iDreamPost

లిక్కర్‌ స్కాం కేసులో కీలక పరిణామం.. ఎంపీ అరెస్ట్‌!

లిక్కర్‌ స్కాం కేసులో కీలక పరిణామం.. ఎంపీ అరెస్ట్‌!

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసు గత కొన్ని నెలలుగా దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పలువురు ప్రముఖులు ఇప్పటికే జైలు పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగిలింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు పార్టీ కీలక నేతను అరెస్ట్‌ చేశారు. ఆప్‌ ఎంపీ సంజయ్‌ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆప్‌ నుంచి వరుసగా ఇది మూడవ అరెస్ట్‌.

ఇదే కేసుకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి మనీష్‌ శిసోడియా.. ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌లు ఇదివరకే అరెస్ట్‌ అయ్యారు. ఎంపీ సంజయ్‌ కుమార్‌ అరెస్ట్‌ నేపథ్యంలో ఆయన ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆయన్ని అరెస్ట్‌ చేసి తీసుకెళుతుండగా.. అనుచరులు, పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు.  సంజయ్‌ కుమార్‌కు మద్దతుగా శ్లోగాన్లు ఇస్తూ పోలీసులను పక్కకు వెళ్లనివ్వకుండా చేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో కొన్ని సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా, బుధవారం ఉదయం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు సంజయ్‌ కుమార్‌ ఇంట్లో సోదాలు నిర్వహించారు. అనంతరం ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీలాండరింగ్‌ యాక్ట్‌ కింద ఆయన్ని అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ అనంతరం ఆయన్ని ఢిల్లీలోని ఈడీ ఆఫీస్‌కు తీసుకెళ్లారు. మరి, ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్‌ కుమార్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు అరెస్ట్‌ చేయటంపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి