iDreamPost

నా కామెడీతో చావు నుంచి ఇద్దర్ని కాపాడాను: కమెడియన్ వడివేలు!

  • Published May 30, 2024 | 7:16 PMUpdated May 30, 2024 | 7:16 PM

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న స్టార్ కమెడియన్ తన హాస్యంతో చనిపోవాల్సిన ఇద్దరి ప్రాణాలను కాపాడానని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. ఇంతకి ఆయన ఏవరంటే..?

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న స్టార్ కమెడియన్ తన హాస్యంతో చనిపోవాల్సిన ఇద్దరి ప్రాణాలను కాపాడానని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. ఇంతకి ఆయన ఏవరంటే..?

  • Published May 30, 2024 | 7:16 PMUpdated May 30, 2024 | 7:16 PM
నా కామెడీతో చావు నుంచి ఇద్దర్ని కాపాడాను: కమెడియన్ వడివేలు!

సాధారణంగా ఎవరైనా బాధలో ఉన్నా, మనసు బాగోలేకపోయినా వాటి నుంచి బయట పడేందుకు నచ్చిన సినిమా చూడటం, నచ్చిన ఆట ఆడటం వంటివి ఎక్కువగా చేస్తారు. అలాగే మరి కొంతమంది ఎంటర్టైన్మెంట్ కోసం కామెడీ సీన్స్ ను ఎక్కువగా చూడటం వంటివి చేస్తుంటారు.ఎందుకంటే.. మనకు నచ్చిన పని చేయడం వలన ఏదైతే మానసికంగా సతమతమవుతున్నమో దాని నుంచి ఈజీగా బయటపడవచ్చు. ఈక్రమంలోనే.. బాధపడే క్షణాల నుంచి నవ్వుకుని మైమరిచిపోయే క్షణాలకు వెళ్లిపోతాం. అయితే బాధలో ఉన్నవారు మాత్రమే ఇలా చేస్తే దాని నుంచి బయటపడతారు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. ఇలాంటి కామెడీ సీన్స్ అనేవి చనిపోవాళి అనుకున్న వారిని సైతం నవ్వుకుని ఆ ఆలోచనను విరమించుకొనేలా చేస్తుంది. ఇప్పుడు ఇదింతా ఎందుకు మాట్లాడుకుంటున్నాం అనుకుంటున్నారా.. తాజాగా కోమాలో ఉన్న ఓ బాలికను, అలాగే చనిపోవాలనుకునే ఓ మహిళ ప్రాణాలను తన హాస్యంతోనే.. ఆ చావు నుంచి బయటపడేలా చేసిందని స్టార్ కామెడిన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇంతకి ఆయన ఎవరంటే..?

నవ్వడం ఒక ‘భోగం’ నవ్వించడం ఒక ‘యోగం’ అంటారు పెద్దలు. మరి అలా ప్రేక్షకులని నవ్వించడానికి ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ కామెడియన్లు ఉన్నారు. అలాంటి వారిలో తమిళ హాస్యనటుడు ‘వడివేలు’ కూడా ఒకరు. తాజాగా ఈయన చెఫ్ వెంకటేష్ భట్ నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన హాస్యంతో ఓ ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డరంటూ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.ఈ సందర్భంగా వడివేలు మాట్లాడుతూ.. ‘ఓ 11 ఏళ్ల బాలిక అపస్మారక స్థితిలో కోమాలో ఉన్నప్పుడు, ఆసుపత్రిలోని వైద్యులు  ఈ అమ్మాయికి బాగా ఇష్టమైనది ఏది అని అడిగారట. అప్పుడు ఆ బాలిక   తల్లిదండ్రులు తమ కుమార్తెకు  వడివేలు కామెడీని చూడడం అంటే చాలా ఇష్టం అని చెప్పారు. దీంతో వెంటనే తన కామెడీ సన్నివేశాలను వెంటనే చూపించాలని డాక్టర్‌ సలహా ఇచ్చారు. ఈ క్రమంలోనే బాలిక తల్లిదండ్రులు ఆమెకు తన హాస్య సన్నివేశాలు చూపించడంతో వెంటనే ఆమె కోలుకుంది. ఇక కోమా నుంచి కోలుకున్న ఆ చిన్నారి తల్లిదండ్రులు తనకు కృతజ్ఞతలు తెలిపారని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే మరో సంఘటనలో ఒక మహిళ తన భర్త తనను అవమానించాడనే బాధతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిందట.

దీంతో ఇరుగుపొరుగు వారు ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లగా, ఆ మహిళ టీవీ చూస్తూ, ఉరేసుకోవడానికి రెడీ చేసుకున్న తాడుతో నిలబడి నవ్వుతూ ఉంది. దీంతో సంఘటన స్థాలానికి చేరుకున్న పోలీసులు మహిళను అడగగా.. చనిపోవాలి అనుకున్నప్పుడు వడివేలు వచ్చి చెడగొట్టాడని చెప్పింది. ఎందుకంటే.. ఆమె ఉరి వేసుకోబోతుంటే టీవీలో వడివేలు కామెడీ సీన్ వచ్చిందట. అది చూసి ఆత్మహత్య నిర్ణయాన్ని విరమించుని టీవీ చూస్తూ నిలబడ్డానని చెప్పుకొచ్చింది. ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వడివేలు ఫోన్ నంబర్ సంపాదించి అతనికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పారు. అయితే ఈ విషయం తనకు తెలిసినప్పటి నుంచి ఒక హాస్య నటుడిగా ఇంతకన్నా ఇంకా ఏం కావాలని అనిపించిందని’ వడివేలు చెప్పుకొచ్చారు. మరి, వడివేలు తన హాస్యంతో చావు నుంచి ఇద్దరిని కాపాడానని చెప్పిన ఆసక్తికర విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి