iDreamPost

వీడియో: RTC బస్సులో మహిళల ఫైట్.. చీరలు లాగి మరీ కొట్టేసుకున్నారు!

వీడియో: RTC బస్సులో మహిళల ఫైట్.. చీరలు లాగి మరీ కొట్టేసుకున్నారు!

దేశవ్యాప్తంగా రైల్వే తర్వాత అతి పెద్ద రవాణా వ్యవస్థ ఆర్టీసీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే ఆర్టీసీలో ఎన్నో పథకాలు ఉన్నాయి. విద్యార్థులకు, వృద్ధులకు, వికలాంగులకు ప్రత్యేక రాయితీ, ఉచిత ప్రయాణం అంటూ చాలా ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. అయితే ఇటీవల కాంగ్రెస్ ఒక అడుగు ముందుకేసి తమను గెలిపిస్తే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందని హామీ ఇచ్చి దానిని అమలు కూడా చేస్తోంది. అయితే అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ హామీ అయితే ఇచ్చింది కానీ.. అమలులో మాత్రం బొక్కబోర్లా పడుతోంది.

ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఉచిత ప్రయాణం పథకం వల్ల ఆర్టీసీ అధికారులు, డ్రైవర్లు, కండక్టర్లు తలలు పట్టుకుంటున్నారు. ఎందుకంటే బస్సులన్నీ మహిళలతో కిక్కిరిసిపోతున్నాయి. బస్సుల్లో ప్రయాణం చేయాలి అనుకునే పురుషులకు కూడా చాలా ఇబ్బందులు తప్పడం లేదు. మహిళల తాకిడితో కర్ణాటక ఆర్టీసీ బస్సుల్లో ఒక్క టికెట్ కూడా తెగే పరిస్థితి కనిపించడం లేదు. ఇదిలా ఉంటే ఆర్టీసీ బస్సుల్లో గొడవలు కూడా గట్టిగానే అవుతున్నాయి. సీట్ల కోసం మహిళలు కొట్టేసుకుంటున్నారు. తాజాగా ఒక వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. బస్సులో సీట్ల కోసం మహిళలు ఏకంగా చీరలు లాక్కుని మరీ కొట్టుకుంటున్నారు.

ఈ వీడియో చూసిన నెటిజన్స్ కాంగ్రెస్ ప్రభుత్వం తీరుని తప్పుబడుతున్నారు. కేవలం సిటీల్లో మాత్రమే ఉచిత ప్రయాణాన్ని పరిమితం చేస్తే బాగుంటుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉచితం అనబట్టే ఇంత ఒత్తిడి, గొడవలు జరుగుతున్నాయని చెబుతున్నారు. మరోవైపు ఈ విషయంపై కర్ణాటక రవాణా శాఖ మంత్రి స్పందించారు. తర్వలోనే ఈ ఉచిత ప్రయాణం పథకానికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఇది ఐదేళ్లపాటు సాగే పథకం కాబట్టి సరైన మార్గదర్శకాలు, షరతులు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు బీజేపీ ప్రభుత్వం ఈ పథకం ఐదేళ్ల పాటు సాగేది కాదంటూ ఎద్దేవా చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి