iDreamPost

తిరుమల నడకదారిలో చిక్కిన మరో చిరుత!

  • Published Sep 07, 2023 | 11:10 AMUpdated Sep 07, 2023 | 11:33 AM
  • Published Sep 07, 2023 | 11:10 AMUpdated Sep 07, 2023 | 11:33 AM
తిరుమల నడకదారిలో చిక్కిన మరో చిరుత!

భారత దేశంలో ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన తిరుమలకు నిత్యం వేల సంఖ్యల్లో భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తుంటారు. ఇటీవల అలిపిరి నడకమార్గంలో కృర జంతువులు భక్తులపై దాడి చేస్తూ గాయపర్చడం, చంపడం లాంటివి చేస్తున్నాయి. ఆ మద్య లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద లక్షిత అనే ఆరేళ్ల బాలికపై చిరుత దాడి చేసి చంపేసిన విషయం తెలిసిందే. దీంతో టీటీడీ ఇక్కడ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. చిరుతల సంచారం ఉన్న చోట బోను ఏర్పాటు చేసి పట్టుకుంటున్నారు. తాజాగా అలిపిరి-తిరుమల నడకమార్గంలో కొత్త మండపం వద్ద ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కుకుంది. వివరాల్లోకి వెళితే..

ఇటీవల అలిపిరి-తిరుమల నడక మార్గంలో చిరుత పులులు, ఎలుగు బంట్లు భక్తులపై దాడి చేస్తూ గాయపర్చడమే కాదు.. చంపేస్తున్నాయి. ఈ మద్య వరుస దాడులతో భక్తులు భయాందోళనకు గురి అవుతున్నారు. దీంతో టీటీడీ కృర జంతువులను పట్టుకునేందుకు గట్టి ఏర్పాటు చేస్తుంది. పలు చిరుతలు సంచరించే చోట కెమెరాలను ఏర్పాటు చేసింది. చిరుత, ఎలుగు బంట్లను బంధించే చర్యలు చేపట్టారు అధికారు. తాజాగా తిరులమ నడక మార్గంలో నరసింహ స్వామి ఆలయం ఏడో మైలు ప్రాంతంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కినట్లు అధికారులు వెల్లడించారు. నాలుగు రోజుల క్రితం ఏర్పాటు చేసిన కెమెరాలో చిరుత కంటపడగా.. వెంటనే అలర్ట్ అయిన టీటీడీ అధికారులు, ఫారెస్ట్ సిబ్బంది ఆ ప్రాంతంలో బోను ఏర్పాటు చేశారు.

బుధవారం రాత్రి సమయంలో చిరుత బోనులో చిక్కింది.  2 నెలల వ్యవధిలో 5 చిరుతలను అటవీశాఖ అధికారులు పట్టుకోవడం గమనార్హం. జూన్‌ 24, ఆగష్టు 14, ఆగష్టు 17, ఆగష్టు 28వ తేదీల్లో నాలుగు చిరుతలను అధికారులు పట్టుకున్నారు. తాజాగా చిక్కిన చిరుతతో మొత్తం ఐదు చిరుతలు అయ్యాయి.  ఇటీవల నెల్లూరుకి చెందిన లక్షిత అనే ఆరేళ్ల బాలిక చనిపోవడం, అంతకు ముందు కౌశిక్ అనే బాలుడిపై దాడి చేసి గాయపర్చడం తో టీటీడీ, అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ మధ్య నడక మార్గాన వెళ్లే భక్తులకు చేతి కర్రలు ఇచ్చిన విషయం తెలిసిందే. భక్తుల భద్రత కోసం అన్నిరకాల చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం తిరుమలతో ఆపరేషన్ చిరుత కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఐదు చిరుతలను బంధించగా.. మిగతా వాటి కోసం అన్వేషణ కొనసాగుతుందని అధికారులు అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి