల్లో ఒకరు కావడంతో ఆయనే స్వయంగా ప్రోమోల్లో నటిస్తూ బజ్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇది రెగ్యులర్ కమర్షియల్ మూవీ కాకపోవడం వల్ల దేశభక్తిని ప్రేరేపించే విధంగా ఇందులో ఎలాంటి సందేశం ఉందో పబ్లిక్ కి చెప్పే విధంగా పబ్లిసిటీని ప్లాన్ చేశారు. నిన్న వైజాగ్ శరత్ థియేటర్లో మేజర్ ప్రీమియర్ ని ఉచితంగా ప్రదర్శించడంతో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే చేశారు. టీమ్ తో పాటు వేలాది అభిమానులు ఇందులో పాల్గొని తర్వాత ర్యాలీ నిర్వహించారు.

ఈ ప్రీమియర్ల నుంచి అందుతున్న రిపోర్ట్స్ ని బట్టి చూస్తుంటే మేజర్ అంచనాలు అందుకుంది. మేజర్ ఉన్నికృష్ణన్ జీవితాన్ని స్పృశించిన తీరు, ముంబై దాడుల్లో తీవ్రవాదులతో పోరాడిన తీరుని అత్యద్భుతంగా చూపించారట. శేష్ కి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం ఖాయం. ప్రకాష్ రాజ్, రేవతి పాత్రల ద్వారా పండించిన ఎమోషన్ ఎంతటి కఠినమైన వారికైనా కన్నీళ్లు తెప్పిస్తాయని హాల్లో ప్రత్యక్షంగా చూసినవారంటున్నారు. ది కాశ్మీర్ ఫైల్స్ చూశాక జనంలో కలిగిన భావోద్వేగాల కంటే ఎక్కువగా ఇందులో సెకండ్ హాఫ్ పోర్షన్స్ చాలా బాగా కుదిరాయట. పూణే లాంటి నగరాల్లో పలువురు బయటికొస్తూ సెల్యూట్ చేయడం ఆల్రెడీ చూశాం.

గూఢచారి ఫేమ్ శశికిరణ్ తిక్కా టేకింగ్ నెక్స్ట్ లెవెలని రిపోర్ట్, యాక్షన్ ఎపిసోడ్స్ ని డీల్ చేసిన తీరు మాస్ కి సైతం గూస్ బంప్స్ ఇస్తాయని అంటున్నారు. అన్ని సాంకేతిక విభాగాల కష్టం తెరమీద కనిపిస్తుంది. మొత్తానికి మేజర్ ఊహించినట్టే బాగున్నాడనే మాట వినిపిస్తోంది. కమల్ హాసన్ విక్రమ్, అక్షయ్ కుమార్ సామ్రాట్ పృథ్విరాజ్ లతో పోటీ ఉన్నప్పటికీ మేజర్ కు ఎలాంటి ఇబ్బంది ఉండేలా కనిపించడం లేదు. పైగా ఆ రెండింటితో పోలిస్తే క్యాస్టింగ్ విషయంలో మేజర్ వీక్ గా ఉన్నప్పటికి కంటెంట్ వైస్ మాత్రం అడవి శేష్ ఎక్కువ ఎడ్జ్ తీసుకుంటున్నాడు. మరి నిజంగానే మేజర్ పోరాటం విజయవంతమయ్యిందా లేదా అనేది జూన్ 3 తేలిపోతుంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి