iDreamPost

Mahesh Nephew: మహేష్ మేనల్లుడి లేటెస్ట్ ఫొటోస్ వైరల్.. అచ్చం మహేష్ లానే !

  • Published Jun 15, 2024 | 8:20 AMUpdated Jun 15, 2024 | 8:20 AM

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ అందానికి , మేనరిజంకు ఫిదా అవ్వని వారు ఎవరు ఉండరు. ఈ క్రమంలో ఇప్పుడు అచ్చం అలానే మహేష్ కుటుంబం నుంచి.. అంతే మేనరిజంతో ఆకట్టుకుంటున్నాడు మహేష్ మేనల్లుడు. తాజాగా అతనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ అందానికి , మేనరిజంకు ఫిదా అవ్వని వారు ఎవరు ఉండరు. ఈ క్రమంలో ఇప్పుడు అచ్చం అలానే మహేష్ కుటుంబం నుంచి.. అంతే మేనరిజంతో ఆకట్టుకుంటున్నాడు మహేష్ మేనల్లుడు. తాజాగా అతనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  • Published Jun 15, 2024 | 8:20 AMUpdated Jun 15, 2024 | 8:20 AM
Mahesh Nephew: మహేష్ మేనల్లుడి  లేటెస్ట్ ఫొటోస్ వైరల్.. అచ్చం మహేష్ లానే !

ఇండస్ట్రీలో మహేష్ బాబు మైంటైన్ చేసే.. స్టైల్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆ స్టైల్ కు మేనరిజంకు ఫిదా అవ్వని వారు ఎవరు ఉండరు. అప్పటికి ఇప్పటికే మహేష్ ఏజ్ పెరుగుతుందే కానీ.. ఆ అందం మాత్రం తరగడం లేదు. ఇక ఇప్పుడు అచ్చం ఇలానే మహేష్ కుటుంబం నుంచి .. అదే స్టైల్, మేనరిజంతో ఆకట్టుకుంటున్నాడు.. మహేష్ మేనల్లుడు. టాలీవుడ్ హీరోలలో ఒకడైన సుధీర్ బాబు.. మహేష్ చెల్లెలు పద్మినిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. ఆ జంటకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారిలో పెద్ద కుమారుడు చరిత్ మానస్. సోషల్ మీడియాలో ఇప్పటికే ఇతనికి సంబందించిన ఫొటోస్ అడపా దడపా చూసే ఉంటారు. ఇప్పుడు లేటెస్ట్ గా చరిత్ మానస్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దానికి సంబంధించిన వివరాలను చూసేద్దాం.

ఇప్పటికే చరిత్ మానస్ కు సంబంధించిన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం చూసే ఉంటారు. అచ్చం మేనమామ పోలికే అంటూ పలు సందర్భాలలో అనేక కామెంట్స్ కూడా వినిపించాయి. ఇదే విషయాన్నీ సుధీర్ దగ్గర ప్రస్తావించినా కూడా .. మరో మహేష్ అయితే మంచిదే కదా అని అంటూ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా తన కొడుకును సినిమాలలోకి తీసుకుని వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటూ గతంలో సుధీర్ బాబు ప్రస్తావించారు. ఇక మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే .. ఇదివరకే చైల్డ్ ఆర్టిస్ట్ గా తన తండ్రి సుధీర్ బాబూ సినిమాలో కూడా నటించాడు చరిత్ మానస్. ఇక ఇప్పుడు మరో మహేష్ ఫోటోలు.. అదే మహేష్ మేనల్లుడి లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

తాజాగా సుధీర్ బాబు నటించిన.. హరోం హర సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చరిత్ తన స్నేహితులతో కలిసి.. హైదరాబాద్ లోని ఏఎమ్ బి మాల్ కి వెళ్ళాడు. ఆ సమయంలో చరిత్ కెమెరాలకు చిక్కడంతో.. ఆ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అచ్చం మహేష్ ఎలా నడుస్తాడో.. మహేష్ ఎలా ఉంటాడో.. అలానే ఉన్నాడు చరిత్.. దీనితో ఇండస్ట్రీలో మరో మహేష్ అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. మరి ఈ మరో మహేష్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అనే విషయంపై ఇప్పటివరకు అయితే ఏ క్లారిటీ లేదు. ఒకవేళ చరిత్ కూడా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇస్తే మాత్రం.. టాలీవుడ్ ఇండస్ట్రీకి మరో మహేష్ దొరికేసినట్లే. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి