iDreamPost

మహేష్ 28కి వంద కోట్ల లాభం

మహేష్ 28కి వంద కోట్ల లాభం

షూటింగ్ మొదలుకాకుండానే మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాకు విపరీతమైన క్రేజ్ ఏర్పడుతోంది. అతడు ఖలేజా తర్వాత ఈ ఇద్దరు చేస్తున్న చిత్రం ఇదే కావడంతో అంచనాలు మాములుగా లేవు. ఒకపక్క బడ్జెట్ లెక్కలు మరో పక్క బిజినెస్ డీల్స్ తో హారికా హాసిని టీమ్ యమా బిజీగా ఉంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం దీనికి నిర్మాతలు వేసుకున్న బడ్జెట్ 200 కోట్లు. మహేష్ పారితోషికం 60, త్రివిక్రమ్ 50, నిర్మాణానికి,రెమ్యునరేషన్లకు 90 కోట్లు వ్యయాన్ని ఫిక్స్ చేశారట ఇదేమి విజువల్ ఎఫెక్ట్ నిండిన సినిమా కాదు. అల వైకుంఠపురములో టైపు క్లీన్ కమర్షియల్ ఎంటర్ టైనర్. ఆల్రెడీ హైదరాబాద్ లో ఓ భారీ కాలనీ సెట్ కూడా వేశారు.

మరి ఇంత మొత్తాన్ని ఎలా రాబట్టుకుంటారనే డౌట్ వస్తోందా. నమ్మశక్యం కానీ రీతిలో లాభం రాబోతోంది. థియేట్రికల్ హక్కులు ఎలాగూ 150 కోట్ల దాకా అమ్ముడుపోతాయి. డిజిటల్, డబ్బింగ్, రీమేక్, శాటిలైట్ ఇలా మిగిలిన హక్కుల నుంచి ఈజీగా 150 కోట్లను రాబట్టుకోవచ్చు. ఆ మేరకు ఆల్రెడీ ప్రతిపాదనలు వివిధ సంస్థల నుంచి వచ్చాయట. సో ఇవన్నీ ఓకే అయితే మొత్తం పోను 100 కోట్ల లాభం కళ్లజూడవచ్చు. త్రివిక్రమ్ బ్రాండ్ ఇమేజ్ కి ఇదేమి ఆశ్చర్యపోయే మొత్తం కాదు. పైగా ఇంత గ్యాప్ తర్వాత సూపర్ స్టార్ కాంబినేషన్ అంటే ఆటోమేటిక్ గా హైప్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. దానికి తగ్గట్టే ఆఫర్లు డిస్ట్రిబ్యూటర్ల నుంచి అడ్వాన్సులు వస్తాయి.

వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మిగిలిన క్యాస్టింగ్ ని ఇంకా రివీల్ చేయాల్సి ఉంది. సంగీత దర్శకుడు తమన్ తన పనిని స్టార్ట్ చేశాడు. సర్కారు వారి పాటలో రెండు పాటలు మినహాయించి మిగిలినవాటికి పెద్దగా రెస్పాన్స్ రాకపోవడంతో దూకుడు రేంజ్ ఆల్బమ్ ఇవ్వాలనే ఒత్తిడి ప్రిన్స్ అభిమానుల నుంచి ఉంది. ఎలాగూ త్రివిక్రమ్ అంటే బెస్ట్ ఇచ్చే తమన్ ఇప్పుడు మహేష్ తోడైతే ఇంకా ఏం చేస్తాడో వేరే చెప్పాలా. వీలైతే 2023 సంక్రాంతి లేదా ఆ ఏడాది సమ్మర్ విడుదలకు ప్లాన్ చేసుకున్న ఈ ఎంటర్ టైనర్ తర్వాత రాజమౌళి సినిమా చేస్తాడు మహేష్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి