iDreamPost

షావోమీ సంచలనం.. అదిరిపోయే ఫీచర్లతో ఎలక్ట్రిక్‌ స్పోర్ట్స్‌ కార్‌.. 15 ని. ఛార్జింగ్‌తో 520 కి.మీల రేంజ్!

చైనాకు చెందిన ప్రముఖ కంపెనీ షావోమీ కొత్త ఎలక్ట్రిక్ కారును పరిచయం చేసింది. స్టన్నింగ్ డిజైన్ తో ఈ కారు తెగ ఆకట్టుకుంటోంది. సింగిల్ ఛార్జ్ తోనే 800 కి.మీల వరకు ప్రయాణించొచ్చని కంపెనీ తెలిపింది.

చైనాకు చెందిన ప్రముఖ కంపెనీ షావోమీ కొత్త ఎలక్ట్రిక్ కారును పరిచయం చేసింది. స్టన్నింగ్ డిజైన్ తో ఈ కారు తెగ ఆకట్టుకుంటోంది. సింగిల్ ఛార్జ్ తోనే 800 కి.మీల వరకు ప్రయాణించొచ్చని కంపెనీ తెలిపింది.

షావోమీ సంచలనం.. అదిరిపోయే ఫీచర్లతో ఎలక్ట్రిక్‌ స్పోర్ట్స్‌ కార్‌.. 15 ని. ఛార్జింగ్‌తో 520 కి.మీల రేంజ్!

ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతోంది. ఆధునిక ఫీచర్లు, సింగిల్ ఛార్జ్ తోనే 100కు పైగా కి.మీల దూరం ప్రయాణించే వీలుండడంతో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్స్, కార్లు మార్కెట్ లో వాటి హవా కొనసాగిస్తున్నాయి. కస్టమర్ల అభిరుచులను దృష్టిలో పెట్టుకుని ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీలు మతిపోయే ఫీచర్లు, స్టన్నింగ్ డిజైన్ తో ఎలక్ట్రిక్ వెహికిల్స్ ను రూపొందిస్తూ మార్కెట్ లోకి ప్రవేశపెడుతున్నాయి. ఈ క్రమంలో మరో అద్భుతమైన ఎలక్ట్రిక్ కారు ఈవీ లవర్స్ కు అందుబాటులోకి రాబోతోంది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షావోమీ సరికొత్త ఎలక్ట్రిక్ కారు ఎస్‌యూ7ను పరిచయం చేసింది.

చైనాకు చెందిన దిగ్గజ స్మార్ట్ ఫోన్ కంపెనీ షావోమీకి చెందిన గాడ్జెట్స్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఫోన్లు, స్మార్ట్ వాచ్ లు, ఇయర్ బడ్స్ వంటి ప్రోడక్ట్స్ ను తీసుకొచ్చింది ఇప్పుడు ఏకంగా కార్లను తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. షావోమీ నుంచి తొలి ఎలక్ట్రిక్ కారు రాబోతోంది. తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును డిస్‌ప్లే చేసింది. బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024లో షావోమీ ఎస్‌యూ7 డిస్‌ప్లే చేసింది షావోమీ కంపెనీ. షావోమీ ఎస్‌యూ7 అనేది ఒక స్లీక్, స్పోర్టీ సెడాన్ కారు. ఈ కారు బ్లూ కలర్‌లో స్టన్నింగ్ డిజైన్ తో విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఎస్‌యూ7లో 101 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని అమర్చారు. సింగిల్ ఛార్జ్ తో ఏకంగా 800 కి.మీల వరకు ప్రయాణించొచ్చని కంపెనీ వెల్లడించింది. 2.78 సెకన్లలోనే గంటకు 100 కి.మీల వేగాన్ని అందుకోనున్నట్లు తెలిపింది. ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 15 నిమిషాలు ఛార్జింగ్ పెడితే 510 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని కంపెనీ ప్రకటించింది. షావోమీ ఎస్‌యూ7 ధర రూ. 50 లక్షల లోపే ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ కారును భారత మార్కెట్ లోకి త్వరలోనే లాంఛ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Beebom (@beebomco)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి