iDreamPost

మహేష్ బాబు కెరీర్ లో మొదటిసారి

మహేష్ బాబు కెరీర్ లో మొదటిసారి

సరిలేరు నీకెవ్వరు సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా త్వరలో మొదలుకానుంది. మహర్షి రూపంలో ప్రిన్స్ కి మెమరబుల్ హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఇది రూపొందనున్న సంగతి తెలిసిందే. ఎప్పుడు స్టార్ట్ చేస్తారనే క్లారిటీ ఇంకా లేదు కానీ సమ్మర్ కన్నా ముందే ఉండొచ్చని ఫిలిం నగర్ టాక్. తాజాగా దీనికి సంబంధించిన ఒక కీలక అప్ డేట్ ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేస్తోంది.

దాని ప్రకారం మహేష్ హీరోగా 26 సినిమాల కెరీర్ లో మొదటిసారి డ్యూయల్ రోల్ చేయబోతున్నాడు. ఒక పాత్ర లెక్చరర్ కాగా మరొకటి వైజాగ్ పోర్ట్ లో మాఫియా డాన్ గా ఉంటుందట. రెండు డిఫరెంట్ షేడ్స్ తో పాటు థ్రిల్ చేసే ట్విస్ట్ తో వంశీ ఈ కథ రాసుకున్నాడని తెలిసింది. యాక్షన్ సినిమాలనూ ఇతను బాగా డీల్ చేయగలడని గతంలో రామ్ చరణ్ ఎవడుతో ప్రూవ్ అయ్యింది. అందులో మసాలా కంటెంట్ మంచి వసూళ్లు తెచ్చింది.

ఇప్పుడు మహేష్ బాబు హీరో కాబట్టి ఇమేజ్ కు తగట్టు గూస్ బంప్స్ ఎపిసోడ్స్ ఎన్నో రాసుకుని ఉంటాడు. మహేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు ఓసారి డ్యూయల్ రోల్ చేశాడు. నాన్న కృష్ణ దర్శకత్వంలో రూపొందిన కొడుకు దిద్దిన కాపురంలో రెండు పాత్రలతో అలరించాడు. అందులో హీరోయిన్ విజయశాంతి. ఇంత గ్యాప్ తర్వాత సూపర్ స్టార్ ఇమేజ్ వచ్చాక మహేష్ డబుల్ ఫోటో అంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. మహేష్ కు ఓ జోడిగా ఇప్పటికే కియారా అద్వానీ ఫిక్స్ అయ్యిందని ఇప్పటికే లీకైంది. తమన్ మ్యూజిక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మరో నెలలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పటిదాకా వీటిలో దేనిని అఫీషియల్ అనలేం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి