iDreamPost

కోబ్రా పైరసీకి చెక్, 17 వందలకు పైగా వెబ్ సైట్లు బ్లాక్ చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశం

కోబ్రా పైరసీకి చెక్, 17 వందలకు పైగా వెబ్ సైట్లు బ్లాక్ చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశం

పైరసీ ధాటికి విలవిల్లాడుతున్న విక్రమ్ సినిమా “కోబ్రా”కి మద్రాస్ హైకోర్టు బాసటగా నిలిచింది. “కోబ్రా” సినిమా పైరేటెడ్ వర్షన్ విడుదల చేయకుండా 1788 వెబ్ సైట్లను బ్లాక్ చేయాలంటూ 29 టెలికామ్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సెవెన్ స్క్రీన్ స్టూడియో తరఫున “కోబ్రా” నిర్మాత SS లలిత్ కుమార్ వేసిన పిటిషన్ కు స్పందిస్తూ జస్టిస్ సెంథిల్ కుమార్ రామమూర్తి ఈ మేరకు రూలింగ్ ఇచ్చారు. ఈ సినిమా కోసం తాము భారీగా ఖర్చుపెట్టామని, ఇది ఇంటర్నెట్ లో రిలీజైతే తీవ్రంగా నష్టపోతామని లలిత్ కుమార్ తన పిటిషన్ లో పేర్కొన్నారు.

ఆగస్టు 31న రిలీజవుతున్న “కోబ్రా”లో విక్రమ్ సరసన KGF ఫేమ్ శ్రీనిధి శెట్టి నటిస్తోంది. ఇండియన్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ విలన్ గా పరిచయమవుతున్నాడు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ఎ.ఆర్. రహమాన్ సంగీతం అందించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి