iDreamPost

మహిళల కోసం అదిరిపోయే స్కీమ్.. 5 ఏళ్లలో పొందే వడ్డీ కేవలం 2 ఏళ్లలోనే..!

Mahila Samman Saving Certificate Scheme: పోస్టాఫీస్‌ అనేక మంచి పథకాలతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఎలాంటి రిస్క్‌ లేకుండా మంచి వడ్డీ పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. తాజాగా మహిళల కోసం ఓ అద్భుత స్కీమ్ ను ప్రారంభించింది.

Mahila Samman Saving Certificate Scheme: పోస్టాఫీస్‌ అనేక మంచి పథకాలతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఎలాంటి రిస్క్‌ లేకుండా మంచి వడ్డీ పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. తాజాగా మహిళల కోసం ఓ అద్భుత స్కీమ్ ను ప్రారంభించింది.

మహిళల కోసం అదిరిపోయే స్కీమ్.. 5 ఏళ్లలో పొందే వడ్డీ కేవలం 2 ఏళ్లలోనే..!

కేంద్ర ప్రభుత్వం సంస్థల్లో ప్రధానమైనది తపాల శాఖ. గతంలో ఇది కేవలం సమాచారం చేరవేతకు మాత్రమే ఉపయోగపడేది. సమాజంలో జరుగుతున్న మార్పులతో ఫోస్టాఫీస్ కూడా అప్ డేట్ అయింది. కేవలం వార్త సమాచారమే కాకుండా.. అనేక సేవలను ప్రజలకు అందిస్తుంది. బ్యాంకులకు ధీటుగా అనేక సదుపాయాలను పోస్టాఫీస్ అందిస్తుంది. అలానే మహిళ, వృద్ధులకు, పిల్లలకు ఉపయోగపడేలా ఆర్థిక పరమైన స్కీమ్స్ ను తపాల శాఖ ప్రారంభించింది.  తాజాగా మహిళలకు తక్కువ సమయంలో ఎక్కువ వడ్డీ వచ్చే మరో స్కీమ్ ను పోస్టాఫీస్ అందుబాటులోకి తెచ్చింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

పోస్టాఫీస్‌ అనేక మంచి పథకాలతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఎలాంటి రిస్క్‌ లేకుండా మంచి వడ్డీ పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. సాధారణంగా అయితే ఎక్కువ మంది పెట్టుబడి అనగానే ఫిక్స్ డి డిపాడిట్ల వైపు మొగ్గు చూపుతారు. ఇలా ఫిక్స్ డిపాజిట్లలో అయితే ఎక్కువ కాలం పెట్టుబడులను  ఉంచాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలోనే తక్కువ సమయంలో ఎక్కువ లాభం పొందేలా పోస్టాఫీస్‌ మహిళల కోసం ప్రత్యేకంగా ఓ పథకం అందిస్తోంది.

పోస్టాఫీస్ మహిళల కోసం “ మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్” అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్ లో మహిళలు కేవలం 2 ఏళ్లు మాత్రమే పెట్టుబడి పెడితే సరిపోతుంది. దీనికి 7.5శాతం వడ్డీ లభిస్తుంది. మాములుగా అయితే ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌లో 5 ఏళ్లపాటు పెట్టుబడి పెడితే ఆ వడ్డీ లభిస్తుంది. కానీ ఈ స్కీమ్‌లో కేవలం రెండేళ్లలోనే ఈ వడ్డీని పొందొచ్చు.  ఎక్కువ కాలం డబ్బు పెట్టుబడి పెట్టకుండానే మంచి వడ్డీ పొందొచ్చన్నమాట. అయితే ఈ పథకంలో అకౌంట్ ఓపెన్ చేయాలనుకునే మహిళలకు 18 ఏళ్లు దాటి ఉండాలి. అలానే 18 ఏళ్ల లోపు బాలికలు అయితే తల్లిదండ్రుల ద్వారా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. కనిష్టంగా రూ.1000 లతో ఈ పథకంలో చేరవచ్చు. అలానే గరిష్టంగా 2 లక్షలు ఈ పథకంలో పెట్టుబడి పెట్టొచ్చు. ఈ స్కీమ్ కింద మూడు నెలలు ఒకసారి వడ్డీని లెక్కిస్తారు.

ఉదాహరణకు మహిళలు ఈ స్కీమ్ లో రూ. 50 వేలు పెట్టుబడి పెట్టారనుకుంటే. మీరు రెండేళ్లకు రూ. 8011 వడ్డీ అందుకుంటారు. ఇలా రెండేళ్ల తర్వాత రూ. 58011ని వడ్డీ రూపంలో పొందొచ్చు. అదే రూ. లక్ష పెట్టుబడిగా పెడినట్లు అయితే 7.5 శాతం వడ్డీతో రెండేళ్ల టైమ్ కి రూ. 1,16,022 రిటర్న్స్‌ పొందొచ్చు. ఏదైనా అవసరం దృష్ట్యా మీరు మెచ్యూరిటీ టైమ్ కంటే ముందే డబ్బులు తీసుకోవాలనుకుంటే ఏడాది తర్వాత 40 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. ఉదారహణకు రూ. 2 లక్షలు డిపాజిట్ చేస్తే ఏడాది తర్వాత రూ. 80 వేలు  తీసుకోవచ్చు. ఈ స్కీమ్ ను పోస్టాఫీస్ తో పాటు అర్హత కలిగిన కొన్ని బ్యాంకుల్లో ఈ స్కీమ్ కి సంబంధించి అకౌంట్ ఓపెన్ చేయోచ్చు. మరి.. మహిళల కోసం తీసుకొచ్చిన ఈ స్కీమ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి