iDreamPost

శ్రీమంతుడు కాపీ వివాదం! తెరపైకి రూ. 15 లక్షల టాపిక్‌! మేకర్స్‌ క్లారిటీ!

  • Published Feb 02, 2024 | 1:14 PMUpdated Feb 02, 2024 | 1:14 PM

Srimanthudu Movie: దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో వచ్చిన శ్రీమంతుడు సినిమాపై కాపీ రైట్‌ వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మేకర్స్‌ దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలు..

Srimanthudu Movie: దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో వచ్చిన శ్రీమంతుడు సినిమాపై కాపీ రైట్‌ వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మేకర్స్‌ దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలు..

  • Published Feb 02, 2024 | 1:14 PMUpdated Feb 02, 2024 | 1:14 PM
శ్రీమంతుడు కాపీ వివాదం! తెరపైకి రూ. 15 లక్షల టాపిక్‌! మేకర్స్‌ క్లారిటీ!

సినిమాలో సందేశాన్ని యాడ్‌ చేసి.. కమర్షియల్‌గా విజయం సాధించేలా చిత్రాలను తెరకెక్కించడంలో దర్శకుడు కొరటాల శివ సిద్ధహస్తుడు. మిర్చి, జనతా గ్యారేజ్‌, శ్రీమంతుడు వంటి చిత్రాలు ఆ కోవకు చెందినవే. మిగతా సినిమాల సంగతి అలా ఉంచితే.. కొరటాల శివ-మహేష్‌ బాబు కాంబినేషన్‌లో వచ్చిన శ్రీమంతుడు సినిమా ఎంత భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాను ఆదర్శంగా తీసుకుని పలువురు సెలబ్రిటీలు.. గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేశారు. భారీ వసూళ్లు సాధించి.. బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది శ్రీమంతుడు చిత్రం.

2015లో విడుదలైన శ్రీమంతుడు చిత్రాన్ని పాత వివాదాలు మాత్రం ఇంకా వదలడం లేదు. గతంలోనే ఈ సినిమా కథ విషయంలో ఓ వివాదం తెర మీదకు వచ్చింది. శ్రీమంతుడు కథ తనదే అంటూ రచయిత శరత్‌ చంద్ర ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వివాదంలో దర్శకుడు కొరటాల శివకు సుప్రీంకోర్టులో చుక్కెదురుయ్యింది. ఆయనపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలంటూ.. కోర్టు ఆదేశించింది. ఇదిలా ఉండగా.. శరత్‌ చంద్ర మాట్లాడుతూ.. గతంలోనే ఈ వివాదంలో కొందరు సినీ పెద్దలు ఎంటరయ్యి.. తనకు 15 లక్షల రూపాయలు ఇచ్చి.. రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. కానీ తాను అంగీకరించలేదు అని తెలిపాడు.

ఈ క్రమంలో తాజాగా ఈ అంశంపై శ్రీమంతుడు మేకర్స్‌ స్పందించారు. శ్రీమంతుడు కథ విషయంపై అప్పుడే ఎవరూ ఎలాంటి అభిప్రాయాలకు రావొద్దని వారు విజ్ఞప్తి చేశారు. శ్రీమంతుడు సినిమాతో పాటుగా.. చచ్చేంత ప్రేమ అనే నవల రెండూ కూడా అందరికీ అందుబాటులో ఉన్నాయని.. ఒకసారి రెండింటిని పరిశీలించాలని కోరారు. ఈ రెండు వేటికవే ప్రత్యేకం అని.. రెండు ఒకటి కావన్నారు. సినిమా, పుస్తకం రెండింటిని పరిశీలిస్తే వాస్తవం ఏటో తెలుస్తుంది అన్నారు. ఈ వ్యవహారం ఇప్పటికి కూడా కోర్టు పరిధిలోనే ఉందని.. కనుక దీనిపై ఎవరూ అప్పుడే ఒక అభిప్రాయానికి రావొద్దని మీడియాతో పాటు.. ప్రజలకు విజ్ఞప్తి చేశారు మేకర్స్‌.

రూ.15 లక్షలు ఇచ్చి రాజీ: శరత్‌ చంద్ర

ఇక ఈ వివాదంపై రచయిత శరత్‌ చంద్ర కూడా స్పందించారు. తన కథను కాపీ కొట్టి దర్శకుడు కొరటాల శివ శ్రీమంతుడు సినిమాను తీశాడని ఆరోపించాడు. ఈ సందర్భంగా శరత్‌ చంద్ర మాట్లాడుతూ.. ‘‘2012లో నేను రాసిన చచ్చేంత ప్రేమ అనే నవల స్వాతి మాస పత్రికలో ప్రచురితమైంది. అప్పట్లో ఈ నవలకు విపరీతైమన క్రేజ్‌ ఉండేది. దాంతో ఈ కథతో ఓ సినిమా తీద్దామని భావించి.. దర్శకుడు సముద్రను కలిశాను. ఆయన కూడా అంగీకరించారు. త్వరలోనే ఈ నవలను సినిమాగా మొదలు పెట్టాలనుకున్నా సమయంలో శ్రీమంతుడు థియేటర్‌లో విడుదలైంది’’ అని తెలిపారు.

‘‘ఆ సమయంలో నా స్నేహితులు కొందరూ సినిమా చూసి.. అది నా కథే అని చెప్పడంతో.. నేను కూడా వెళ్లి శ్రీమంతుడు చిత్రం చూశాను. నా నవలలో ఉన్నది ఉన్నట్లు శ్రీమంతుడు సినిమాగా తీశారు. దాంతో నేను డైరెక్టర్‌ కొరటాల శివతో మాట్లాడాను. ఇది నా కథే అని చెప్పాను. కానీ ఆయన అంగీకరించలేదు. ఆ సమయంలో కొందరు సినీ పెద్దలు ఈ వివాదంలో మధ్యవర్తులుగా వ్యవహరించి.. నాకు 15 లక్షల రూపాయలు ఇచ్చి రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. నేను అందుకు అంగీకరించలేదు. ఈ వివాదంలో రచయితల అసోసియేషన్‌ నాకు ఎంత మద్దతుగా నిలిచింది. వారి సాయంతోనే నేను కోర్టును ఆశ్రయించాను. ఇప్పటికైనా ఈ కథ నాదేనని అంగీకరించమని కోరుకుంటున్నాను’’అన్నారు శరత్‌ చంద్ర. మరి ఈ వివాదం ఎప్పుడు సద్దుమణుగుతుందో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి