iDreamPost
android-app
ios-app

వరల్డ్‌ కప్‌ ఫైనల్‌.. ధోనికే సాధ్యం కానీ రికార్డ్‌ సాధించిన రాహుల్‌!

  • Published Nov 19, 2023 | 8:44 PMUpdated Nov 19, 2023 | 8:44 PM

వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్‌లో టీమిండియా వికెట్‌ కీపర్‌ కేఎల్‌ రాహుల్‌ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ధోని లాంటి గొప్ప వికెట్‌ కీపర్‌కు కూడా సాధ్యం కానీ రికార్డును రాహుల్‌ సాధించాడు. మరి ఆ రికార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం..

వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్‌లో భారత్‌-ఆస్ట్రేలియా హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో మ్యాచ్‌ మంచి రసవత్తరంగా సాగుతోంది. అయితే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ కమ్‌ వికెట్‌ కీపర్‌ కేఎల్‌ రాహుల్‌ ఓ అరుదైన రికార్డు సాధించాడు. ఈ వరల్డ్‌ కప్‌ సీజన్‌లో రాహుల్‌ ఇప్పటి వరకు 17 డిసిమిసల్స్‌ చేశాడు. అంటే.. 17 వికెట్లు పడటంలో రాహుల్‌ తోడ్పాటు ఉంది. అయితే.. టీమిండియా తరుఫున ఒక వన్డే వరల్డ్‌ కప్‌ సీజన్‌లో అత్యధిక డిసిమిసల్స్‌ చేసిన తొలి వికెట్‌ కీపర్‌గా రాహుల్‌ చరిత్ర సృష్టించాడు.

ఇది నిజంగా గొప్ప రికార్డు. ఎందుకంటే.. టీమిండియా తరఫున గొప్ప వికెట్‌ కీపర్‌గా ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని సైతం ఇలాంటి రికార్డు సాధించలేకపోయాడు. దాదాపు 4 వన్డే వరల్డ్‌ కప్‌లు ఆడిన ధోని.. ఎప్పుడు ఇన్ని వికెట్లు తీయలేదు. ఇకపోతే.. ఈమ్యాచ్‌లో మంచి రికార్డుతో పాటు కేఎల్‌ రాహుల్‌ మంచి ప్రదర్శన కూడా చేశాడు. టీమిండియా వెంటవెంటనే వికెట్లు కోల్పోయిన దశలో క్రీజ్‌లోకి వచ్చిన రాహుల్‌.. విరాట్‌ కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. 107 బంతుల్లో 66 పరుగులు చేసి, భారత ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. రాహుల్‌, కోహ్లీ, రోహిత్‌ మినహా మిగతా బ్యాటర్లు విఫలం కావడం, పిచ్‌ బ్యాటింగ్‌కు కష్టంగా ఉండటంతో టీమిండియా 240 పరుగులు మాత్రమే చేయగలిగింది. మరి ఈ మ్యాచ్‌తో కేఎల్‌ రాహుల్‌ అత్యధిక అవుట్లు చేసిన వికెట్‌ కీపర్‌గా నిలిచి, రికార్డు సాధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి