iDreamPost

లేడీ సింగర్ తో కమెడియన్ పరాచకాలు.. లైవ్ లో దూలతీర్చేసింది!

Lady Singer Attacks Comedian: ఇటీవల టెలివిజన్ ఛానల్ నిర్వహించే లైవ్ షోలో గెస్టుల మధ్య వివాదాలు శృతి మించి కొట్టుకున్న సందర్భాలు ఎన్నో జరిగాయి.. అలాంటి ఘటనే ఓ ఛానల్ లో జరిగింది.. ప్రస్తుతం అది వైరల్ గా మారింది.

Lady Singer Attacks Comedian: ఇటీవల టెలివిజన్ ఛానల్ నిర్వహించే లైవ్ షోలో గెస్టుల మధ్య వివాదాలు శృతి మించి కొట్టుకున్న సందర్భాలు ఎన్నో జరిగాయి.. అలాంటి ఘటనే ఓ ఛానల్ లో జరిగింది.. ప్రస్తుతం అది వైరల్ గా మారింది.

లేడీ సింగర్ తో కమెడియన్ పరాచకాలు.. లైవ్ లో దూలతీర్చేసింది!

ఈ మధ్య కొన్ని టెలివిజన్ ఛానల్ వారు నిర్వహిస్తున్న డిబేట్ ప్రోగ్రామ్స్, ఇతర చిట్ చాట్ షోల్లో గెస్టుల మధ్య చెలరేగుతున్న గొడవలు కొట్టుకునే స్థాయికి వెళ్తున్నాయి. తాము లైవ్ లో ఉన్నామన్న విషయం మర్చిపోయి ఇష్టమొచ్చినట్లు బూతులు మాట్లాడటం, కొట్టుకుంటున్నారు. షో నిర్వాహకులు ఎంతో హుందాగా నిర్వహించాలని ప్లాన్ చేసినా.. గెస్టుల మద్య గొడవలు చిలికి చిలికి గాలివానగా మారడంతో రచ్చ రచ్చ అవుతుంది. అలాంటి వీడియోలు క్షణాల్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా లైవ్ టీవీలో సరదాగా చిట్ చాట్ షో నడుస్తుంది.. అంతలోనే ఓ మహిళా సింగర్ అక్కడ ఉన్న కమెడియన్ తిడుతూ అతనిపై చేయి చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

పాకిస్థాన్ దేశంలో ఓ ప్రైవేట్ టెలివిజన్ ఛానల్లో చిట్ చాట్ షో నడుస్తుంది. ఈ షోకి పాకిస్థాన్ లేడీ సింగర్ షాజియా మంజూరు, ప్రముఖ కమెడియన్ షెర్రీ పాల్గొన్నారు. ఈ షోకి హైదర్ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. షోలో చిట్ చాట్ ముచ్చట్లు.. కబుర్లు నడుస్తున్నాయి. ఎంతో సరదాగా సాగిపోతున్న ఈ షోటో కామెడీ యాక్టర్ షెర్నీ.. సింగర్ షాజియాను ఉద్దేశిస్తూ ఓ చిన్న ఫ్రాంక్ చేశాడు. షాజియా నువ్వూ నేను పెళ్లి చేసుకొని హనీమూన్ వెళ్లాలంటే.. ఏవిధంగా వెళ్తే బాగుంటుందీ? అంటూ కామెడీ చేశాడు. అప్పటి వరకు హ్యాపీగా మాట్లాడిన షాజియా ఒక్కసారిగా కోపంతో ఊగిపోయింది. షాజియా.. కామెడీ యాక్టర్ షెర్నీ కోపంతో ఊగిపోతూ ఇలాంటి వల్గర్ కామెంట్స్ చేయడానికి నీకు సిగ్గులేదూ? నోటిని అదుపులో ఉంచుకోలేవా? ఫ్రాంక్ అయితే మాత్రం మహిళలకు ఇచ్చే గౌరవం ఇవ్వరా? మహిళలే కదా ఏది పడితే అది అడుతుతారా? అతని చెంప చెల్లుమనిపించింది.

టీవీ లైవ్ షోలోనే షాజియా అతనిపై చేయి చేసుకున్న సమయంలో పక్కనే ఉన్నమరో అతిధి, యాంకర్ చోద్యం చూస్తూ ఉండిపోయారు. ఆమె ఆవేశంలో తమపై దాడి చేస్తుందని భయపడ్డారు.  రెండు నిమిషాల తర్వాత యాంకర్ హైదర్ కలగజేసుకొని సర్ధిచెప్పారు. అలాగే ఎంత కామెడీ ప్రాంక్ అయినా ఓ లిమిట్ ఉంటుంది.. హద్దులు ఉంటాయి అంటూ కమెడియన్ పై అసహనం వ్యక్తం చేశారు యాంకర్. మరోవైపు షాజియా కోపం ఎంతకీ తగ్గకపోవడంతో షో కొద్దిసేపు ఆపి ఆమెను బయటకు పంపించివేశారు. ప్రస్తుతం దీనికి సంబంధంచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి