iDreamPost

KGF హీరోయిన్ బ్యాక్ స్టోరీ – ఇంత డిమాండా

KGF హీరోయిన్ బ్యాక్ స్టోరీ – ఇంత డిమాండా

చేసింది రెండు సినిమాలే. కాకపోతే అవి ఇండస్ట్రీ హిట్లు కావడంతో హీరోయిన్ శ్రీనిధి శెట్టి చెట్టెక్కి కూర్చుందని బెంగళూర్ టాక్. భారీ రెమ్యునరేషన్ తో నిర్మాతలకు షాక్ ఇస్తోందని అంటున్నారు. హీరో ఎవరైనా సరే రష్మిక మందన్న రేంజ్ లో 2 కోట్ల దాకా డిమాండ్ చేస్తున్నట్టు వినికిడి. నిజానికి శ్రీనిధికి కెజిఎఫ్ లో గొప్ప పెర్ఫార్మన్స్ ఇచ్చే స్కోప్ దక్కలేదు. ఇదంతా రాఖీ భాయ్ అలియాస్ యష్ వన్ మ్యాన్ షో. ఇంకా చెప్పాలంటే ఇతర ఆర్టిస్టులకు చాలా వేరియేషన్లు చూపించే అవకాశం దొరికింది కానీ శ్రీనిధి మాత్రం రెండు మూడు ఎక్స్ ప్రెషన్లు, క్లైమాక్స్ లో చనిపోయే బరువైన ఎమోషన్ తో అలా కానిచ్చేసింది. అంత మాత్రానికే ఇంత డిమాండ్ మరి.

నిజానికి శ్రీనిధి శెట్టి కెజిఎఫ్ టైంలో సంతకం చేసిన మరో సినిమా విక్రమ్ కోబ్రా. ఇది ఆగస్ట్ 11 న విడుదల కానుంది. కరోనా వల్ల పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ మీద తనకు పెద్ద ఆశలేమీ లేదు కానీ కెజిఎఫ్ క్రేజ్ ని వాడుకోవాలని మాత్రం గట్టిగా డిసైడ్ అయ్యింది. ఇప్పటిదాకా ఏ కొత్త సినిమాకూ సైన్ చేయలేదు. పలువురు తెలుగు నిర్మాతలు సంప్రదించినప్పటికీ ఫలితం లేకపోయిందని తెలిసింది. ఎంత దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవడం కరెక్టే అయినా మరీ ఇంతగా త్వరపడకూడదని అంటున్నారు. కెజిఎఫ్ తర్వాత యష్ ప్యాన్ ఇండియా ఇమేజ్ ని కాపాడుకునే ప్రయత్నంలో ఉండగా శ్రీనిధి ఇలా ప్లాన్ చేసుకుంటోంది.

శ్రీనిధి శెట్టి వ్యక్తిగత విషయాలకు వస్తే తన తల్లితండ్రులు ఇద్దరూ కర్ణాటకకు చెందిన వారే. వీళ్లది తుళు కుటుంబం. మంగళూరులో స్కూలింగ్ పూర్తి చేసిన శ్రీనిధి పైచదువులు బెంగుళూరులో చేసింది. ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ అందుకుంది. ఎన్నో కాంటెస్టులు, ఆటలు, పోటీలు, మోడలింగ్ లో పాల్గొన్న శ్రీనిధి మొదటి నుంచి సినిమా రంగమే టార్గెట్ గా పెట్టుకుంది. పదో ఏటనే తల్లి చనిపోయింది. తండ్రి అండతో చదువులు పూర్తి చేసి ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో కొంతకాలం ఉద్యోగం చేసింది. తనకు ఇద్దరు అక్కయ్యలు. మిస్ కర్ణాటక, మిస్ బ్యూటిఫుల్ స్మైల్, మిస్ దివా, మిస్ కాంగెనియాలిటీ టైటిల్స్ శ్రీనిధి ఖాతాలో ఉన్నాయి. మరి ఇప్పుడీ అందివచ్చిన కెరీర్ ని ఎలా ప్లాన్ చేసుకుంటుందో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి