iDreamPost

ధోని నిర్మించిన ‘LGM’ మూవీ రివ్యూ!

రొమాంటిక్ కామెడీ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాని డైరెక్టర్ రమేష్ తమిళమణి రూపొందించారు. ఈ సినిమాలో హరీష్ కళ్యాణ్, లవ్ టుడే ఫేమ్ ఇవానా జంటగా నటించారు. కాగా.. తెలుగులో పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు కానీ..

రొమాంటిక్ కామెడీ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాని డైరెక్టర్ రమేష్ తమిళమణి రూపొందించారు. ఈ సినిమాలో హరీష్ కళ్యాణ్, లవ్ టుడే ఫేమ్ ఇవానా జంటగా నటించారు. కాగా.. తెలుగులో పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు కానీ..

ధోని నిర్మించిన ‘LGM’ మూవీ రివ్యూ!

టీమ్ ఇండియా మాజీ దిగ్గజ సారధి ధోనీ ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి.. నిర్మించిన ఫస్ట్ మూవీ LGM(లెట్స్ గెట్ మ్యారీడ్‌). గతవారం తమిళంలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో రిలీజ్ అయింది. రొమాంటిక్ కామెడీ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాని డైరెక్టర్ రమేష్ తమిళమణి రూపొందించారు. ఈ సినిమాలో హరీష్ కళ్యాణ్, లవ్ టుడే ఫేమ్ ఇవానా జంటగా నటించారు. కాగా.. తెలుగులో పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు కానీ.. ధోని ఫ్యాన్స్ సినిమా బాగుంటే ఆదరించేందుకు రెడీగా ఉన్నారు. ఇప్పటికి పాటలు, ట్రైలర్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోయినా.. కథలో కొత్త పాయింట్ ఇంటరెస్టింగ్ గా ఉంది. సో.. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం!

కథ:

గౌత‌మ్(హ‌రీష్ క‌ళ్యాణ్‌), మీరా(ఇవానా) ఒకే కంపెనీలో ప‌నిచేస్తూ రెండేళ్లుగా ప్రేమించుకుంటారు. తీరా ఒకరి ఇంట్లో ఒకరు పెళ్లి గురించి చెప్పే టైమ్ వస్తుంది. ఓవైపు గౌతమ్ కి పెళ్లి చేయాలని తల్లి లీల(నదియా) వెయిట్ చేస్తుంటుంది. ఇంతలో మీరాను లవ్ చేస్తున్న మ్యాటర్ తల్లికి చెప్తాడు గౌతమ్. అందుకు లీల వెంటనే ఓకే అని సర్ప్రైజ్ చేస్తుంది. కోడలిని కూతురుగా చూసుకోవాలని భావిస్తుంది. తల్లి ఓకే చేసిందని మీరాకి చెప్తాడు గౌతమ్. అప్పుడే ఊహించని షాక్ ఇస్తుంది మీరా. దీంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో.. కాబోయే అత్తతో ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తుంది మీరా. ఈ ట్రిప్ లో అత్త నచ్చితేనే పెళ్లి అని.. కండిషన్ పెడుతుంది. మరి గౌతమ్ కి మీరా ఏం చెప్పి షాకిచ్చింది? కాబోయే అత్తాకోడళ్ళ ట్రిప్ ఎలా సాగింది? చివరికి గౌతమ్ లవ్ సక్సెస్ అయ్యిందా లేదా? సినిమాలో చూడాల్సిందే.

విశ్లేషణ:

ఇండస్ట్రీలో అత్తాకోడళ్ళ మధ్య వార్ నేపథ్యంలో సినిమాలు రావడం కొత్త కాదు. గతంలో ఎన్నో సినిమాలు కాబోయే అత్తాకోడళ్ళ కాన్సెప్ట్ లతో వచ్చాయి. సక్సెస్ కూడా అయ్యాయి. అయితే.. వాటిలో మేజర్ పాయింట్.. కథాకథనాలు మాత్రమే కాదు.. మంచి కామెడీ కూడా. అవును.. అత్తాకోడళ్ళ కాన్సెప్ట్ అన్నాక ఖచ్చితంగా ఫన్ ఎక్స్ పెక్ట్ చేస్తారు. అలాగని మరి రొట్టకొట్టుడు కామెడీ ఉన్నా యాక్సెప్ట్ చేయడం కష్టం అవుతుంది. అయితే.. రెగ్యులర్ స్టోరీ పాయింట్ తీసుకున్న డైరెక్టర్ రమేష్ తమిళమణికి.. కొత్తదనంతో కూడిన స్క్రీన్ ప్లే సాగించడం LGM లో పెద్ద సవాల్ అని చెప్పాలి. ఒకే ఒక పాయింట్ ని బేస్ చేసుకొని పాత కాలపు ట్రీట్మెంట్ తో మూవీని నడిపే ప్రయత్నం చేశాడు.

అత్తాకోడళ్లు.. వారి మధ్య వార్.. ఇప్పుడున్న తరంలో ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ ని సినిమాగా చూపాలని అనుకున్నాడు డైరెక్టర్. కానీ.. ఇలాంటి కథలు మనం ఎక్కువగా సీరియల్స్ లో చూస్తుంటాం. ఎందుకంటే.. సీరియల్స్ లో ఎంత సాగదీస్తే అంతలా కనెక్ట్ అయిపోతారు ప్రేక్షకులు. కానీ.. సినిమాలలో అలా కాదుగా.. ఉన్న రెండున్నర గంటల టైమ్ లో చెప్పాలనుకున్న కథను చెప్పాలి. కానీ.. LGM సీరియల్ దారిలోనే సాగడం గమనార్హం. సినిమా విషయానికి వస్తే.. గౌతమ్, మీరా క్యారెక్టర్స్ లో హరీష్ కళ్యాణ్, ఇవానాలను పరిచయం చేస్తూ.. వారి లవ్ ట్రాక్ తో మూవీ మొదలవుతుంది. అక్కడినుండి మెల్లగా తల్లి లీలతో పాటు మిగతా క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ కథ స్టార్ట్ అవుతుంది.

ఇక గౌతమ్ క్యారెక్టర్ కి అసలు సవాల్.. ఇటు ప్రేమించిన అమ్మాయి గురించి చెప్పే సన్నివేశాలు.. దానికి తల్లి ఓకే చేయడం కొత్తగా ఉండదు. ఓవైపు మొదటినుండి సినిమా స్లోగా సాగుతుంటుంది. ఇందులో ఫుల్ పక్కన పెడితే కథలో వేగం ఎక్కడా కనిపించదు. కానీ.. ఇంటర్వెల్ టైమ్ లో మీరా గౌతమ్ కి ఇచ్చే షాకింగ్ ట్విస్టు కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. అదికూడా ఇంటర్వెల్ తర్వాత సినిమా సాగదీతలో కలిసిపోవడం గమనార్హం. ఎక్కడెక్కడ ఇంటరెస్ట్ క్రియేట్ చేయవచ్చో.. అన్నిచోట్లా స్క్రీన్ ప్లే డల్ అయిపోవడం జరిగింది. ఈ విషయంలో డైరెక్టర్ విఫలం అయ్యాడని చెప్పాలి. ఎందుకంటే.. క్లైమాక్స్ కి వచ్చేసరికి ప్రేక్షకుల ఓపికకు పరీక్ష పెట్టినంత పని అయిపోతుంది.

సినిమాలో కొత్త పాయింట్ ఏదైనా ఉందంటే.. అది కాబోయే అత్తాకోడళ్ళ ట్రిప్ మాత్రమే. కానీ.. కాన్సెప్ట్ ఉన్నంత కొత్తగా సినిమా సాగలేదు. అటు ఎమోషన్స్ ని కూడా పూర్తిస్థాయిలో రాసుకోలేకపోయాడు డైరెక్టర్. ఇటు కామెడీ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. సినిమా అంతా ఒకే లైన్ తో సాగడంతో బోర్ ఫీల్ రాకమానదు. అదిగాక సినిమాకు మ్యూజిక్ కూడా డైరెక్టరే అందించాడు. సాంగ్స్ కూడా వర్కౌట్ కాకపోవడం మరో మైనస్. అయితే.. లీడ్ క్యారెక్టర్ స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం బాగుంది. సినిమాలో కెమెరా వర్క్ పర్వాలేదు. ఎడిటర్ ట్రిమ్ చేయాల్సింది చాలా ఉంది. అసలు కామెడీ రాబట్టుకోవాల్సిన దగ్గర డైరెక్టర్ లూస్ గా వదిలేయడం.. క్లైమాక్స్ కి వచ్చేసరికి ఆడియన్స్ లో కన్ఫ్యూషన్ అర్ధం కాదు. సినిమాలో లీడ్ యాక్టర్స్ అంతా క్యారెక్టర్స్ కి న్యాయం చేశారు. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. కానీ.. డైరెక్టర్ గా, రైటర్ గా రమేష్ తమిళమణి నిరాశపరిచాడు. మరి LGM హిట్టా ఫట్టా అనేది ఆడియన్స్ డిసైడ్ చేయాల్సి ఉంది.

ప్లస్ లు:

  • లీడ్ యాక్టర్స్ పెర్ఫార్మన్స్
  • స్టోరీ లైన్
  • కెమెరా వర్క్

మైనస్ లు:

  • స్లోగా సాగే కథనం
  • కామెడీ
  • సన్నివేశాల సాగదీత

చివరిమాట: LGM.. బోరింగ్ భయ్యా!

రేటింగ్: 1.5/5

(ఈ రివ్యూ కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.. గమనించగలరు)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి