iDreamPost

LSG vs MI: స్టొయినిస్​ను భయపెట్టిన సచిన్ కొడుకు.. ఇది మామూలు అగ్రెషన్ కాదు!

  • Published May 17, 2024 | 8:40 PMUpdated May 17, 2024 | 8:40 PM

లక్నో పించ్ హిట్టర్ మార్కస్ స్టొయినిస్​ను బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ కొడుకు భయపెట్టాడు. అర్జున్ టెండూల్కర్ అగ్రెషన్ చూసి లక్నో బ్యాటర్ వణికిపోయాడు.

లక్నో పించ్ హిట్టర్ మార్కస్ స్టొయినిస్​ను బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ కొడుకు భయపెట్టాడు. అర్జున్ టెండూల్కర్ అగ్రెషన్ చూసి లక్నో బ్యాటర్ వణికిపోయాడు.

  • Published May 17, 2024 | 8:40 PMUpdated May 17, 2024 | 8:40 PM
LSG vs MI: స్టొయినిస్​ను భయపెట్టిన సచిన్ కొడుకు.. ఇది మామూలు అగ్రెషన్ కాదు!

బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ గురించి తెలిసిందే. తండ్రిలాగే క్రికెట్​ను ప్రొఫెషన్​గా తీసుకున్నాడు. ఎడమ చేతి వాటం ఆటగాడైన అర్జున్.. బౌలింగ్, బ్యాటింగ్ రెండూ లెఫ్టాండ్​తోనే చేస్తుంటాడు. ధనాధన్ బ్యాటింగ్​తో పాటు ఫాస్ట్ బౌలింగ్​తోనూ ఆకట్టుకుంటున్నాడు. అయితే అనుకున్నంత రేంజ్​లో ఆడలేకపోతున్న అతడికి గత ఐపీఎల్​లో పలు అవకాశాలు వచ్చినా పెద్దగా సక్సెస్ కాలేదు. 4 మ్యాచుల్లో 13 పరుగులు చేసి, 3 వికెట్లు తీశాడు. ఈసారి కూడా లీగ్ మొదట్నుంచి ఛాన్సుల కోసం ఎదురు చూస్తే.. ఆఖరి మ్యాచ్​లో ఆడే అవకాశం వచ్చింది. ఏస్ పేసర్ జస్​ప్రీత్ బుమ్రా స్థానంలో టీమ్​లోకి వచ్చాడతను. లక్నో సూపర్ జియాంట్స్​తో మ్యాచ్​లో బరిలోకి దిగిన అర్జున్ టెండూల్కర్.. ఇన్నాళ్లూ తనను పక్కనబెట్టారనే కోపం, కసిని బౌలింగ్​లో చూపించాడు. లక్నో బ్యాటర్లను బెంబేలెత్తించాడు.

లక్నో పించ్ హిట్టర్ మార్కస్ స్టొయినిస్​ను వణికించాడు సచిన్ కొడుకు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్​లోనే అతడికి చుక్కులు చూపించాడు. పకడ్బందీ బౌలింగ్​తో అతడ్ని కట్టిపడేశాడు. ఎల్బీడబ్ల్యూ రూపంలో అతడ్ని ఔట్ చేసినంత పని చేశాడు. అయితే రివ్యూలో బాల్ వికెట్ల పైనుంచి వెళ్తున్నట్లుగా కనిపించడంతో బతికిపోయాడు స్టొయినిస్. తన రెండో ఓవర్​లోనూ స్టొయినిస్​కు స్లో బౌన్సర్లు, కట్టర్స్, స్వింగింగ్ డెలివరీస్​తో ఇబ్బంది పెట్టాడు అర్జున్. అదే క్రమంలో ఓ బాల్​ను డిఫెండ్ చేసి కాస్త ముందుకు వచ్చాడు స్టొయినిస్. అయితే బంతిని అందుకున్న అర్జున్.. స్టొయినిస్ వైపు త్రో చేసేందుకు ప్రయత్నించి ఆగిపోయాడు. ఆ టైమ్​లో అతడి కళ్లలో కసి, కోపం చూసి స్టొయినిస్ భయపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి