iDreamPost

KKR కప్ గెలిచిందని.. అన్నంత పని చేసిన క్రికెట్ ఫ్యాన్!

Lady Fan Shares Pic Which Shocks Fans: మనదేశంలో క్రికెట్ ని ఒక మతంలా చూస్తారు. కుల, మతాలకు అతీతంగా ఫ్యాన్స్ ఉంటారు. అయితే ఈ క్రికెట్ కి మగాళ్లలో మాత్రమే కాదు.. ఆడవారిలో కూడా డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. ఎంతలా అంటే తాము ఆరాధించే జట్టు గెలిస్తే దుస్తులు లేకుండా ఫోటోలు షేర్ చేస్తామనేంతగా ఫ్యాన్స్ ఉంటారు. ఓ లేడీ ఫ్యాన్ కూడా అన్నంత పని చేసింది.

Lady Fan Shares Pic Which Shocks Fans: మనదేశంలో క్రికెట్ ని ఒక మతంలా చూస్తారు. కుల, మతాలకు అతీతంగా ఫ్యాన్స్ ఉంటారు. అయితే ఈ క్రికెట్ కి మగాళ్లలో మాత్రమే కాదు.. ఆడవారిలో కూడా డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. ఎంతలా అంటే తాము ఆరాధించే జట్టు గెలిస్తే దుస్తులు లేకుండా ఫోటోలు షేర్ చేస్తామనేంతగా ఫ్యాన్స్ ఉంటారు. ఓ లేడీ ఫ్యాన్ కూడా అన్నంత పని చేసింది.

KKR కప్  గెలిచిందని.. అన్నంత పని చేసిన క్రికెట్ ఫ్యాన్!

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కి ఉన్న క్రేజ్ గానీ, ఫ్యాన్ బేస్ గానీ వేరే స్పోర్ట్స్ కి లేదు. అందులోనూ ఐపీఎల్ అంటే మనోళ్లు పడిచచ్చిపోతారు. సాధారణంగా వరల్డ్ కప్ లాంటి మ్యాచులు జరిగితే కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుఎన్సర్లు, సెలబ్రిటీలు తమ దేశ జట్టు గెలిస్తే పైన టాప్ విప్పేస్తా అనో.. లేక ముద్దు పెడతా అనో.. దుస్తులు విప్పుతా అనో ప్రకటిస్తుంటారు. ఆ మధ్య వరల్డ్ కప్ లో భారత్ గెలిస్తే ఓ నటి దుస్తులు లేకుండా తిరుగుతా అని ప్రకటించి సంచలనం సృష్టించింది. తాజాగా ఓ లేడీ ఫ్యాన్ కూడా ఐపీఎల్ 2024 ముందు ఇలాంటి ఛాలెంజే విసిరింది. అన్నట్టుగానే ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. 

అన్నంత పని చేసిన లేడీ ఫ్యాన్:

ఐపీఎల్ 2024లో కోల్కతా నైట్ రైడర్స్ టీమ్ కప్పు ఎగరేసుకుపోయిన సంగతి తెలిసిందే. లాస్ట్ వరకూ పోరాడిన ఎస్ఆర్హెచ్ టీమ్ తో తలపడి విజేతగా నిలిచింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై 8 వికెట్ల తేడాతో కేకేఆర్ జట్టు ఘన విజయాన్ని సాధించింది. కాగా ఐపీఎల్ మ్యాచులు ప్రారంభం కాకముందు ఓ కోల్కతా మహిళా అభిమాని ఒక ఛాలెంజ్ చేసింది. ఈ సీజన్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు విజయం సాధిస్తే తాను బ్రా లేకుండా ఫోటోలు పోస్ట్ చేస్తానని ప్రకటించింది. అయితే చెప్పినట్టుగానే ఆ లేడీ ఫ్యాన్ మాట నిలబెట్టుకుంది. కేకేఆర్ జట్టు మ్యాచ్ గెలిచిన వెంటనే అభిమానులు.. ఈ లేడీ ఫ్యాన్ చేసిన ఛాలెంజ్ ని గుర్తు చేస్తూ ఆమెకు మెసేజులు, కామెంట్లు చేశారు. బ్రా లేకుండా ఫోటోలు పెట్టాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఆ లేడీ ఫ్యాన్.. బ్రా లేకుండా దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది.

ఈ ట్విస్ట్ మీరు ఊహించలేరు భయ్యో:

దెబ్బకు కరువు గాళ్ళందరికీ ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఆమె ఇచ్చిన ట్విస్ట్ పోకిరి ఇంటర్వెల్ ట్విస్ట్ కంటే ఎక్కువగా ఉంది. బ్రా లేకుండా టాప్ లెస్ గా ఫోటోలు పోస్ట్ చేస్తుందని భావించిన ఫ్యాన్స్ కి ఆమె షాకిచ్చింది. బ్రా ధరించకుండా గోల్డెన్ కలర్ టాప్ ధరించిన ఫోటోలు మాత్రం పోస్ట్ చేసింది. దీంతో అభిమానులు బాగా డిజప్పాయింట్ అయ్యారు. యు చీట్.. మమ్మల్నే ఇంత మోసం చేస్తావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం.. ఆ అమ్మాయి ఏదో ఛాలెంజ్ చేసిందనుకో.. దాన్ని అమలుచేయమని డిమాండ్ చేసేయడమే.. తప్పు కదా.. ఒక అమ్మాయిని ఇలా చూడాలనుకోవడం. ఒకవేళ ఆ అమ్మాయి అలా నిజంగానే బ్రా లేకుండా ఫోటోలు పెడతానన్నా గానీ వద్దని చెప్పాలి గానీ చూపించమని అడగకూడదని.. అది సంస్కారం అనిపించుకోదని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి